విజయనగరం

విద్యార్థులకు నాణ్యమైన భోజనాలను పెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెర్లాం, జూలై 19: మండలం వెలగవలస జడ్పీ ఉన్నత పాఠశాలను డిప్యూటీ డీఇఓ కె వెంకటేశ్వరరావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో వండిన వంటకాలు బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైన వంటకాలను నాణ్యతతో వండకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం సర్పంచ్ ఎస్ శశిభూషణరావు, వైసీపీ నాయకులు సత్యనారాయణలు మాట్లాడుతూ ఈపాఠశాలకు అదనపు భవనంతోపాటు హిందీ ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. పాఠశాలకు ప్రహారీగోడను కూడా నిర్మించాలని కోరగా ఇందుకు స్పందించిన డిప్యూటీ డీఇఓ మాట్లాడుతూ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పాఠశాలలకు ఏకరూప దుస్తులు, పుస్తకాలను అందించామన్నారు. ఈ పరిశీలనలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యార్థులకు కంచాలు వితరణ
గరుగుబిల్లి, జూలై 19: మండలంలోని మరుపెంట పంచాయతీ పరిధిలోని గొల్లవానివలస మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పార్వతీపురం స్వామి సేవా సమితి సభ్యులు శంకర గురుస్వామి 35గ్లాసులు, పెన్నలు అందించారు. అదేవిధంగా కొబ్బరికాయల వ్యాపారి ఎం తాతబాబు విద్యార్థులకు స్టీల్‌కంచాలను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన పార్వతీపురం టౌన్ ఎస్‌ఐ యు మహేష్ మాట్లాడుతూ స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వామిసేవా సమితి ప్రధాన కార్యదర్శి కె రామ్మోహనరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం అచ్యుతరావు, తూముల శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదుచేయాలి
గరుగుబిల్లి, జూలై 19: పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వివరాలను త్వరితగతిన ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉందని కొత్తూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల సముదాయం ఛైర్మన్ కె కొండలరావు అన్నారు. మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలోని పాఠశాలలో గురువారం పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఇటీవల పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాల్సి ఉందన్నారు. అలాగే వనం-మనంకార్యక్రమంలో భాగంగా పాఠశాలలో నాటిన మొక్కల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. పాఠశాలలో రికార్డులను కూడాసక్రమంగా నిర్వహించాలన్నారు. ఈకార్యక్రమంలో సీ ఆర్‌పీ బోను రామకృష్ణ, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పి తవిటినాయుడు, టి నరసింహామూర్తి, శ్రీనివాసరావులు పాల్గొన్నారు.