విజయనగరం

డిసిసిబి రద్దులో పక్షపాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఆగస్టు 20: రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల డిసిసిబి పాలకవర్గాల కాలపరిమితి పెంచి కేవలం నాలుగు జిల్లాల పాలకవర్గాలను రద్దు చేయడం శోచనీయమని వైసీపీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయనగరం డిసిసిబి చైర్మన్‌గా పనిచేసిన మరిశర్ల తులసి ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన వారని పేర్కొన్నారు. పాలకవర్గం రద్దు వెనుక మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు ఉన్నారని రానున్న ఎన్నికల్లో ప్రజలు అతనికి బుద్ధి చెబుతారని విమర్శించారు. జిల్లాలో 90 శాతం పిఎసిఎస్‌లు వైసీపీ నాయకుల ఆధీనంలో ఉన్నందున వాటికి కాలపరిమితి ముగిసినప్పటికీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ముందుకు రాలేదన్నారు. డిసిసిబిలో నాబార్డు నిర్వహించిన తనిఖీల సమయంలో చిన్న చిన్న కారణాలు చూపినప్పటికీ అవి న్యాయస్ధానంలో నిలవలేదని మరోమారు కాలపరిధితో కూడిన పునర్విచారణ జరపాలని న్యాయస్థానం ఆదేశించినట్టు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో డిసిసిబి ఉపాధ్యక్షుడు చనుమల్లు వెంకటరమణ, డైరెక్టర్ లెంక శ్రీరాములు, పి.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి
విజయనగరం, ఆగస్టు 20: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఎస్పీ పాలరాజు అన్నారు. సోమవారం తన ఛాంబర్‌లో ఆయన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా చీపురుపల్లికి చెందిన వెంకట రమణ భార్య వరకట్నం కోసం వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. అలాగే వేపాడకు చెందిన కొందరు కొట్లాటకు సంబంధించి, సారిక గ్రామానికి చెందిన జట్లయ్య భూ తగాదాలపై ఫిర్యాదు చేశారు. ఈ విధంగా ఇతర ప్రాంతాల నుంచి పలు ఫిర్యాదులు అందాయి. వీటిని పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీ పాలరాజు పోలీసు అధికారులను ఆదేశించారు.

జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపండి
విజయనగరం, ఆగస్టు 20: కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘మీ కోసం’ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి. వాటిలో రేషన్‌కార్డులు, పింఛన్లు, గృహాలు మంజూరు చేయాలని ఎక్కువ మంది దరఖాస్తు చేశారు. అలాగే వరద ముంపు ప్రాంతాల ప్రజలు కూడా వచ్చి తమ గోడును వెళ్లబుచ్చారు. వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలకు నిర్ధేశించిన లక్ష్యాలను ఎప్పటికపుడు చేరుకోవాలన్నారు. జిల్లాలో ప్రాధాన్యత రంగాల్లో గుర్తించిన అంశాలపై కొంత మంది జిల్లా అధికారులతో ఒక టీమ్‌గా ఏర్పాటు చేసి వాటి అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు బ్యాంకుల ద్వారా త్వరితగతిన రుణాలు అందించాలన్నారు. ఈ సమావేశంలో జెసి సీతారామారావు, డిఆర్వో వెంకటరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

గ్రామాలలో పారిశుద్ధ్య పరిస్థితి మెరుగు పర్చాలి
* ఎంపీడీవొ రమణమూర్తి
గంట్యాడ, ఆగస్టు 20: సీజనల్ వ్యాధులు ప్రబల కుండా నిరోధించేందుకు గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఎంపీడీవొ రమణమూర్తి సూచించారు. సోమవారం గంట్యాడ మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవొ మాట్లాడుతూ ప్రస్తుత సీజన్‌లో జ్వరాలు, అంటురోగాలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వ్యాధుల భారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. అన్ని గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని అన్నారు. జ్వర పీడుతులు ఉన్న గ్రామాలలో ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఇవొ పీ ఆర్డీ సుగుణాకరరావు తదితరులు పాల్గొన్నారు.