విజయనగరం

పార్టీ బలోపేతమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీపురుపల్లి, జూలై 23: గ్రామాల్లో జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యమని ఆపార్టీ చీపురుపల్లి నియోజకవర్గ బాధ్యుడు పెద్ది వెంకటేష్ అన్నారు. మండలంలోని కర్లాం గ్రామంలో సుమారు రెండువందల మంది యువకులు జనసేనలో చేరిన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమని, ఇందుకు అన్ని వర్గాల నుంచి సహకారం అవసరమన్నారు. ఈ సందర్భంగా కర్లాం, కరకాం, సంకుపాలెం గ్రామాలతో పాటు గరివిడి మండలం శివరాం గ్రామానికి చెందిన సుమారు 200 మంది యువకులు పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువావేసి ఘనంగా స్వాగతించారు. కార్యక్రమంలో గ్రామాలకు చెందిన యువకులు వై లక్ష్మునాయుడు, తిరుపతి, రమేష్‌రాజు, ఆదినారాయణ, ప్రవీణ్, చంటి, రామ్మోహన్, రామకృష్ణ, శివ, మోహన్, బాబూరావు, రాజశేఖర్‌లతో పాటు నియోజకవర్గానికి చెందిన నాలుగు మండలాల నుంచి జనసేన సైనికులు పాల్గొన్నారు.
డ్రమ్‌సీడర్‌తో వరిసాగు రైతుకి మేలు
చీపురుపల్లి, జూలై 23: డ్రమ్‌సీడర్ పద్దతిలో ఈ ఖరీఫ్‌కు వరిసాగు చేయడం వలన రైతులకు మేలు జరుగుతుందని మండల వ్యవసాయశాఖాధికారి కె ఆర్ ఎల్ అరుణ్‌కుమార్ అన్నారు. మండలంలోని పేరిపి గ్రామంలో రైతుకి చెందిన పొలంలో డ్రమ్‌సీడర్ పద్దతిలో వరిసాగు చేయడం వలన కలిగే లాభాలను జాతీయ ఆహారభద్రత కార్యక్రమంలో భాగంగా మండల వ్యవసాయశాఖాధికారులు సోమవారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయశాఖాధికారి మాట్లాడుతూ డ్రమ్‌సీడర్ ద్వారా మొక్కల మధ్య దూరం పెరగడం వలన గాలి, నీరు, వెలుతురు కుదుళ్లకు వెల్లడంతో పాటు పురుగుల బెడద తప్పుతుందని వివరించారు. సాధారపద్దతుల కంటే ఈ విధానంలో రైతుకు సుమారు ఐదువేల వరకు ఖర్చులు మిగలడంతో పాటు విత్తనాల వినియోగం తగ్గుతుందన్నారు. ఎక్కువశాతం బురదలో పంట ఉంటుందని దీని ద్వారా కలుపుమొక్కలు పెరుగుతాయని ఇందుకోసం కలుపునివారణా మందులను వినియోగించుకోవాలని సూచించారు.

రహదారిపనులు త్వరిత గతిన పూర్తి చేయాలి
చీపురుపల్లి, జూలై 23: పట్టణంలో 14వ ఆర్ధికం సంఘం నిధుల నుంచి చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జెడ్పీటీసీ సభ్యుడు మీసాల వరహాలనాయుడు అధికారులకు ఆదేశించారు. మేజర్ పంచాయితీ పరిధిలోని వంగపల్లిపేటలో 14వ ఆర్ధిక సంఘం నుంచి మంజూరైన సుమారు రూ.11లక్షలతో చేపట్టి అభివృద్ధిపనులను ఆయన సోమవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగపల్లిపేటలో సీసీ రహదార్లుతోపాటు కాల్వల నిర్మాణం కోసం చేపట్టిన పనులను త్వరిత గతిన పూర్తిచేయడంతో పాటు నాణ్యతా ప్రమాణాలను పాటించాలన్నారు. పంచాయితీ పరిధిలో ఇప్పటి వరకు చేపట్టిన అన్ని పనులు 80శాతం వరకు పూర్తి చేయడం జరిగిందని, అరాకొర పనులు కొనసాగుతున్నట్టు వివరించారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు ఎల్లంటి శివ, రొబ్బి చిన్ని, పంచాయితీ సిబ్బంది తదితరులు ఉన్నారు.

వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు త్వరితగతిన మంజూరు
చీపురుపల్లి, జూలై 23: తమ సంస్థ పరిధిలోని మూడు మండలాలకు చెందిన రైతులు సంక్షేమం దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ విధ్యుత్ కనెక్షన్‌లు త్వరితగతిన మంజూరు చేస్తున్నామని ఆర్‌ఈసీఎస్ ఛైర్మన్ దన్నాన రామచంద్రుడు అన్నారు. సంస్థ కార్యాలయంలో సంస్థ ఎండీ పిల్లి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఆయన రైతులతో మాట్లాడారు. ప్రధానంగా సంస్థకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లు మంజూరుకోసమే దరఖాస్తులు వస్తున్నాయని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు. చీపురుపల్లి మండలంలోని పేరిపి, గరివిడి మండలం వెదుల్లవలస, మెరకముడిదాం మండలం గర్భాం గ్రామాలకు చెందిన రైతులు విద్యుత్ కనెక్షన్ తమ పంపుసెట్లకు ఇప్పించాలని దరఖాస్తుచేసుకున్నారు. ఆయా గ్రామాలకు తక్షణమే విద్యుత్ కనెక్షన్‌లు మంజూరు చేయాలని ఆయన ఆదేశించారు. అలాగే కర్లాం గ్రామం జంక్షన్ నుంచి గ్రామానికి వెళ్లే రహాదారి గూండా గ్రామంలోకి విద్యుత్ స్థంబాలు వేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు. దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన పథకం కింద చేపట్టిన విద్యుత్ పనులను ఆయన సమీక్షించారు. గ్రీవెన్స్‌లో ఏవో రామకృష్ణ, ఎడీఇ, ఎఎఈలు పాల్గొన్నారు.

వామపక్షాల ఆధ్వర్యంలో
ప్రత్యేక హోదా కోరుతూ ఆందోళన
బొబ్బిలి, జూలై 23: రాష్ట్రానికి ఎన్నికల ముందు బిజెపీ ప్రధాన అభ్యర్థిగా ఉన్న నరేంద్రమోడీ వచ్చినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన హామీలను అమలుచేస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేస్తుందని సీపీ ఎం నాయకులు రెడ్డి వేణు అన్నారు. సోమవారం సీపీఐ, సీపీఎంల ఆధ్వర్యంలో ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపీ ఇచ్చిన మాటను తప్పిందని, కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేస్తే, బిజెపీ రాష్ట్ర ప్రజల గొంతు కోసిందని, ఇంతకంటే నిరంకుశ ప్రభుత్వం వేరొకటి లేదన్నారు. అనంతరం సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఒమ్మి రమణ మాట్లాడుతూ బిజెపీ ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేసిందని, విభజన చట్టంలోని అన్ని హామీలను చేస్తున్నామని చెబుతూనే మొండిచేయి చూపించిందన్నారు. ఇటీవల జరిగిన అవిశ్వాస తీర్మాణంలో కూడా కనీసం రాష్ట్రానికి ఇవ్వాల్సిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పి శంకరరావు, శేషగిరి, సీపీఐ నాయకులు మునకాల శ్రీనివాసరావు, అశోక్, కోట అప్పన్న, తదితరులు పాల్గొన్నారు.