విజయనగరం

తప్పు ఎవరిది? శిక్ష ఎవరికి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 17: పట్టణంలోని కంటోనె్మంట్ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్న పట్టణ అణగారిన బాలుర వసతి గృహానికి ఈ ఏడాది ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వహిస్తోంది. వసతి గృహానికి ఎలాంటి వసతులు లేనప్పటికీ ఆ భవనాన్ని మార్పు చేయాలని పీవో లక్ష్మణరావు ఆ ఎన్జీవో సంస్థను ఆదేశించగా భవనాన్ని మార్చకుండా, ఎలాంటి అనుమతులు లేకుండా తనకు బిల్లులు చెల్లించాలంటూ డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ వసతి గృహాన్ని 2012లో ప్రారంభించారు. ప్రతి ఏడాది ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కాగా, కేవలం మూడు గదులున్న భవనానికి రెండేళ్లకు రూ.1.73 లక్షలు విద్యుత్ బిల్లు రావడంతో అటు ఎన్జీవో సంస్ధ, ఇటు ఎస్‌ఎస్‌ఎ అధికారులు బిల్లును చెల్లించకపోవడంతో విద్యుత్‌శాఖ సిబ్బంది ఆ వసతి గృహానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో విద్యార్థులు గత నెల రోజులుగా చీకట్లోనే మగ్గారు. ఇదే విషయాన్ని ఎస్‌ఎస్‌ఎ పీవో వద్ద ప్రస్తావించగా అనుమతి లేకుండా పాఠశాల నిర్వహించడం వల్ల తాము విద్యుత్ బిల్లును పెండింగ్‌లో ఉంచామని బదులిచ్చారు. కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు ఆ ఎన్జీవో సంస్ధకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవని పీవో లక్ష్మణరావు తెలిపారు. అంతేగాకుండా విద్యుత్ ఛార్జీల భారం కూడా పరిమితికి మించి ఉందన్నారు. ఇదిలాఉండగా అనుమతి లేకుండానే వసతి గృహం నిర్వహించడం, వేసవిలో విద్యార్థులు ఇంటికి వెళ్లిపోయామని చెబుతుండగా, ఆ నెలలో కూడా ఎన్జీవో సంస్ధ రూ.1.35 లక్షలు బిల్లును క్లైయిమ్ చేయడంతో గమనార్హం. ఇదిలాఉండగా అనాధలు, బిచ్చగాళ్లు, తల్లిదండ్రులు లేని పిల్లలు, వీధి బాలలు, సెక్స్ వర్కర్ల పిల్లలను ఆ వసతి గృహంలో చేర్పించాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా తల్లిదండ్రులు ఉన్న పిల్లలతో వసతి గృహం నడుపుతున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. అన్ని సౌకర్యాలకు ఎస్‌ఎస్‌ఎ ప్రతీ నెల దాదాపు రూ.2 లక్షలు వెచ్చిస్తున్నా ఆ మేరకు విద్యార్థులకు సౌకర్యాలు అందడం లేదు. దీంతో ఎన్జీవో సంస్ధ నిర్లక్ష్యంపై పీవో ఆగ్రహం వ్యక్తం చేయడంతో దాని ప్రభావం పీవోకు ఎసరుపెట్టింది. పీవోను మాతృ సంస్థకు సరెండర్ చేయాలంటూ కలెక్టర్ ఆదేశించినట్టు సమాచారం. ఏది ఏమైనప్పటికీ తప్పు చేసిన వారిని విడిచిపెట్టి, ఇతరులకు శిక్ష విధించడం ఎంత వరకు సమంజసమని ఆ శాఖలో చర్చించుకుంటున్నారు.

మున్సిపల్ కౌన్సిల్ ఆమోదానికి నోచుకోలేని
అన్ కలెక్టబుల్ డిమాండ్ రైట్ ఆఫ్
* దృష్టి పెట్టని చైర్మన్, కమిషనర్
విజయనగరం (్ఫర్టు), జూలై 17: పట్టణంలో సంవత్సరాల తరబడి వసూలు కాకుండా పేరుకుపోయిన ఆస్తిపన్ను అన్‌కలెక్టబుల్ డిమాండ్‌ను రైట్ ఆఫ్ చేసేందుకు మున్సిపల్ రెవెన్యూ యంత్రాంగం చేపట్టిన సర్వే నివేదిక ఏడాది నుంచి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానానికి నోచుకోవడంలేదు. మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, కమిషనర్ టి.వేణగోపాల్ పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో దీనికి మోక్షం లభించడంలేదు. ఫలితంగా ప్రభుత్వ ఆశయం ఆచరణలో నీరుగారుతోంది. క్షేత్రస్థాయిలో సర్వేచేసిన అన్‌కలెక్టబుల్ డిమాండ్‌ను రైట్ ఆఫ్ చేసి మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తీసుకుని తీర్మాన పత్రాలను పంపాలని డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గత ఏడాది జూన్ 12వతేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తొమ్మిది కేటగిరీలకు సంబంధించిన వివరాలపై సర్వే చేయాలని ఆదేశించింది. దీనిలో భాగంగా ప్రాథమిక స్ధాయిలో తప్పుగా ఇంటి పన్ను విధించినట్లయినా, ఇల్లు కూలినట్లయినా, డబుల్ అసెస్‌మెంట్ జరిగినట్లయినా, రెండు అసెస్‌మెంట్లు ఒక డాక్యుమెంట్‌తో మిళితం అయినప్పుడు, ప్రాపర్టీ ట్రాస్ కానప్పుడు, పాత అసెస్‌మెంట్‌తో ఉన్న ఇల్లు కూల్చి నూతనంగా అపార్ట్‌మెంట్ నిర్మించినప్పుడు పాత అసెస్‌మెంట్ కొనసాగినా, అనేక సంవత్సరాలు ఇల్లు డోర్ లాక్ చేసి ఉన్నప్పుడు, టైం బార్ టాక్స్ గల ఇల్లు అయినప్పుడు, కోర్టు తీర్పుల మూలంగా టాక్స్ తగ్గింపు కేటగిరిలను పరిగణలోకి తీసుకుని క్షేత్రస్థాయిలో మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది సర్వే చేశారు. ఈ మేరకు 775 అసెస్‌మెంట్లకు సంబంధించి 10,56,86 456 రూపాయల అన్‌కలెక్టబుల్ డిమాండ్ ఉన్నట్లు సర్వేలో గుర్తించారు. ఈ అన్‌కలెక్టబుల్ డిమాండ్‌ను రైట్ ఆఫ్ చేసేందుకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం కోసం గత ఏడాది అక్టోబర్ 28వతేదీన జరిగిన కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టారు. మున్సిపల్ అజెండాలో కౌన్సిల్ తీర్మానం కోసమా? ఎరుక నిమిత్తమా? అనే దానిపై స్పష్టమైన సమాచారాన్ని మున్సిపల్ రెవెన్యూ యంత్రాంగం పొందుపర్చకపోవడంతో దీనిని తిరస్కరించారు. దీనికితోడు డబుల్ అసెస్‌మెంట్ జాబితాలో మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ పేరు ఉండటంతో వివాదాస్పదమైంది. డబుల్ అసెస్‌మెంట్ భనవాల జాబితాలో ‘నాపేరు చేరుస్తారా? మిమ్మల్ని నమ్మితే ఇలా చేస్తారా’? అంటూ అధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో జరిగిన సర్వేలో ప్రసాదుల రామకృష్ణ పేరు మీద డబుల్‌అసెస్‌మెంట్ ఉన్నట్లు గుర్తించారు. అప్పట్లో చైర్మన్‌తోపాటు కౌన్సిల్ సభ్యులు కూడా దీనిని వ్యతిరేకించి కౌన్సిల్‌లో ఆమోదించకుండా తిరస్కరించారు. అప్పటి నుంచి దీనికి మోక్షం లభించలేదు. రైట్ ఆఫ్ తీర్మానంపై మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, కమిషనర్ టి.వేణుగోపాల్ ఆసక్తి చూపకపోవడంతో కౌన్సిల్ ఆమోదానికి నోచుకోవడం లేదు. ఫలితంగా డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కె.కనకమహాలక్ష్మి, మున్సిపల్ రెవెన్యూ అధికారి పి.శ్రీనివాసరావులకు మోమోలు అందాయి. ఈనెల 23వ తేదీలోగా రైట్ ఆఫ్ తీర్మానాన్ని రీజనల్ డైరెక్టర్ కార్యాలయానికి (విశాఖపట్టణం) పంపాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈనెల 16వతేదీన జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని చేర్చకపోవడంతో ఈ ఉత్తర్వులు కూడా అమలయ్యే అవకాశం కనిపించడంలేదు. మరోసారి అత్యవసర కౌన్సిల్ సమావేశం జరిగితేనే దీనికి మోక్షం లభిస్తోంది. అయితే పాలకవర్గ సభ్యుల కోరిక మేరకు మరోసారి క్షేత్రస్థాయి సర్వే చేసి 377 అసెస్‌మెంట్లకు సంబంధించి 2,95,93,491 రూపాయలతో రైట్ ఆఫ్ కోసం నివేదిక తయారు చేశారు. దీనిని ఇంకా తగ్గించాలని మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ సూచించడంతో 111 అసెస్‌మెంట్లకు కుదించి 85 లక్షల రూపాయల మేరకు నివేదికను తయారు చేశారు.