విజయనగరం

ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి, జూలై 23: పాఠశాలలో చదువుతున్న ప్రతీ విద్యార్థి తమ పాఠశాలలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యతను కూడా తీసుకోవాలని, వాటికి విద్యార్థుల పేర్లు పెట్టుకోవాలని బొబ్బిలి ఎస్‌ఐ రవీంద్రరాజు కోరారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక రెసిడెన్సీ పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలను పెంచడం వలన వర్షాలు పడటంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో పెరిగిపోతున్నాయని, దీనికి కారణం అవసరమైనంత స్థాయిలో చెట్లు లేకపోవడమేనన్నారు. కావున ప్రతీ ఒక్క విద్యార్థి పాఠశాలలోను, ఇంటి ఆవరణలోను, ఖాళీప్రదేశాలలో మొక్కలు నాటి వాటికి తమకు ఇష్టమైన వ్యక్తులు పేర్లు పెట్టి సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మె
మక్కువ, జూలై 23: క్షేత్ర సహాయకుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తున్నామని ఫీల్డ్ అసిస్టెంట్ ఎం వెంకటరావు తెలిపారు. స్థానిక మండల అభివృద్ధి కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఉపాధిహామీపథకంలో పనిచేస్తున్న క్షేత్ర సహాయకులకు ప్రభుత్వం ఉద్యోగభద్రత కల్పించడం లేదన్నారు. ఈమేరకు వేతనాలను 18వేల రూపాయలు చెల్లించడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఫీల్డ్ అసిస్టెంట్ నియామకాలను కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించాలని, ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించాలని కోరారు. సమస్యలను పరిష్కరించేంతవరకు ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి
మక్కువ, జూలై 23: వాహనదారులు రోడ్డ్భుద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని ఎస్‌ఐ కృష్ణమోహన్ తెలిపారు. సోమవారం రోడ్డు భద్రతా నియమాలపై మక్కువ నాలుగురోడ్లు జంక్షన్ వద్ద ఆటోడ్రైవర్లు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డుపై వాహనాలను నడిపేటప్పుడు మద్యం సేవించడం, హెల్మ్‌ట్లు ధరించకపోవడం, సెల్‌ఫోన్‌లోమాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, వంటివి చేయరాదన్నారు. అలాగే వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్‌లైసెన్స్‌తోపాటు వాహనానికి సంబంధించిన దృవపత్రాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆటోలు, జీపులలో పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించరాదన్నారు. రోడ్డ్భుద్రతా నియామాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీ అప్పలకొండ, ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.

ఆదరణ-2 పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
మక్కువ, జూలై 23: ప్రభుత్వం మంజూరుచేస్తున్న ఆధరణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ జి రామారావు అన్నారు. స్థానిక మండల అభివృద్ధి కార్యాలయంలో ఆధరణ-2 పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్న వారికి జన్మభూమి కమిటీ అధ్యక్షులు పెంట తిరుపతిరావు ఆధ్వర్యంలో సోమవారం ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధరణ-2 పథకంలో దరఖాస్తులు చేసుకున్న టైలరింగ్‌కు 22, చేనేత కార్మికులకు 83మందిని ఎంపిక చేశారు. అన్ని ట్రేడ్‌ల కింద 547మంది దరఖాస్తులు చేసుకోగా ముందుగా చేనేత కార్మికులు, టైలరింగ్‌లకు సంబంధించిన దరఖాస్తులు చేసుకున్న వారికి ఇంటర్వ్యూలను నిర్వహించామన్నారు. మిగతా ట్రేడ్‌లకు సంబంధించివారికి త్వరలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు.