విజయనగరం

మున్సిపాలిటీలో యధావిధిగా పారిశుద్ధ్య పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 20: పట్టణంలో ఒక వైపువర్షం కురుస్తున్నా, మరోవైపు ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్నా పారిశుద్ధ్యం, పూడికతీత పనులు యధావిధిగా జరుగుతున్నాయి. గత నెల రోజుల నుంచి చెదురుమదురుగా కురుస్తున్న వర్షాలకు పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు ఆటంకం కలుగుతున్నా ఎక్కడా ఆపకుండా పర్మినెంట్ పారిశుద్ధ్య కార్మికులతోపాటు కృష్ణా కన్‌స్ట్రక్షన్ ఆధ్వర్యంలో సుమారు 150 మంది ప్రైవేటు పారిశుద్ధ్య కార్మికులను పనులలోకి తీసుకుని పారిశుద్ధ్య నిర్వహణ చేపడుతున్నారు. మున్సిపాలిటీలో అమలు చేస్తున్న జీవోనెంబర్ 279కు వ్యతిరేకంగా సిఐటియు అనుబంధ కార్మిక సంఘానికి చెందిన 225 మంది పారిశుద్ధ్య కార్మికులు గత కొన్నిరోజుల నుంచి విధులను బహిష్కరించారు. అయితే ఎఐటియు అనుబంధ కార్మిక సంఘానికి చెందిన 50 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరవుతున్నారు. తమ యూనియన్‌కు చెందిన పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరవుతున్నారని ఇప్పటికే ఎఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.రంగరాజు ప్రకటించారు. అయితే జీవోనెంబర్ 279ని రద్దుచేసి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టివి రమణ డిమాండ్ చేశారు. తమ యూనియన్ చెందిన కార్మికులపై అక్రమంగా కేసులు పెట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు పారిశుద్ధ్య కార్మికుల సమ్మె, మరోవైపు వర్షాలు కురుస్తుండటంతో క్షీణిస్తున్న పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపర్చేందుకు కృష్ణా కన్‌స్ట్రక్షన్ ప్రతినిధులు నడుం బిగించారు. ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉన్నందున పారిశుద్ధ్య పనుల నిర్వహణకు ఎటువంటి భంగం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ ఆదేశించిన నేపధ్యంలో కృష్ణా కన్‌స్ట్రక్షన్ ప్రతినిధి గుడవర్తి వెంకటపతంజలి ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రైవేటు పారిశుద్ధ్యకార్మికులను పనుల్లోకి తీసుకుని పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు.

సిపిఎస్ రద్దు చేసేవరకూ పోరాటం ఆగదు
* ఎపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు
విజయనగరం (్ఫర్టు) ఆగస్టు 20: సిపిఎస్‌ను రద్దు చేసేవరకూ పోరాటం చేస్తామని ఎపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు అన్నారు. కాలయాపన కమిటీలు వేసి సిపిఎస్‌ను రద్దు చేయకుండా ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం ఆలోచనను తిప్పికొడతామని చెప్పారు. పట్టణంలో ఎపిటిఎఫ్ జిల్లా శాఖ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిపిఎస్ రద్దు అయ్యేవరకూ పోరాటాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సిపిఎస్‌పై అద్యయనం కోం ప్రభుత్వం నిపుణుల కమిటీని వేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని వెల్లడించకుండా కమిటీని వేసి చేతులు దులుపుకోవడం సరైన పద్ధతి కాదని జిల్లా ప్రధాన కార్యదర్శి జెసి రాజు అన్నారు. శాసనసభలో తీర్మానం కన్నా సిపిఎస్ అమలుకోసం జారీచేసిన జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 23న జరిగే ఎపిటిఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో కమిటీ వేయడాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేసి ప్రభుత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి పంపుతామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.కృష్ణ, వై.వెంకటరావు, దామోదరనాయుడు, సిహెచ్.వెంకటరమణ, బలరాంనాయుడు, శ్రీనివాసరావు, ఈశ్వరరావు,పైడిరాజు, చిన్నంనాయుడు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

లక్ష్మీగణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు
శృంగవరపుకోట, సెప్టెంబర్ 20: మండలంలోని ధర్మవరం శ్రీగణపతి ఆలయంలో గురువారం మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో వినాయక చవితి నుండి నేటి వరకు పూజలు నిర్వహిస్తున్నారు. అయితే గ్రామంలోని మహిళలంతా గ్రామానికి మంచి జరగాలంటూ ఈ పూజలు నిర్వహిస్తున్నామని అర్చకులు రాజగోపాల ఆచారి తెలిపారు. ఈ ఏడాది తమగ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు కూడా పాడిపంటలు అభివృద్ధి చెందాలని అందరు సుఖశాంతులతో ఉండాలని ఈ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ పూజల్లో వందలాది మంది మహిళలు పాల్గొన్నారు.

గ్రామసందర్శన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
శృంగవరపుకోట, సెప్టెంబర్ 20: గ్రామంలోని వివిధ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపడుతున్న గ్రామసందర్శన కార్యక్రమాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవొ మన్మధరావు తెలిపారు. గురువారం వినాయకపల్లి గ్రామంలో అధికారులు గ్రామసందర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామసందర్శన కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు పాల్గొంటున్నారని, గ్రామాల్లోని ఎటువంటి సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. గతంలో ప్రభుత్వ పథకాలు పొందలేని అర్హులు గ్రామసందర్శిని కార్యక్రమంలో తిరిగి దాఖలు చేసుకోవాలని ఆయన కోరారు. గ్రామంలోని కొంత మంది నుండి వినతులు అందుకుని వాటి సమస్యలకై ఉత్తతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేలా చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎపీవొ చిన్నప్పయ్య, రెవెన్యూ అధికారి సన్యాసినాయుడు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

రెండు వేల మందికి అన్న సమారాధన
శృంగవరపుకోట, సెప్టెంబర్ 20: పట్టణంలోని నానిగిరి వీధిలో గురువారం వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండు వేల మందికి అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. నానిగిరి అప్పలనాయుడు ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఈ అన్న సమారాధన కార్యక్రమంలో అనేక మంది పాల్గొని వినాయక ప్రసాదాన్ని స్వీకరించారు.
అన్న సమారాధన
లక్కవరపుకోట, సెప్టెంబర్ 20: మండలంలోని ఎల్.కోట మేజరు పంచాయతీలో గల నెయ్యిల వీధిలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గురువారం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు ఐదువేల మంది వరకు ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారని కమిటీ పెద్దలు తెలియజేశారు. త్వరలోనే ఊరేగింపు నిమజ్జనం ఉంటుందని, దీనిని జయప్రదం చేయాలని కమిటీ సభ్యులు కోరారు.