విజయనగరం

నీటి ఎద్దడి రాకూడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఏప్రిల్ 29: జిల్లాలో వేసవిలో ఎటువంటి మంచినీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి కిమిడి మృణాళిని,ప్రజాప్రతినిధులతో కలసి తాగునీరు, నీరు-చెట్టు, ఉపాధి హామీ, సాగునీటి ప్రాజెక్టులు, పంట సంజీవని అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి రఘునాథరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా నివారించాలని స్పష్టంచేసారు. కలెక్టర్ పర్యవేక్షణలో తాగునీటి సరఫరా తదితర అంశాలపై మానటిరింగ్ సెల్ ఏర్పాటుచేసి సమీక్షించాలని ఆదేశించారు. కలెక్టర్ ఎం ఎం నాయక్ మాట్లాడుతూ జిల్లాలో 4కోట్ల 50లక్షల రూపాయలను తాగునీటికి కేటాయించామని, రెండు గిరిజన గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామని వివరించారు. శాసన సభ్యుల సూచలనలతో బోరుబావులు అవసరమైన ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పిడబ్ల్యుడి, సిపిడబ్ల్యుడి స్కీమ్‌లు మరమ్మతులు చేపట్టినట్లు చెప్పారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మృణాళిని మాట్లాడుతూ జనవరి నుండే అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి సమగ్ర ప్రణాళికలను అమలుచేసి నీటి ఎద్దడిని జిల్లాలో అధిగమించగలిగామని తెలిపారు. నాబార్డు, ప్రభుత్వ నిధుల నుండి చేపట్టిన నర్సిపురం,పాచిపెంట, దత్తిరాజేరు తాగునీటి ప్రాజెక్టులు సకాలంలోపూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని సూచించారు. పైపులైన్లు త్రాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా నుండి ప్రతిపాదించిన తొమ్మిది కోట్ల రూపాయలను మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి పల్లె హామీ ఇచ్చారు. నీరు-చెట్టు కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన చేపట్టి కరవు నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. చేపట్టిన 1550 పనుల్లో 112 పూర్తికావడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇతర జిల్లా నుండి 260 యంత్రాలను సమకూర్చి చెరువు పనులు నిర్వహిస్తున్నామని 374 పనులు ప్రగతిలో ఉన్నాయని వివరించారు. ఉపాధి హామీ కింద మూడువేల చెరువులు మరమ్మతులు చేస్తున్నామని డ్వామా పిడి ప్రశాంతి తెలిపారు. పంట సంజీవని కార్యక్రమం కింద 50వేల వ్యవసాయ కుంటలు తవ్వకానికి 10,200 పూర్తిచేసామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో రెండు లక్షల ఇంకుడు గుంతలు తవ్వుతున్నామని కలెక్టర్ అన్నారు. ఎన్టీ ఆర్ జలసిరి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, జూన్ నాటికి మంత్రి మృణాళిని తెలిపారు. తోటపల్లిప్రాజెక్టులో పిల్లకాలువల పనులు సకాలంలో పూర్తిచేసి వచ్చే ఖరీఫ్‌కు నీరు అందించాలని నీటిపారుదల అధికారులను ఆదేశించారు. నాగావళి, సువర్ణముఖి, వేగావతి, చంపావతి, గోస్తనీ నదులు అనుసంధానానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. చంద్రన్న బాట కార్యక్రమాన్ని సమీక్షించారు. రేషన్ కార్డులు, పింఛన్లు, జన్మభూమి దరఖాస్తులను పరిశీలించి అర్హులైనవారికి మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, ఎమ్మెల్యేలు కె ఎ నాయుడు, చిరంజీవులు, జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ లఠ్కర్, ఎజెసి నాగేశ్వరరావు, జడ్పీ సి ఇ ఓ రాజకుమారి, డిపి ఓ సత్యనారాయణ రాజు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.