విజయనగరం

కాంగ్రెస్ శాస్తి బీజేపీకి తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, జూలై 23: కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో జరిగిన శాస్తి 2019 ఎన్నికల్లో బీజేపీకి తప్పదని రాష్ట్ర భూగర్భ గనుల శాఖా మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. సోమవారం మెంటాడలో అంగన్‌వాడీ భవనాన్ని జయతిలో పంచాయతీ భవనాన్ని, ఇప్పలవలసలో అంగన్‌వాడీ, పంచాయతీ కేంద్రాలను మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు ప్రారంభించారు. అనంతరం గ్రామదర్శిని, గ్రామవికాశం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1100కోట్లు ఖర్చుచేసి 900 కిలోమీటర్లు సిసి రోడ్లు నిర్మాణం చేపట్టామని అన్నారు. ప్రజా సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానం దక్కించుకుందని చెప్పారు. మండలంలోని గుర్లగెడ్డ మినీ రిజర్వాయర్, ఆండ్ర హైలెవెల్ కెనాల్ సమస్యలు సి ఎం దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందని, పనులు పూర్తిచేస్తామని హామీ ఇచ్చామని చెప్పారు. సాలూరు నియోజకవర్గంలో రోడ్లు నిర్మాణానికి 50కోట్ల నిధులు మంజూరు అయ్యాయని చెప్పారు.చల్లపేట నుండి రాబంద తారురోడ్డుకు 70లక్షలు, జక్కువ నుండి బడాయవలస రోడ్డుకు 71లక్షలు, ఆండ్ర ఆర్ అండ్ బి రోడ్డు నుండి మల్లేడవలసకు 2.44కోట్లు నిధులు మంజూరు అయ్యాయని చెప్పారు. టీడీపీ పరిపాలన చూసి బీజేపీ భయపడుతుందని, రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరచిన అంశాలపై బీజేపీ కాంగ్రెస్ ద్వంద వైఖరి అవలంభిస్తున్నాయని ఆరోపించారు.
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ డాక్టర్ శోభాస్వాతిరాణి మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయంటే టీడీపీ కృషి ఫలితమేనని చెప్పారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా గ్రామదర్శిని గ్రామవికాశం కార్యక్రమం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా క్షేత్ర సహాయకులు తమ సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సాలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ భంజ్‌దేవ్, ఎమ్మెల్సీ జగదీష్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు, మండల టీడీపీ అధ్యక్షుడు చలుమూరి వెంకటరావు, సాలూరు ఏ ఎంసీ చైర్మన్ పిన్నింటి ఈశ్వరరావు, చల్లపేట ఆరోగ్య కేంద్రం చైర్మన్ గెద్ద అన్నవరం, ఎంపీడీవొ గంటా వెంకటరావు, ఐసిడిఎస్ సిడిపివో రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికీ ఆదరణ-2 పనిముట్లు
గజపతినగరం, జూలై 23: చేతి వృత్తుదారులందరికీ, అర్హులైన వారికి ఆదరణ-2 కింద పనిముట్లు అందజేస్తామని ఎంపిడివొ ఎస్.కృష్ణవేణమ్మ అన్నారు. సోమవారం స్ధానిక ఎంపిడివొ కార్యాలయంలో టైలరింగ్, చేనేత కార్మికులకు సంబందించి అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వం 70శాతం రాయితీపై ఎంపికైన వారికి పనిముట్లును అందజేస్తుందన్నారు. లబ్ధిదారులు 30శాతం తమ వాటాను డిడి రూపంలో బిసి సంక్షేమ పేరున చెల్లించాలని సూచించారు. అందులో 20శాతం బ్యాంకులు రుణాలు కూడా ఇస్తుందన్నారు. బిసి కార్ఫోరేషన్ ద్వారా రుణాలు పొందేవారు ఈ ఆదరణ-2 పనిముట్లును పొందేందుకు అర్హత లేదన్నారు. ఈ విషయాన్ని లబ్ధిదారులు గమనించాలని కోరారు. ఆగష్టు 15 నుంచి లబ్ధిదారులకు పనిముట్లు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇవొపి ఆర్‌డి జి.జనార్ధనరావు, సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

క్షేత్ర సహాయకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
గజపతినగరం, జూలై 23: ఉపాధి హామీ పధకం క్షేత్ర సహాయకులకు ఉద్యోగ భద్రత కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని క్షేత్ర సహాయకులు డిమాండ్ చేశారు. స్ధానిక ఎంపిడివొ కృష్ణవేణమ్మకు ఈ మేరకు మండలంలోని క్షేత్ర సహాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం కార్యాలయం ఎదురుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కనీస వేతన చట్టం ప్రకారం 18వేల రూపాయల వేతనాన్ని ప్రతీ నెల ఇవ్వాలని కోరారు. అలాగే 2006 సంవత్సరం నుండి అనేక వ్యయప్రయాసలు పడి పధకాన్ని సమర్ధవంతంగా నిర్వహిస్తున్న క్షేత్ర సహాయకులకు ఉద్యోగ భద్రత, జీతాలు పెంచడం లేదన్నారు. క్షేత్ర సహాయకులు రాష్ట్ర పరిధిలోకి తమను తీసుకువచ్చి రాష్టమ్రే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర సహాయకులు పి.గోపి, ఎం.అప్పలనాయుడు, కె.పైడిపునాయుడు, ఎల్.మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక హోదాపై మోదీ కపటనాటకం
గజపతినగరం, జూలై 23: రాష్ట్రానికి విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ప్రత్యేకహోదా ఇవ్వడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కపటన నాటక చర్యలకు ఒడిగట్టారని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యురాలు వి.లక్ష్మి అన్నారు. మోదీకి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ సోమవారం అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం, సిపిఐ ఆద్వర్యంలో వినితి పత్రాన్ని అందజేశారు. పార్లమెంట్ సాక్షిగా ఎపికి ప్రత్యేకహోదాపై చర్చ జరిపి 15కోరుతూ డిమాండ్ చేసిన బిజెపి ఎన్నికలలో ఓట్లువేయించుకొని ఇపుడు 14వ ఆర్ధిక సంఘం వలన సాధ్యం కావడంలేదనే సాకుతో ఇవ్వడం కుదరదని చెప్పడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. బిజెపి, టీడీపీలు వలన రాష్ట్రం అన్యాయానికి గురై నయవంచనకు బలైందన్నారు. బిజెపితో నాలుగేళ్లు టీడీపీ పొత్తుపెట్టుకొని ఇపుడు ప్రజలలో తీవ్ర వ్యతిరేకత రావడంతో యూటర్న్ తీసుకొని కేంద్ర ప్రభుత్వం మెతక వైఖరిగా వ్యవరిస్తున్నారు. కార్యక్రమంలో సిపి ఎం గజపతినగరం, బొండపల్లి మండలాల కార్యదర్శిలు పురం అప్పారావు, తొత్తడి పైడిపునాయుడు, కె.సత్యనారాయణ, దొర, సిపి ఐ నాయకులు గేదెల రామునాయుడు, బగ్గ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక అలంకరణలో రాజరాజేశ్వరిదేవి
బొండపల్లి, జూలై 23: మండలంలోని దేవుపల్లి గ్రామంలో స్వయంభగా వెలసిన రాజరాజేశ్వరిదేవి అమ్మవారిని తొలి ఏకాదశిని పురష్కరించుకొని ప్రత్యేక అలంకరణ జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు దూషి శ్రీధర్ శర్మ మాట్లాడుతూ ప్రధమైకాదశి అను సంస్కృతి నామాన్ని బట్టి తెలుగువారు దీనిని తొలి ఏకాదశి అని వ్యహరిస్తున్నారు. సంవత్సరానికి 24 ఏకాదశులు అందునా అధికమాసంలో ఇరవై ఆరు ఏకాదశులు వచ్చినా ప్రధమైకాదశి, మహా ఏకాదశి అని ఈ ఒక్క ఏకాదశిని గొప్పగా చెప్పడానికి కారణాలు ఉన్నాయని తెలిపారు. ఏడాదికి అయనములు రెండు, అందునా దక్షిణాయన పుణ్యకాలంయందు పండుగలు అధికంగా వస్తాయి. అంతేకాక ఆరోగ్యం కోసం నియమాలు ఎక్కువగా పాటించాల్సిన అవసరం రీత్యా పెద్దవారు అనేక వ్రతాలు పెట్టారని తెలిపారు. అట్టి పండగలను ప్రారంభం ఈ ఏకాదశి నుంచేనని, ఇంకో విధంగా చూస్తే చాతుర్మాస్యదీక్ష దినాల ఏకాదశులలో మొదటిది కావడం వలన కూడా దీనికి ప్రధమైకాదశి అని పేరు వచ్చిందన్నారు. అసలు ఈ ఏకాదశి పండగ గురించి బ్రహ్మవైవర్త పురాణంలో వివరంగా ఉందన్నారు, ఈ ఏకాదశి విశిష్టమైనదిని, విష్ణుమూర్తికి ప్రియమైనదని చెప్పారు. ఈ రోజు హరిశయనోత్సవంగా జరుపుతారని అన్నారు. ఏకాదశి పురష్కరించుకొని సోమవారం భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు.

క్షేత్ర సహాయకులకు కనీస వేతనం కల్పించాలి
బొండపల్లి, జూలై 23: మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంలో పనిచేస్తున్న క్షేత్ర సహాయకులకు కనీస వేతనం 18వేలు ఇవ్వాలని క్షేత్ర పహాయకుల మండల అధ్యక్షుడు చందక సూరిబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్ధానిక మండల సముదాయం వద్దగల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరాహార దీక్షను క్షేత్ర సహాయకులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ ఆర్ ఈ జి ఎస్ పధకం ప్రారంభం నుండి అనేక అష్టకష్టాలకు ఓర్చి విధులను నిర్వహిస్తున్నామని చెప్పారు. కనీసవేతనంకు నోచకోకపోవడంతో కుటుంబ జీవనం భారంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈనెల 23నుంచి విధులను బహిష్కరించడం జరిగిందని ఈ మేరకు ఎంపిడివొ ఎం.ప్రకాశరావుకు లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగిందన్నారు. క్షేత్రసహాయకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, నియామకాలను, సర్వీసు నిబంధనలను జిల్లా కలెక్టర్ పరిధిలోకి తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సమస్యల పరిష్కారం అయ్యే వరకు విధులను బహిష్కరిస్తామని క్షేత్ర సహాయకుల మండల అధ్యక్షుడు సూరిబాబు స్పష్టంచేశారు.