విజయనగరం

ఉచిత వైద్య శిబిరం విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దత్తిరాజేరు, సెప్టెంబర్ 20: మండలంలోని పెదకాద పంచాయతీ మధుర గ్రామంలో జ్వరాలు విజృంభించడంతో దత్తిరాజేరు పిహెచ్‌సి సిబ్బంది ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సిహెచ్‌సివొ సత్యనారాయణ ఆధ్వర్యంలో సిబ్బంది 60 మంది రోగులకు చికిత్స చేసి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా సిహెచ్‌వొ మాట్లాడుతూ గ్రామాలలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, ఇళ్ళకు దూరంగా పశువులను కట్టాలని, నీటిని మరిగించి చల్లార్చి తాగాలని కోరారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మాణాలపై దృష్టి సారించాలి
దత్తిరాజేరు, సెప్టెంబర్ 20: మండలంలో చాలా గ్రామాలలో నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయిన చెత్త సంపద కేంద్రాలపై దృష్టి సారించాలని సిబ్బందిని ఆదేశించామని ఉపాధి ఏపివొ సుందరరావు గురువారం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ చెత్తాచెదారాలను సేకరించి వాటి ద్వారా ఎరువులను తయారు చేసి రైతులకు అందించాలనే ఉద్దేశ్యంతో చెత్తసంపద కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పనులు త్వరితగతిన చేపట్టి అనుకున్న లక్ష్యాలకు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇసి కల్యాణ్ చక్రవర్తి, టెక్నికల్ అసిస్టెంట్ పాల్గొన్నారు.

గ్రామదర్శినిలో సమస్యల పరిష్కారం
నెల్లిమర్ల, సెప్టెంబర్ 20: గ్రామదర్శినిలో సమస్యలు పరిష్కరించనున్నామని ఎంపీడీవొ కె. అక్కారావు అన్నారు. గురువారం కొండవెలగాడ గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులు వీధుల్లో పర్యటించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మురుగునీరు పారుదల, పారిశుద్ధ్యపనులను పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో ఎంపీడీవొ అక్కారావు మాట్లాడుతూ గ్రామదర్శినిలో సమస్యలు గుర్తించి పరిష్కరిస్తామని చెప్పారు. వర్షాకాలం దృష్ట్యా అంటురోగాలు ప్రబలే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలని అన్నారు. ఇంటి పరిసర ప్రాంతాలలో మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు కాచిచల్లార్చిన నీటిని తాగాలని, అలాగే వేడి పదార్థాలను ఆహారంగా తీసుకోవాలని అన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు ఉపయోగించడం ద్వారా అంటురోగాలకు దూరంగా ఉండవచ్చు అని తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్ కె. వెంకటేశ్వరరావు, ఇవొపీఆర్డీ హెచ్.్భనోజీరావు, ఏవొ ఎం.సూరినాయుడు, వెలుగు ఏపీఎం పి.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికే గ్రామదర్శిని
దత్తిరాజేరు, సెప్టెంబర్ 20: గ్రామాలలో సమస్యలు తెలుసుకుని వాటిని అక్కడికక్కడే సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించడానికి గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవొ బాబూరావు అన్నారు. గురువారం మండలంలోని ఇంగీలాపల్లి గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడివొతో సహా ఇతర శాఖలకు చెందిన అధికారులు వీధుల్లో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవొ మాట్లాడుతూ గ్రామాలలో సంక్షేమ కార్యక్రమాలు అర్హులందరికీ మంజూరు చేయడం జరుగుతుందని, ఇంకా ఎవరైన అర్హులు ఉంటే ధరఖాస్తు చేసుకుంటే పరిశీలించి పథకాలు మంజూరు చేస్తామని అన్నారు. అలాగే గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులకు తెలియజేస్తే పరిశీలించి జిల్లా అధికారులకు ప్రతిపాదనలు పంపించడం జరుగుతుందని చెప్పారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి స్వయంగా కలసి వినతి పత్రం అందజేస్తే మంజూరుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్ జి. కల్పవల్లి, ఏపీవొ సుందరరావు, హౌసింగ్ ఏ ఇ ఉమామహేశ్వరరావు, ఆర్‌డబ్ల్యుఎస్ జెఇ చంద్రకళ, వ్యవసాయ అధికారి కె.గోవిందమ్మ, ఎంఇవొ వెంకటరావు, పిఆర్‌జెఇ చంద్రశేఖర్, ఐసిడి ఎస్ సూపరువైజరు శ్యామలత, కోరపుకొత్తవలస వైద్య సిబ్బంది, ఎం. ఎరుకునాయుడు, మాజీ సర్పంచ్ గాడి కృష్ణ, జిల్లా గొర్లె పెంపకం సంఘం అధ్యక్షుడు బమ్మిడి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.