విజయనగరం

ఆధ్యాత్మికత శోభకు నవ గణపతుల మహోత్సవం దోహదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం,సెప్టెంబర్ 21: నవ గణపతుల మహోత్సవం గజపతినగరం ప్రాంతం ఆధ్యాత్మికత శోభకు దోహదం చేసిందని బొబ్బిలి మున్సిపల్ మాజీ చైర్మన్ బేబీనాయన అన్నారు. శుక్రవారం గజపతినగరం జాతీయ రహదారి పక్కన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కరణం శివరామకృష్ణ ఏర్పాటు చేసిన నవగణపతులను బేబీనాయన, టీడీపీ నాయకులు తెంటు లక్ష్మనాయుడులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతన వెదజల్లే విధంగా ఉందన్నారు. అయితే బాలగంగాధర్‌తిలక్ ప్రజలను భాగస్వామ్యం చేసే విధంగా తీసుకున్న నిర్ణయం నేడు మరో విధంగా మారిపోయినందుకు ఆవేదన వ్యక్తం చేశారు. నవరాత్రి మహోత్సవాలను శాస్త్రోత్తంగా జరపడం శుభ పరిణామని అన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు శివరామకృష్ణను అభినందించారు.

విజయనగరానికి గురజాడ పేరు పెట్టాలి
బొండపల్లి, సెప్టెంబర్ 21: మహాకవి గురజాడ మన దేశానికి చేసిన సేవలకు గుర్తుగా విజయనగరానికి గురజాడ పేరు పెట్టాలని ప్రిన్సిపాల్ దూషి శ్రీధర్ కోరారు. శుక్రవారం మండలంలోని దేవుపల్లి గ్రామంలో గల సద్గురు దేవానంద మెమోరియల్ స్కూల్‌లో మహాకవి గురజాడ వేంకట అప్పారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురజాడ చిత్రపటానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాంఘిక దురాచారాలపై, అదే విధంగా అంటరానితనంపై తన కలంతో ఎంతో గొప్ప పోరాటం చేసిన అభినవ కవితా పితామహుడని కొనియాడారు. అటువంటి గురజాడ మన విజయనగరంలో జన్మించడం మన అదృష్టమని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా గురజాడ సేవలకు గుర్తుగా మన జిల్లాకు గురజాడ పేరు పెట్టాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్ధులు ప్రదర్శించిన కన్యాశుల్కం నాటిక తల్లిదండ్రులను ఆకట్టుకుంది. అంతేకాకుండా చిన్నారులు ప్రదర్శించిన దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అనే నృత్యరూపకం అందరినీ అలరించింది. అనంతరం ఐదవతరగతి విద్యార్ధి కర్రోతు విష్ణువర్ధన గురజాడ అప్పారావు వస్తధ్రారణలో, ఒకటవ తరగతి విద్యార్ధిని చిన్నారి వైద్యరాజు పవిత్రి తెలుగుతల్లి వస్తధ్రారణలో చిన్నారులందరిని మురిపించారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న సురభి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నాటకం
గజపతినగరం,సెప్టెంబర్ 21: గజపతినగరం జాతీయ రహదారి పక్కన ఏర్పాటుచేసిన సురభి నాటక మహోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి జరిగిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర నాటకం అందరిని ఆకట్టుకుంది. సురభి నాటక సంస్ధ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు(బాబ్జీ) పర్యవేక్షణలో ఈ నాటకాన్ని 60మంది కళాకారలు నిర్వహించారు. సినిమా సెట్టింగ్‌లకు ఏమాత్రం తీసుపోకుండా ఈ నాటకాన్ని ప్రదర్శించడంతో ఆకట్టుకుంది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కరణం శివరామకృష్ణ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

భజనామృతం అభివృద్ధికే శిక్షణలు
గజపతినగరం,సెప్టెంబర్ 21: సత్యసాయి సేవా సమితిలో భజనామృతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకే ఈ శిక్షణలు నిర్వహిస్తున్నామని సత్యసాయి సేవా సమితి కన్వీనర్ వెంకటేష్ అన్నారు. శుక్రవారం స్ధానిక భగవాన్ సత్యసాయి గీతామందిరంలో ఎంపిక చేసిన భక్తులకు భజనలపై శిక్షణ కార్యక్రమం లోచర్ల మనోహర్, సిరిశెట్టి నారాయణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 23వతేదిన విజయనగరంలో జిల్లాస్ధాయిలో భజనపోటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. అందుకోసం గజపతినగరం నియోజకవర్గంలోని ఎంపిక చేసిన భక్తులకు భజనలపై శిక్షణలు ఇచ్చి పంపిస్తున్నామని అన్నారు. మొత్తం ఇరవైమందికి భజనలో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.