విజయనగరం

విద్యార్థులకు వైద్య తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెర్లాం, ఆగస్టు 14: మండలంలోని ప్రాథమిక పాఠశాలలో ముఖ్యమంత్రి బాలసు రక్షయోజన పథకంలో భాగంగా విద్యార్థులకు మంగళవారం వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈసందర్భంగా వైద్యాధికారి ప్రదీప్‌కుమార్ మాట్లాడుతూ 12 సంవత్సరాలలోపు విద్యార్థులకు వైద్యతనిఖీలు నిర్వహించి ఉచితంగా మందులను సరఫరా చేస్తున్నామన్నారు. ఈ మేరకు 56మంది విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించగా ముగ్గురి చర్మానికి సంబంధించి వ్యాధులు ఉన్నట్లు గుర్తించి వారికి మందులను అందించామన్నారు. అనంతరం 56మంది విద్యార్థులతో నులిపురుగుల నివారణ మాత్రలను వేయించామన్నారు. ఈ వైద్య శిబిరాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, యుటిఎఫ్ మండలశాఖ అధ్యక్షుడు మరిశర్ల సింహాచలం నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించామన్నారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తెలియజేయాలి
గరుగుబిల్లి, ఆగస్టు 14: మండల పరిధిలోని ఆయాగ్రామాల్లో నెలకొన్న సమస్యలను మండల టీడీపీ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు ఉన్నతాధికారులకు తెలియజేస్తామని టీడీపీ మండల అధ్యక్షుడు ద్వారపురెడ్డి ధనుంజయరావు అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం టీడీపీ ముఖ్య నాయకులు, గ్రామ కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రతీ నెలా 14వతేదీన ముఖ్య నాయకులు, తదితరులతో సమావేశాలను నిర్వహించి సమస్యలను తెలుకుంటున్నామన్నారు. గ్రామాల్లో మండల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు గుర్తించిన సమస్యలను మండల టీడీపీ దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు మర్రాపు పురుషోత్తంనాయుడు, ఎంబి విజయాంకుశం, పిహెచ్‌సీ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ పి పూర్ణచంద్రరావు, అంబటి తవిటినాయుడు, గౌరినాయుడు, తదితరులు పాల్గొన్నారు.

స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో
పలు సేవా కార్యక్రమాలు
గరుగుబిల్లి, ఆగస్టు 14: స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని మండల పరిషత్ ఉపాధ్యక్షుడు ద్వారపురెడ్డి ధనుంజయరావు అన్నారు. ఈమేరకు మండల పరిధిలోని పెద్దూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పార్వతీపురం స్వామి సేవాసమితి ఆధ్వర్యంలో మంగళవారం షూ(బూట్లు)ను పంపిణీ చేశారు. స్వామి సేవాసమితికి చెందిన ఎం తాతబాబు విద్యార్థులకు విరాళంగా అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ధనుంజయరావు మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకుని పాఠశాలకు మంచిపేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో స్వామిసేవా సమితి ప్రధాన కార్యదర్శి కె రామ్మోహనరావు, మాజీ ఎంపీపీ మర్రాపు పురోషత్తంనాయుడు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
వర్లరిగుడబలో పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు
గరుగుబిల్లి, ఆగస్టు 14: మండల పరిధిలోని వర్లరిగుడబ గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈమేరకు మండల ఇఓపీఆర్‌డీ ఎంవి గోపాలకృష్ణ, గ్రామ పంచాయతీ కార్యదర్శి బి భవాని ఆధ్వర్యంలో పారిశుద్ధ్యం పనులు చేపట్టారు. గ్రామంలోని ప్రధానవీధితో పాటు పక్కా కాలువల్లో పూడికలను తొలగించి గ్రామశివారులకు తరలించామన్నారు. అనంతరం కాలువల్లో బ్లీచింగ్, ఫినాయిల్స్ వేయిస్తున్నామన్నారు. అదేవిధంగా రక్షితమంచినీటి పథకాలు, బోరుబావుల సమీపంలో మురుగునీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రస్తుత సీజన్‌లో వ్యాధులు ప్రభలకుండా ఉండేందుకు పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తున్నామన్నారు.

16న ట్రస్టుబోర్డు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
గరుగుబిల్లి, ఆగస్టు 14: ఉత్తరాంధ్రాలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి శ్రీవెంకటేశ్వరస్వామి, శ్రీకోదండరామస్వామి ఆలయాల ట్రస్టుబోర్డును నియమిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈమేరకు ఈనెల 16న ఆలయ ప్రాంగణంలో ట్రస్టుబోర్డు ప్రమాణస్వీకారానికి దేవాదాయశాఖాధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ మంత్రి, శ్రీకాకుళం జిల్లాల స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులు శతృచర్ల విజయరామరాజు, కురుపాం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి విటి జనార్థన థాట్రాజ్ ఆధ్వర్యంలో ట్రస్టు బోర్డు నియామకానికి చర్యలు చేపట్టారు. ట్రస్టుబోర్డు ఛైర్మన్‌గా రావివలసకు చెందిన ఆర్నేపల్లి గంగాధర్‌నాయుడు, సభ్యులుగా పార్వతీపురానికి చెందిన రమేష్‌బాబు, గౌరీపురానికి చెందిన శంబంగి పకీరు, ఖడ్గవలసకు చెందిన బంకురు అప్పలనాయుడు, తోటపల్లికి చెందిన మార్కొండ ఇందుమతి, కిచ్ఛాడకు చెందిన పి శ్రీనివాసరావు, గుమ్మలక్ష్మీపురానికి చెందిన ఏ విమల, కొమరాడకు చెందిన కె అచ్యుతరావు, పెదమేరంగికి చెందిన ఆర్ విశ్వనాధంతోపాటు ఎక్స్ అఫిషియా సభ్యులుగా ఆలయ అర్చకులు పి గోపాలకృష్ణమాచార్యులను నియమించారు. ఈమేరకు ఆలయ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.