విజయనగరం

శ్రావణ మంగళగౌరీ అలంకారంలో రాజరాజేశ్వరిదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొండపల్లి, ఆగస్టు 14: మండలంలోని దేవుపల్లి గ్రామంలో స్వయంభూగా వెలసిన రాజరాజేశ్వరిదేవి అమ్మవారిని య మొదట శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరీగా ప్రత్యేక పుష్పములతో అలంకరించారు. ఈ సందర్భంగా దేవుపల్లి గ్రామానికి చెందిన తెలగా కులస్ధులు సుమారు 500మంది మేళతాళాలతో ఘటాలు తలపై పెట్టుకొని ప్రభలతో గ్రామమంతా తిరిగి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు దూసి శ్రీధర్ శర్మ అమ్మవారికి ప్రత్యేక తులసీ పూజ, కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రావణ మంగళగౌరీ అలంకారంలో రాజరాజేశ్వరిదేవి దర్శనం ఇవ్వడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

ప్రజాసమస్యలపై ప్రభుత్వాలు
దృష్టి సారించకపోవడం శోచనీయం
తెర్లాం, ఆగస్టు 14: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసమస్యలపై దృష్టి సారించకపోవడం శోచనీయమని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కోట అప్పన్న అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మంగళవారం విలేఖర్లతో మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేయడంలో విఫలమయ్యారని, నిరుద్యోగ భృతి 2వేల రూపాయలు వంతున నెలకు ఇస్తామని ఎన్నికల్లో ముందు హామీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం వెయ్యి రూపాయలు ఇచ్చేందుకు ఆమోదించిందన్నారు. సంవత్సరానికి 2కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్ ఆధ్వర్యంలో లక్షా 80వేల మంది ఉద్యోగులను తొలగించి వారి పొట్టకొట్టారన్నారు. ప్రజలను మోసగిస్తు కాలక్షేపం చేస్తున్నారే తప్ప ప్రజలకు ఎటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలుచేయడం లేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చిత్తుగా ఓడిపోతాయని జోష్యం చెప్పారు. ఆ రెండు పార్టీలను ఓడించేందుకు యువకులు ముందుకు వస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్, తిరుపతిరావు, సరస్వతి, తదితరులు పాల్గొన్నారు.
ఆదర్శ పాఠశాలలో స్వచ్ఛ్భారత్
తెర్లాం, ఆగస్టు 14: మండలం పెరుమాళి ఆదర్శపాఠశాలల విద్యార్థులు పాఠశాల ఆవరణలో ఆగస్టు 15 సందర్భాన్ని పురస్కరించుకుని భారతదేశం పటాన్ని పూలతో వేశారు. 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ప్రిన్సిపల్ ఈశ్వరరావు తెలిపారు. సుమారు 40కేజీల వివిధ రకాల పూలను సేకరించి పాఠశాల ఆవరణలో భారతదేశం ఆకారంలో అలకరించారు. ఈ చిత్రాన్ని చూసేందుకు గ్రామానికి చెందిన పలువురు తరలించారు.

వి చిన్నయ్యపేటలో స్వచ్ఛ్భారత్‌పై వక్తృత్వ పోటీలు
తెర్లాం, ఆగస్టు 14: మండలం చుక్కవలస ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు స్వచ్ఛ్భారత్‌పై వక్తృత్వ పోటీలను నిర్వహించామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నీలకంఠం తెలిపారు. ఈ పోటీలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో గెలుపొందిన విజేతలకు ఆగస్టు 15వ రోజున బహుమతులు అందించనున్నామన్నారు. ఈ పోటీలలో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా పాల్గొనడం విశేషమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శాంతకుమార్, శంకరరావు, పెద్దింటి శ్రీరాం, దువ్వాడ మదుబాబు, రామారావు, రాములు, తదితరులు పాల్గొన్నారు.