విజయనగరం

గిరిజన సమస్యలు పరిష్కరించని సమావేశాలెందుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం, జూలై 17: గిరిజనుల సమస్యలు పరిష్కరించని ఐటిడి ఎ పాలకవర్గ సమావేశాలు దేనికని మైదానప్రాంత నిరుద్యోగుల సంఘ నాయకుడు ఆర్ శశిభూషణ్ పేర్కొన్నారు. మంగళవారం ఇక్కడి విలేఖరులతో మాట్లాడుతూ పాలకవర్గ సమావేశాల్లో గిరిజనుల సమస్యలు చర్చించినప్పటికీ అవి పరిష్కారానికి నోచుకోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకవర్గ సమావేశాల వల్ల లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశాలకు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖమంత్రి హాజరయి ఉంటే కొన్ని సమస్యలు పరిష్కారానికి అవకాశాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆర్డీవో కార్యాలయ నూతన భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన
పార్వతీపురం, జూలై 17: ఈనెల 18వ తేదీ బుధవారం ఉదయం 9.30గంటలకు స్థానిక ఆర్డీవో కార్యాలయ ఆవరణలో రూ.2కోట్లతో నిర్మించనున్న ఆర్డీవో కార్యాలయ నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర భూగర్భ గనుల శాఖామంత్రి సుజయకృష్ణరంగారావు శంకుస్థాపన చేయనున్నారు. ఈకార్యక్రమంలో పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారు.

రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి సుజయ్
బొబ్బిలి, జూలై 17: రాష్ట్రంలో 1400 ఆలయాలకు ధూపదీప నైవేద్యాలకు నిదులు మంజూరుచేస్తున్నామని, మిగిలిన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని రాష్టగ్రనులశాఖామంత్రి సుజయ్‌కృష్ణరంగారావు, దేవాదాయశాఖశాఖ కమిషనర్ అనురాధ తెలిపారు. చారిత్రాత్మకమైన బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయంలో జరుగుతున్న శాండ్‌బ్లాస్టింగ్, మరమ్మతు పనులను మంగళవారం పరిశీలించారు. పనుల వివరాలను ఆలయ అర్చకులు, దేవాదాయశాఖ సిబ్బంది ద్వారా కమిషనర్ అనురాధ అడిగితెలుసుకున్నారు. అనంతరం పలు సూచనలు, సలహాలు అందించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నిదేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ఇందులో భాగంగా వేణుగోపాలస్వామి ఆలయంలో శాండ్‌బ్లాస్టింగ్ పనులు జరుగుతున్నాయన్నారు. దేవాలయంలో పనిచేస్తున్న అర్చకులు, ఇతర ఉద్యోగులకు రెమ్యూనరేషన్ ఫండ్ కింద 250కోట్ల రూపాయల నిదులు మంజూరుచేసిందని, దీని ద్వారా ఏటా వడ్డీ రూపంలో వస్తున్న 12కోట్ల రూపాయలను వారి జీతభత్యాలకు చెల్లిస్తుందన్నారు. అలాగే ఇటీవల 12మంది సిబ్బందికి సెటిల్‌మెంట్ చేసినట్లు తెలిపారు. పూరాతన ఆలయాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.