విజయనగరం

గ్రామాల అభివృద్దే థ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దత్తిరాజేరు, జూలై 19: గ్రామాలలో గ్రామస్తులకు వౌలిక సదుపాయాలు కల్పించి గ్రామాల అభివృద్ధే థ్యేయంగా తెలుగు దేశం ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే కె. ఎ.నాయుడు అన్నారు. గురువారం మండలంలోని షికారుగంజి గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీధులన్నీ పరిశీలించి ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడు లేని విధంగా తెలుగుదేశం పార్టీ గ్రామాలను అభివృద్ధి చేసిందని అన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులకు పథకాలను వర్తింపచేస్తున్నామని చెప్పారు. దళిత కాలనీలు బాగుచేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తున్నదని అన్నారు. ఎటువంటి అక్రమాలకు పాల్పడకుండా గృహ నిర్మాణాలుచేపట్టడం జరుగుతున్నదని ఆన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలుసమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బోడసింగి సత్తిబాబు, ఎంపీపీ బెజవాడ రాజేశ్వరి, టీడీపీ జిల్లా కార్యవర్గసభ్యులు నారాయణమూర్తిరాజు, నియోజకవర్గ సమన్వయకర్త చంద్రశేఖర్, మాజీ జడ్పీటీసీ లక్ష్మి, సర్పంచ్ చెల్లూరి సత్యారావు, పలువురు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
రహదారుల మరమ్మతులు చేపట్టండి
దత్తిరాజేరు, జూలై 19: మండలంలోని పెదమానాపురం సంతతోటలో గల మజ్జి గౌరమ్మ ఆలయ సమీపంలో పోరాం రహదారి మలుపువద్ద పెద్ద గొయ్యి ఏర్పడడంతో పలువురు వాహనదారులు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారిపై పోరాం-జక్కువ బస్సులతో పాటు పలు వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇరువైపుల నుండి వచ్చేవాహనాలు ఈ గోతులో నుంచే వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్తగా ఇటువైపే వచ్చే వాహనదారులు ఈగోతిని గమనించకపోతే ప్రమాద భారిన పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈరహదారిపై గోతుని పూడ్చివేసి తక్షణమ్మ మరమ్మతులు చేపట్టాలని వాహనచోదకులు, ప్రజలు కోరుతున్నారు.

కాలువల్లో పూడికలను తొలగించాలి
బొబ్బిలి(రూరల్), జూలై 19: కాలువల్లో పేరుకుపోయిన పూడికలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు చర్యలు చేపడుతున్నామని కలువరాయి, పక్కి, కోమటిపల్లి గ్రామకార్యదర్శి రాఘవేంద్రరావు చెబుతున్నారు. ఈమేరకు ఆయాగ్రామాల్లో పేరుకుపోయిన పూడికలను గురువారం తొలగించే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇటువంటి కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. చెత్తాచెదారాలను రోడ్లు, కాలువలపై వేయరాదన్నారు. ప్రతీ ఒక్కరూ పరిశుభ్రంగా ఉండాలన్నారు. నిల్వ ఉన్న పదార్ధాలను వినియోగించరాదన్నారు. ప్రజాప్రతినిదులు గ్రామాల అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు పాల్గొన్నారు.
కుళాయిల ద్వారా మంచినీటి సరఫరా
బొబ్బిలి(రూరల్), జూలై 19: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆర్‌డబ్ల్యుఎస్ జెఇ పప్పల శంకరరావు అన్నారు. ఈమేరకు మండలం శివడవలస గ్రామంలో కుళాయిల ద్వారా మంచినీటిని గురువారం విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నీటిని వృధా చేయకుండా సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. నీటిని ఎంత పొదుపు చేస్తే అంత మంచిదన్నారు. అవసరం మేరకే వినియోగించుకోవాలన్నారు. అన్నివీధులకు పూర్తిస్థాయిలో కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. మంచినీటి కోసం ఎక్కడైన ఇబ్బందులు తలెత్తితే తక్షణమే సమాచారం అందించాలన్నారు. వీటితోపాటు బోర్లు కూడా మరమ్మతులకు గురైతే తెలియజేయాలన్నారు. ఎప్పటికప్పుడు మరమ్మతులకు గురైన బోర్లును బాగుచేసి మంచినీటిని అందిస్తున్నట్లు తెలిపారు. ఈయనతోపాటు సర్పంచ్ పి శంకరరావు, తదితరులు పాల్గొన్నారు.