విజయనగరం

వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జూలై 23: ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని నరేంద్రమోడీ తీరుకు నిరసనగా సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా పదేళ్లు ఇస్తామని బిజెపి, 15ఏళ్లు తెస్తామని టిడిపి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడంలేదని అన్నారు. అయిదుకోట్ల ఆంధ్రులను నమ్మించి దగాచేసిన ఈ రెండుప్రభుత్వాలకు రోజులు దగ్గరపడ్డాయని విమర్శించారు. ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు విషయంలో కేంద్రంలో నరేంద్రమోడీ, రాష్ట్రంలో చంద్రబాబు దోబుచులాడుతున్నారని ఎద్దేవా చేశారు. సిపిఐ రాష్టస్రమితి సభ్యుడు పార్లమెంటులో అవిశ్వాసం పెట్టినప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడిన మూడు గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ విభజనచట్టంలో పొందుపర్చిన హామీలపై గాని, ప్రత్యేకహోదా విషయంపైగాని కనీసం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని అన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఏనాడు కోరలేదని, ప్యాకేజికి పూర్తి అనుకూలమని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని, ఇప్పుడు దొంగదీక్షలు చేస్తూ బిజెపిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ప్రధాన మంత్రి చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి కనీసం ఖండించలేదని తెలిపారు. ఎంపిలు కూడా నోరు మెదపలేదని విమర్శించారు. ఇప్పటికైనా చంద్రబాబు దొంగదీక్షలతో కాలయాపన చేయకుండా పోరాటం చేయాలని, లేకపోతే బిజెపితోపాటు టిడిపిని కూడా భూస్థాపితం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు బుగత సూరిబాబు, బాయి రమణమ్మ, వి.కృష్ణంరాజు, అప్పరుబోతు జగన్నాధం, సిపిఎం నాయకులు తమ్మినేని సూర్యనారాయణ, రెడ్డి శంకరరావుతదితరులు పాల్గొన్నారు.

రోడ్డు విస్తరణ పనులకు గడువుఇవ్వడం కుదరదు
* గూడ్స్‌షేడ్ బాధితులకు స్పష్టంచేసిన మున్సిపల్ కమీషనర్
విజయనగరం (్ఫర్టు), జూలై 23: నష్టపరిహారం పూర్తిస్థాయిలో చెల్లించలేదని, విస్తరణ కొలతలు కూడా శాస్ర్తియంగా జరగలేదని, అందువల్ల రోడ్డు విస్తరణ పనులకు మూడునెలలు గడువుఇవ్వాలని పట్టణంలో గూడ్స్‌షేడ్ రోడ్డు విస్తరణ బాధితులు మున్సిపల్ అధికారులను కోరారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా వెంకటలక్ష్మి ధియేటర్ జంక్షన్ నుంచి గణేష్ కోవెల మీదుగా కలెక్టరేట్ జంక్షన్ వరకు చేపట్టే రోడ్డు విస్తరణ పనులకు సోమవారం ప్రారంభించారు. రోడ్డు విస్తరణలో 147 భవనాలను తొలగించవలసి ఉండగా 90 మంది తొలగింపునకు అంగీకరించారు. ఈ మేరకు భవనాలను కోల్పోయిన 90 మంది బాధితులకు టైటిల్ డవలప్‌మెంట్స్ రైట్ (టిడిఆర్) ఇచ్చారు. వీటితోపాటు నష్టపరిహారం కూడా చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే భవనాల తొలగింపునకు మూడునెలల గడువుఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ టి.వేణుగోపాల్‌ను బాధితులు కోరగా, గడువుఇచ్చే ప్రసక్తిలేదని కమిషనర్ స్పష్టం చేశారు. రోడ్డు విస్తరణ పనులను ఆలస్యం చేస్తే నిధులు వెనక్కి వెళ్లిపోయే అవకాశం ఉందని, చిన్నచిన్న సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ సిటీప్లానర్లు వి.శోభన్‌బాబు, కె.హరిదాసు, టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్ జగన్నాధరావుతదితరులు పాల్గొన్నారు.

ఆదరణతో చేతి వృత్తి లబ్దిదారులకు చేయూత
బొండపల్లి, జూలై 23: రాష్ట్ర జనాభాలో సింహబాగంలో ఉన్న వెనుకబడిన తరగతులలోని చేతి వృత్తిదారులకు లబ్థిచేకూర్చేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ఆదరణ-2 పధకం ప్రవేశపెట్టింది. గత తొమ్మిదళ్ల ముఖ్యమంత్రిగా తెలుగుదేశం ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసింది. మండలంలో ఇందుకుగాను అర్హులైన లబ్ధిదారుల నుంచి ఆన్‌లైన్ ద్వారా 626 ధరఖాస్తులు ఆహ్వానించింది. వీరిలో సోమవారం టైలరింగ్ వృత్తిగా జీవనం సాగిస్తున్న 32మంది లబ్ధిదారులకు స్ధానిక మండల పరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. మండల స్కీనింగ్ కమిటీ సభ్యులు ఎంపిపి పిరిడి ఎల్లమ్మ, జెడ్పిటీసీ బండారు బాలాజీ, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు బొడ్డు రాము, జంపన పెదబాబు, షేక్ మధీనాలు పాల్గొని అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేశారు. వీరిలో 31మంది వివిద రకాల టైలరింగ్ మిషన్లు ఎంపిక చేసుకున్నారు. ఒక్కరు అనర్హలు అయ్యారు. కార్యక్రమంలో ఎంపిడివొ ఎం.ప్రకాశరావు, ఇవొపి ఆర్‌డి రవికూమార్ సిబ్బంది పాల్గొన్నారు.