విజయనగరం

ఎల్‌ఇడి బల్బుల మాయాజాలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, సెప్టెంబర్ 20: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ భారాన్ని తగ్గించేందుకు ఎల్‌ఇడి బల్బులను ప్రోత్సహిస్తున్నప్పటికీ జిల్లాలో మాత్రం ఎల్‌ఇడి వెలుగులు కన్పించడం లేదు.. ఎక్కడ చూసిన చీకట్లు అలుముకున్నాయి. ఎల్‌ఇడి బల్బులను ఏర్పాటు చేయడంతోపాటు వాటి నిర్వాహణ కూడా ఆయా కాంట్రాక్టర్లకు అప్పగించారు. దీంతో కాంట్రాక్టర్లు తూతూ మంత్రంగా పనిచేసి వదిలివేయడంతో జిల్లాలోని అనేక మండలాల్లో ఎల్‌ఇడి బల్బులు వెలగకపోవడం పట్ల ఇటీవల జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో సభ్యులు గగ్గోలు పెట్టిన విషయం విధితమే. జిల్లాలో వివిధ పంచాయతీలకు ఎల్‌ఇడి బల్బుల కోసం ఎంపీ ల్యాడ్స్ నిధులను వినియోగించారు. ఎంపీ అశోక్‌గజపతిరాజు తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని గ్రామ పంచాయతీలకు 70 శాతం ఎంపీ ల్యాడ్స్ నిధులు, 30 శాతం గ్రామ పంచాయతీ కంట్రిబ్యూషన్ కింద నిధులు విడుదల చేశారు. ఆ విధంగా జిల్లాలో విజయనగరం, గజపతినగరం, చీపురుపల్లి, బొబ్బిలి, ఎస్‌కోట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గ్రామ పంచాయతీలకు ఎల్‌ఇడి బల్బుల కొనుగోలుకు నిధులు విడుదల చేశారు. ఇక ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మండలాలకు సంబంధించి అరకు ఎంపీ గీత నూరు శాతం ఎల్‌ఇడి బల్బులకు నిధులు మంజూరు చేశారు. వాటిలో సీతానగరం, మక్కువ, గరుగుబిల్లి, కొమరాడ, పార్వతీపురం మండలాలు ఉన్నాయి. ఇక ఇఇఎస్‌ఎల్ సిఎస్‌ఆర్ నిధులతో జామి, ఎస్‌కోటలో మరికొన్ని ఎల్‌ఇడి బల్బులు ఏర్పాటు చేశారు.
ఇక చంద్రన్న క్రాంతి పథకం కింద 11 మండలాల్లో ఎల్‌ఇడి బల్బులను ఏర్పాటు చేశారు. వాటిలో ఎల్‌కోట, మెంటాడ, వేపాడ, కొత్తవలస, బలిజపేట, కురుపాం, జియ్యమ్మవలస, సాలూరు, గుమ్మలక్ష్మిపురం, పాచిపెంట, పార్వతీపురం మండలాలు ఉన్నాయి. చంద్రన్న క్రాంతి కింద ఎల్‌ఇడి బల్బు ఒక్కొదానికి నెలకు రూ.50 చొప్పున పదేళ్లపాటు వారు ఇఎస్‌ఎస్‌క్రోకి జమచేయాల్సి ఉంది. ఈ విధంగా ఎల్‌ఇడి బల్బులను ఏర్పాటు చేసినప్పటికీ అవి ఎక్కడ వెలుగుతున్న దాఖలాలు లేవు. నాణ్యత కొరవడటం వల్లనే బల్బులు కొద్ది రోజులు వెలిగి మరమ్మతుకు గురవుతున్నాయి. గరివిడి మండలంలో 7078 ఎల్‌ఇడి బల్బులు వెలగడం లేదని ఫిర్యాదు అందింది. అలాగే గుర్లలో 601 బల్బులు, ఎల్‌కోటలో కరవాలలాం, ఎల్‌కెఎస్ పురం, రేగ, మల్లివీడు, కొట్యాడ, జెడిపేట, పోతంపేట గ్రామాల్లో వీధి దీపాలు వెలగడం లేదు. ఇదే విషయమై డిపిఒ సత్యనారాయణ వద్ద ప్రస్తావించగా, ఎల్‌ఇడి దీపాలు మరమ్మతు చేపట్టాల్సిన బాధ్యత ఆ కాంట్రాక్టరుపై ఉందన్నారు. రాష్ట్రంలో అతి తక్కువ ధరకు ఎల్‌ఇడి బల్బులు కొనుగోలు చేశామన్నారు. ఒక్కొ బల్బును రూ.1037 చొప్పున కొనుగోలు చేశామన్నారు. కాగా, వెలగని దీపాలకు ఎంత పెట్టి కొనుగోలు చేస్తే ప్రయోజనం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.

మానవతా విలువలను గౌరవిస్తేనే మనుగడ
గుర్ల, సెప్టెంబర్ 20: మానవతా విలువలను గౌరవిస్తేనే మనిషి మనుగడకు నాందీ అని కలెక్టర్ హరి జవహర్‌లాల్ అన్నారు. గురువారం కేశలి స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో కస్తూరీభా పాఠశాల విద్యార్థులకు రుతురుమాళ్లు పంపిణీ కార్యక్రమాల్లో కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. రాష్ట్ర బాలల పరిరక్షణ కమిషన్ సభ్యులు కేశలి అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల అవసరాలను గుర్తించి సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఆశాజ్యోతి స్వచ్చంద సంస్థ సిఇవొ రవిచంద్రను అభినందించారు. విలువలతో కూడిన విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. మానవ మనుగడ విద్యా ఆరోగ్యం, వ్యవసాయంపై ఆధారపడి ఉందని చెప్పారు. ఎంత సంపాదించామన్నది కాదని ఎంత సేవ చేశామన్నదే సంతృప్తిని ఇస్తుందని అన్నారు. లక్ష్యంతో చదివిన వారికి విజయాలు తప్పనిసరిగా వస్తాయని చెప్పారు. మరిన్ని స్వచ్చంద సంస్థలు ఏర్పడి మంచి కార్యక్రమాలు చేపట్టి పేదవారిని ఆదుకోవాలని అన్నారు. లోపపోషణ రహిత కార్యక్రమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కిశోరబాలిక కార్యక్రమాన్ని సెప్టెంబర్‌లో నిర్వహించామని తెలిపారు. కార్యక్రమం ముఖ్య సందేశాన్ని అందరినీ నిలబెట్టి గుండెపై చేయించి చదివి వినిపించారు. సందేశం విన్నవారు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, పౌష్టికాహారంతోనే లోపపోషణ సమాజం సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రుల్లో చైతన్యం తేవాలని తెలియజేశారు. అలాగే ప్రతి విద్యార్థి అన్ని రంగాలలో రాణించి తమ తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని అన్నారు. అన్నంపెట్టే వ్యవసాయ రంగాన్ని కుండా విడిచిపెట్టకుండా అందులో కూడా రాణించాలని అన్నారు. కేశల అప్పారావు మాట్లాడుతూ ఒకప్పుడు సమాజంలో ఆడపిల్లకు గుర్తింపు ఉండేదికాదని అన్నారు. ప్రస్తుతం అన్ని రంగాలలో ఆడపిల్లలు రాణిస్తుండడంతో ప్రతి తండ్రి ఆడపిల్ల ఉండాలని భావిస్తున్నారని అన్నారు. అయితే వారికి రక్షణ కరువైందని బాధను వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఆడపిల్లలపై అఘత్యాలే జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచి ఆలోచన నడవడికతోనే ఆడపిల్ల భవిష్యత్ ముడిపడి ఉందని అన్నారు. ముఖ్యంగా టివిలకు, సెల్‌ఫోన్లుకు దూరంగా ఉండాలని చెప్పారు. ఆడపిల్లల అభ్యున్నతి కోసం ఆశాజ్యోతి సంస్థ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు సంయుక్త కలెక్టర్ సీతారామారావు, సివిల్ జడ్జీ శ్రీహరి, డిఇవొ నాగమణి, ఐసిడి ఎస్ డైరెక్టర్ వసంత బాల, చైల్డ్‌వెల్ఫేర్ చైర్‌పర్సన్ మాధురీ లత, పిడబ్ల్యు చైర్ పర్సన్ శ్యామలారాణి, చైర్‌పర్సన్ వి.లక్ష్మణరావు, జెజెపి మెంబర్ కరణం జనార్థనరావు, ఎంపీడీవొ రవిచంద్ర,తహశీల్దార్ సీతారామయ్య, ఎం ఇవొ భానూప్రకాష్, కస్తూరీభా పాఠశాల ప్రిన్సిపాల్ హైమావతి, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

హాల్ టికెట్ జారీ- పరీక్ష అనుమతికి సారీ!
* అంతుబట్టని రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు నిర్వాకం
* ఆందోళనలో వికలాంగ అభ్యర్థి
వేపాడ, సెప్టెంబర్ 20: రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు వారు హాల్‌టికెట్ జారీ చేశారు. తీరా పరీక్ష కేంద్రానికి వెళ్తే జాబితాలో మీ పేరు లేదంటూ పరీక్ష రాసేందుకు అక్కడి అధికారులు అనుమతి నిరాకరించారు. వివరాల్లోకి వెళితే మండలంలోని వావిలపాడు శివారు సంజీవిమెట్ట గ్రామానికి చెందిన వికలాంగుడు ఆదిరెడ్డి దేముడు నాయుడు ఆర్ ఆర్ బి పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. రైల్వే బోర్డు వారు అతని దరఖాస్తును పరిశీలించి హాల్‌టికెట్‌ను జారీ చేశారు. పరీక్ష రాసేందుకు శిక్షణ పొంది వ్యయ ప్రయాసలకు ఓర్చి గురువారం ఉదయం 7.15గంటలకు విజయనగరం జెఎన్‌టియు జంక్షన్, గాజులరేగ వద్దగల ఆయా డిజిటల్ జోన్‌కు చేరుకొని అక్కడి అధికారులకు హాల్‌టికెట్ చూపించి పరీక్షకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరాడు. హాల్‌టికెట్ మేరకు రైల్వే బోర్డు వారు పంపిన జాబితాలో దేముడునాయుడు పేరు లేకపోవడంతో పరీక్ష నిర్వాహకులు పరీక్ష రాసేందుకు అనుమతి నిరాకరించారు. దీంతో వికలాంగ అభ్యర్థికి ఆందోళనకు దిగాడు.