విజయనగరం

సంపూర్ణ పారిశుద్ధ్యంతో ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల, జూలై 19: సంపూర్ణ పారిశుద్ధ్యంతో ఆరోగ్యం పొందవచ్చు ఎంపీపీ సువ్వాడ వనజాక్షి అన్నారు. గురువారం ఎంపీడీవొ కార్యాలయంలో లెప్రా సొసైటీ దత్తత గ్రామాల కార్యదర్శులతో పారిశుద్ధ్యంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ వనజాక్షి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఎంపీడీవొ కె. అక్కారావు మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందున కార్యదర్శులు పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని అన్నారు. లెప్రా సొసైటీ మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ పరిశుభ్రత లోపం వలన 80శాతం రోగాలు వస్తాయని చెప్పారు. పారిశుద్ధ్యం లోపం వల్ల డయేరియా, కామెర్లు, టైఫాయిడ్, చర్మవ్యాధులు ప్రబలతాయని అన్నారు. ఈ వ్యాధుల వలన ప్రతి కుటుంబం ఏడాదికి పది వేల రూపాయలు వైద్య ఖర్చులకు భరించాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లెప్రా సొసైటీ కో- ఆర్డినేటర్ ఎం.ఎన్.వి.రాజు, ప్రాజెక్టు అధికారి లెంక రమణ, టీడీపీ మండల అధ్యక్షుడు గేదెల రాజారావు, తహశీల్దార్ వెంకటేశ్వరరావు, ఎంపీడీవొ అక్కారావు, ఇవొపిఆర్డీ భానోజీరావు తదితరులు పాల్గొన్నారు.

తెలగాలను బీసీలో చేర్చాలి
నెల్లిమర్ల,జూలై 19: తెలగ కులస్తులను బిసిలో చేర్చాలని తెలగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చనుమళ్ళ ప్రసాదరావు డిమాండ్ చేశారు. గురువారం ఆయన నెల్లిమర్ల ప్రెస్‌క్లబ్‌లో విలేఖరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలగాలను బిసి-ఎఫ్‌లో చేర్చి ఐదుశాతం రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తుచేశారు. అలాగే అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని చెప్పారు. బీజేపీ, టీడీపీ ఎన్నికల ముందు పొట్టుపెట్టుకుని అధికారం చేపట్టాయని అన్నారు. తెలగ కులస్తుల ఓట్లతో అధికారం చేపట్టి ఆ రెండు పార్టీలు హామీలను విస్మరించాయని చెప్పారు. కాపుకార్పొరేషన్ రుణాలు అందించడానికి బ్యాంకర్లు లబ్దిదారులను ఇబ్బందులు పెడుతున్నారని వెల్లడించారు. తెలంగాణ మాదిరిగా బ్యాంకర్లతో సంబంధంలేకుండా కాపుకార్పొరేషన్ ద్వారా రుణాలు అందించాలని డిమాండ్ చేశారు.

దీపం పథకం మహిళలకు ప్రయోజనం
నెల్లిమర్ల, జూలై 19: దీపం పథకం మహిళలకు ప్రయోజనమని ఎంపీపీ సువ్వాడ వనజాక్షి అన్నారు. గురువారం ఎంపీడీవొ కార్యాలయంలో చంద్రన్న ధీపం పథకం ద్వారా లబ్దిదారులకు ఎంపీపీ గ్యాస్ స్టౌవులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కాలుష్య నివారణ చేయడానికి గ్యాస్ స్టౌవులు దోహదపడతాయని చెప్పారు. పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తుందని వెల్లడించారు. గ్రామీణ ప్రాంత మహిళలకు దీపం పథకం ప్రయోజనకరంగం ఉంటుందని వెల్లడించారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు సువ్వాడ రవిశేఖర్, మండల అధ్యక్షులు గేదెల రాజారావు, ఎంపీడీవొ కె. అక్కారావు, డిఎస్‌డిటి జగన్, ఇవొ పీఆర్డీహెచ్. భానోజీరావు, టీడీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు పోతల రాజప్పన్న తదితరులు పాల్గొన్నారు.

మండలంలో ఫుడ్ కమిషన్ సభ్యులు పర్యటన
* ముందస్తు సమాచారంతో అప్రమత్తమైన సివిల్ సప్లయ్ అధికారులు
కొత్తవలస,జూలై 19: రాష్ట్ర ఆహారభద్రత కమిటీ సభ్యులు ఎల్.బి. వెంకటరావు గురువారం కొత్తవలస మండలంలో పర్యటించారు. ఈ పర్యటనలో అంగన్‌వాడీ కేంద్రాలలో గల మధ్యాహ్న భోజన పథకాలను, ప్రజా పంపిణీ సంఘాలను తనిఖీ నిర్వహించారు. కమిషన్ సభ్యులు వస్తున్నారనే సమాచారం ముందుగా తెలుసుకున్న సివిల్ సప్లయ్ అధికారులు ఆమె చేస్తున్న తప్పులను కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేశారు. జిల్లా అధికారులతో కలసి బలిఘట్టాం గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. పిల్లలకు అందజేస్తున్న పౌష్టికాహారాన్ని తనిఖీ చేసి వారికి అందుతున్న ఆహార పదార్థాలను పరిశీలించారు. ఆయన పరిశీలనలో కొన్ని నిజాలు బయటపడ్డాయి. గుడ్లు బరువు తక్కువగా ఉండడం, సైజు చిన్నదిగా ఉండడం, కుల్లిన గుడ్లు వండిపెట్టడం, గడువు ముగిసిన పదార్థాలు పిల్లలకు అందజేయడం వంటి పలు విషయాలు ఆయన దృష్టికి వచ్చాయి. దీనిపై ఆయన మండి పడ్డారు. ఆహార భద్రత విషయంలో రాజీపడేదిలేదని ప్రజలకు అందవలసిన సరుకులు నాణ్యతతోపాటు అనుకున్నవన్నీ అందజేయాలని స్పష్టం చేశారు. అనంతరం పాఠశాలలోని మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులను మెను ప్రకారం భోజనం అందుతుందాలేదా అని అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి నుండి కంటకాపల్లిలోని రేషన్ డిపోలను పరిశీలించారు. గ్రామస్తులను రేషన్ సరుకులు సక్రమంగా అందుతున్నాయాలేదా అని ఆరా తీశారు. నాణ్యమైన సరుకులు డీలర్లు అందజేస్తున్నారాలేదా అని సక్రమమైన తూకాలు ఇస్తున్నారాలేదా అని ప్రజలను అడిగారు. రేషన్ డీలర్‌పై ఫిర్యాదు ఎంతవరకు నిజమని గ్రామస్తులను అడిగారు. సక్రమంగానే సరుకులు ఇస్తున్నారని చెప్పడంతో తప్పు చేస్తే వదిలిపెట్టేదిలేదని అన్నారు. బియ్యంలో రాళ్ళు ఉండటం, తినడానికి పనికివస్తున్నాయాలేదా అని, సక్రమంగా వినియోగించుకుంటున్నారోలేదోనని గ్రామస్తులను అడిగారు. అనంతరం కొత్తవలసలోని సివిల్ సప్లయ్ గొడౌన్‌లో ఉన్న సరుకులను పరిశీలించారు. పంపిణీకి సిద్దంగా ఉన్న బస్తాలరు తూకం వేసి చూశారు. డీలర్లకు సప్లయ్ చేస్తున్న సరుకుల్లో తరుగు ఉందని డీలర్లు ఆయన దృష్టికి తీసుకురావడంతో గొడౌన్ ఇన్‌ఛార్జ్‌ను నిలదీశారు. అలాంటిదేమీ లేదని సరుకులను సక్రమంగానే అందజేస్తున్నామని ఆయన చెప్పడంతో వెనుదిరిగారు. ఈయన వెంట జిల్లా అధికారులు సీతారామరాజు, షర్మిల, సుబ్బరాజు, డి ఇవొనాగమణి, తహశీల్దార్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
బొంతల కోటి బాటలో పయనించండి
* జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్

గజపతినగరం, జూలై 19: బొంతలకోటి బాటలో ఉపాద్యాయులు పయనించాలని జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్ అన్నారు. గురువారం బొంతలకోటి రూపొందించిన చెట్లుతల్లి-కల్పవల్లి అనే సిడిని జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్, జడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, డిఇవొ నామణిలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బొంతలకోటి రూపొందించిన గీతాలు ప్రజాచైతన్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. జడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి మాట్లాడుతూ చెట్లను పెంచకపోతే మానవ మనుగడలేదని మొక్కలునాటి పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. చెట్లు విలువపై పాటలు రూపొందించడం అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న శంకరరావు మార్గదర్శకుడు అయ్యారని అన్నారు. బొంతలకోటి మాట్లాడుతూ జానపద బాణీలలో చెట్లు ఆవశ్యకతపై ఈ సిడిని రూపొందించామని వివరించారు. పర్యావరణ పరిరక్షణకు బొంతలకోటి కృషిని కొనియాడి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు జాయింట్ కలెక్టర్ వెంకటరామిరెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి వేణుగోపాలరావు, డిఇవొ నాగమణి తదితరులు పాల్గొన్నారు.

దళిత ఐక్యవేదిక సభను విజయవంతం చేయాలి
గజపతినగరం, జూలై 19: ఈ నెల 24వ తేదీన గజపతినగరంలోని స్వాతి ఫంక్షన్ హాలులో నిర్వహించనున్న దళిత గిరిజన ఐక్యవేదిక బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ ఉత్తరాంధ్ర కన్వీనర్ సుధాకర్ అన్నారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈసభకు ముఖ్య అతిధిగా ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంధకృష్ణమాదిగ, మాలమహానాడు జాతీయ కార్యదర్శి చెన్నయ్య, ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక రాష్ట్ర సమన్వయకర్త ఎం.గురునాథం హాజరవుతారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో ఎన్‌డి ఎ ప్రభుత్వం నిమగ్నమైందని అన్నారు. ఈ నేపథ్యంలో ఆగష్టు 8న ఢిల్లీలో జరగనున్న సింహగర్జనలో లక్షలాది మంది తరలిరానున్నారని తెలిపారు. గజపతినగరంలో జరగనున్న బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుండి ఎస్సీ, ఎస్టీలు కదలివచ్చి జయప్రదంచేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ ఎ.చిన్నారావు, కో-కన్వీనర్ సాంబయ్య, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌కు పదోన్నతి
గజపతినగరం, జూలై 19: గజపతినగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న కె.వి.బి. విఠల్‌కు జిల్లా వృత్తివిద్యాశాఖ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులుజారీ చేసింది. ఈ మేరకు తనకు అధ్యాపక బృందం ప్రిన్సిపాల్ విఠల్‌ను గురువారం కళాశాలలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ చేసిన సేవలను వారు కొనియాడారు. ప్రిన్సిపాల్ విఠల్ స్పందిస్తూ ఉద్యోగ విషయంలో ఇటువంటి పదోన్నతులు సర్వసాధారణమని, తనను ఘనంగా సత్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
రాజన్నపాలన జగన్‌తోనే సాధ్యం
గజపతినగరం, జూలై 19: రాజన్న పాలన జగన్‌తోనే సాధ్యమవుతుందని వైకాపా మండల పార్టీకన్వీనర్ బూడి వెంకటరావు అన్నారు. గురువారం మండలంలోని పిడిశీల గ్రామంలో వైకాపా బూత్ స్థాయి కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల్లో సంతోషాలు నిలపాలన్న లక్ష్యంతోనే జగన్ నవరత్నాల పథకాలను రూపొందించారని చెప్పారు. ఈ పథకాల గురించి ప్రజల్లో క్షేత్రస్థాయిలో తీసుకు వెళ్ళాలి ప్రజలకు వివరించాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కల్లబొల్లి కబుర్లు అధికారం చేజిక్కించుకున్నారని, అధికారం చేపట్టాక హామీలు తుంగలో తొక్కారని ఆరోపించారు. ఇపుడు ఎన్నికలు సమీస్తున్నందున మళ్ళీ హాడావిడిగా పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను మభ్యపెట్టడానికి చూస్తున్నారని అన్నారు. చంద్రబాబు జిమ్మిక్కిలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ కన్వీనర్ బోడసింగి తులసీరాం, కమిటీ సభ్యులు పాండ్రంకి సూర్యప్రకాష్, పత్తిగుల్ల బంగారయ్య, శనపతి అప్పలనాయుడు, జొన్నాడ సూర్యనారాయణ, బంగారునాయుడు తదితరులు పాల్గొన్నారు.