విజయనగరం

ఓఆర్ ప్లాంట్‌ను సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెర్లాం, జూలై 19: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో ఏర్పాటు చేసిన ఓఆర్ ప్లాంట్ ద్వారా పంపిణీ చేస్తున్న నీటిని సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ సీఇఓ జనార్థన కోరారు. మండలం నందిగాం గ్రామంలో 3లక్షల 50వేల రూపాయలతో నిర్మించిన ఓఆర్ ప్లాంట్‌ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల బలోపేతానికి వివిధ పథకాల ద్వారా అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా ఓఆర్ పాంట్, డీజిల్, పెట్రోల్ బంకులు, గ్యాస్, పాల డెయిరీ ఫారాలు తదితర వాటిని చేపట్టేందుకు ప్రోత్సహిస్తున్నామన్నారు. సొసైటీ సంఘాల బలోపేతానికి సీఇఓలు ప్రతిపాదనలు పంపిస్తే మంజూరుకు కృషి చేస్తామన్నారు. ఈమేరకు నందిగాం, గుమ్మలక్ష్మీపురం, తామరపల్లి, గొల్లపల్లి, వీరసాగరం, బాడంగి, నందిగాం, గురిసి, జామి, కొత్తవలస, విజయనగరం, నాయుడుపేటలలో ఓ ఆర్ ప్లాంట్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కొక్క ప్లాంట్‌కు 3లక్షల 50వేల రూపాయల నుంచి 5లక్షల రూపాయల వరకు రుణాలు మంజూరుచేశామన్నారు. అలాగే 20లీటర్ల నీటిని విక్రయిస్తున్నామన్నారు. ఇంటింటికి నీటిని సరఫరా చేయాలంటే రవాణా చార్జీలను అదనంగా వసూళ్లు చేయాల్సి వస్తుందన్నారు. నందిగాం ప్రాథమిక వ్యవసాయపరపతి సంఘానికి పెట్రోల్ బంకు ఏర్పాటుకు తక్షణమే నిదులు విడుదల చేయాలని డీసీఎంఎస్ మాజీ ఉపాధ్యక్షులు గులిపల్లి మృత్యంజయరావు కోరగా ఇప్పటికే 7లక్షల రూపాయలు విడుదలయ్యాయని, అందులో భాగంగా డీజిల్ బంకు మంజూరైందని, పెట్రోల్ బంకు మంజూరుకావల్సి ఉందన్నారు. ఆ నిదులతో అక్కడ వౌళిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి కో- ఆపరేటివ్ సబ్ డివిజనల్ అధికారి రామకృష్ణ, తెర్లాం బ్రాంచి మేనేజర్ జానకి, నందిగాం పీఏసీఎస్ అధ్యక్షులు గంట అప్పలనాయుడు, సీఇఓ సత్యనారాయణతోపాటు వివిధగ్రామాలకు చెందిన రైతులు, సొసైటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.

డీసీసీబీ ద్వారా 500కోట్ల రూపాయల రుణాలు పంపిణీ
తెర్లాం, జూలై 19: జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు ఈ ఏడాది 500కోట్ల రూపాయలను రైతులకు రుణాలుగా అందించేందుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు డీసీసీబీ సీఇఓ జనార్థన తెలిపారు. ఈమేరకు నందిగాం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఇప్పటికే 5కోట్ల రూపాయలను రుణాలుగా అందించామని, దీర్ఘకాలిక రుణాలుగా 4కోట్ల 50లక్షల రూపాయలను అందించామన్నారు. సొసైటీలు ఆర్థికంగా బలోపేతం చేయడానికి విత్తనాలు, ఎరువులు వంటి వాటికి రుణాలు అందించనున్నామన్నారు. ఈమేరకు కాకినాడ, కృష్ణ, తదితర జిల్లాలో సహకార సంఘాల ద్వారా రైసుమిల్లులు, వ్యవసాయ పనిముట్లు, విత్తన తయారీ, పెట్రోల్, గ్యాస్, వంటి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. అదేవిధంగా జిల్లాలోని తెట్టంగి, కెల్ల, శివిని, కె ఎల్ పురం, గజపతినగరం, రామభద్రపురం సొసైటీలు నష్టాలో నడుస్తున్నాయని, పెదపాక, కేసరి, కొట్టక్కి, బొబ్బిలి, కలువరాయి, పూసపాటిరేగ, గొట్లాం, తదితర సంఘాలు లాభాల బాటలో ఉన్నాయన్నారు. ఆర్‌సీఎఫ్ పథకం కింద 8.5శాతం వడ్డీకే రుణాలను అందజేయడం జరుగుతుందన్నారు. సహకార మిత్ర ఆధ్వర్యంలో ఎకరానికి రెండున్నర లక్షల నుంచి 12లక్షల రూపాయలను రుణాలు అందించామన్నారు. ఇప్పటికే 200కోట్ల రూపాయలను అందించామన్నారు. ప్రతీ ఆరునెలలకు వడ్డీ కట్టాలన్నారు. ఎంఇడీపీ దీక్షా సేంద్రీయ వ్యవసాయ ఎరువులపై అవగాహన కల్పించనున్నామన్నారు. ఎన్‌జీఓ పథకం కింద 8గ్రామాలను ఎంపిక చేశామన్నారు. ఈకార్యక్రమంలో దీక్షా మహిళా సీఇఓ శాంతి, బొబ్బిలి సబ్‌డివిజనల్ కో- ఆపరేటివ్ అధికారి రామకృష్ణ, తెర్లాం బ్రాంచి మేనేజర్ జానకీ, తదితరులు పాల్గొన్నారు.