విజయనగరం

పేదరికం నిర్మూలనే ప్రభుత్వం ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరుగుబిల్లి, జూలై 19: పేదరికాన్ని నిర్మూలించాలన్నదే ప్రభుత్వం ధ్యేయమని కురుపాం నియోజకవర్గం తెలుగుదేశంపార్టీ ఇన్‌ఛార్జి విటి జనార్థన థాట్రాజ్ అన్నారు. మండల పరిధిలోని సుంకి, సంతోషపురం గ్రామాల్లో గురువారం గ్రామదర్శిని, గ్రామ వికాసం కార్యక్రమాన్ని మండల టీడీపీ అధ్యక్షులు ధనుంజయరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈమేరకు ఆయాగ్రామాల్లో టీడీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయమన్నారు. ప్రజా సమస్యల పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. గ్రామాల్లోని సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ మేరకు సంతోషపురం గ్రామంలో పలురకాల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎస్ చంద్రశేఖరరాజు, నాగూరు సర్పంచ్ అక్కేన మదుసూధనరావు, పిహెచ్‌సీ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ పి పూర్ణచంద్రరావు, అంబటి తవిటినాయుడు, లక్ష్మణరావు, గౌరినాయుడు, కె బలరాం, తదితరులు పాల్గొన్నారు.

సమస్యలను తెలుసుకునేందుకు గ్రామదర్శిని
బలిజిపేట, జూలై 19: ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పార్వతీపురం నియోజకవర్గం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు అన్నారు. గురువారం గంగాడ, నారన్నాయుడువలస, గళావల్లి గ్రామాల్లో గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో రేషన్‌కార్డులు, పింఛన్లు, పక్కా గృహాలు, స్థలాలకు సర్వే చేసి అర్హులను గుర్తించి సంక్షేమ పథకాలను మంజూరుచేస్తామన్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ పెంకి పార్వతి, జడ్పిటీసీ ఎం రాధ, టీడీపీ మండల అధ్యక్షులు పి సత్యనారాయణరాజు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

రైతుల అభ్యున్నతే టీడీపీ ధ్యేయం
రామభద్రపురం, జూలై 19: రైతులను అన్నివిధాలా అభివృద్ధి చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని ఎంపీపీ ప్రతినిది చింతల రామకృష్ణ తెలిపారు. మండల వ్యవసాయ కార్యాలయంలో గురువారం ఆత్మ సౌజన్యంతో రైతు సదస్సును నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రైతులకు బ్యాంకు రుణాల మాఫీతోపాటు వ్యవసాయ పరికరాల కొనుగోలుకు భారీగా రాయితీలు ఇస్తుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటించి పంటలను సాగుచేయడం వలన నాణ్యమైన ఉత్పత్తులతోపాటు మంచి దిగుబడులను సాధించవచ్చునని తెలిపారు. ఆత్మ శాస్తవ్రేత్త కె లక్ష్మణ్ మాట్లాడుతూ వర్షాధార భూములలో వరిలో ఎద పద్ధతి, చెరకులో జంటసాళ్లు పద్ధతి, అంతర్ పంటల లాభాలు తదితర అంశాలపై రైతుకు సూచనలు, సలహాలు అందించారు. వరినారుమడులలో తీసుకోవల్సిన జాగ్రత్తలపై కూడా వివరించారు. ఈకార్యక్రమంలో ఆత్మ డీపీడీ మోహనరావు, మండల వ్యవసాయ అధికారిణి అనురాధ పండా, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.