విజయనగరం

ప్రత్యేక హోదా కోసం ఓ దివ్యాంగుడు సాహసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొండపల్లి, సెప్టెంబర్ 21: ప్రత్యేక హోదా కోరుతూ ఓ దివ్యాంగుడు జాతీయ జెండాను చేతబట్టి ట్రై సైకిల్‌పై ఇచ్చాపురం నుండి అమరావతి వరకు సాహసయాత్రకు శ్రీకారం చుట్టాడు. శ్రీకాకుళం జిల్లా బూరగాం గ్రామానికి చెందిన దివ్యాంగుడు నెయ్యిల ప్రసాద్ ప్రత్యేక హోదా సాధన కోసం యాత్ర చేసే ఆలోచన వచ్చింది. ఆలోచనను ఆచరణలో పెట్టాని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో తనకున్న ట్రైసైకిల్‌ను వాహనం చేసుకుని గుండె నిండా ఉప్పొంగిన జాతీయ భావంతో త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి ప్రత్యేక హోదా సాధనే థ్యేయంగా ప్రసాద్ యాత్రకు బయలుదేరాడు. శుక్రవారం బొండపల్లి మండల సముదాయం వద్ద గల జాతీయ రహదారిపైన ట్రైసైకిల్‌పై వస్తున్న ప్రసాద్‌కు విలేఖరుల బృందం పలకరించింది. అనంతరం ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 18 జిల్లాల్లో గల అన్ని మండలాల్లోను ఈ యాత్ర చేయడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం కరుణించి ఆంధ్రుల కష్టాలను తొలగించే హోదా ఇస్తుందని ఆశిస్తున్నారని తెలిపారు.

దోమల నివారణకు ఫాగింగ్
బొండపల్లి, సెప్టెంబర్ 21: ప్రజా ఆరోగ్య పరిరక్షణలో భాగంగా దోమల నివారణే థ్యేయంగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా శుక్రవారం గ్రామంలో దోమల నివారణకు పాగింగ్ యంత్రం ద్వారా మందును పిచికారీ కార్యక్రమాన్ని మండల ప్రత్యేక అధికారి వెంకటరావు ప్రారంభించారు. 26రోజులు పాటు చేపట్టిన ఈ కార్యక్రమానికి గ్రామాల వారీగా షెడ్యూల్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు దోమల నివారణకు వినియోగించే పొగమంచు మందు కురిపించే కార్యక్రమాన్ని విధిగా పర్యవేక్షించి విజయవంతం చేయాలని కోరారు. గ్రామాలలో మురుగునీరు, మంచినీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని గ్రామాల ప్రజలు అధికారులకు సహకరించి వారి సూచనలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బండారు బాలాజీ ఎంపీడీవొ ఎం.ప్రకాశరావు, ఉప తహశీల్దార్ శ్రీనివాసరావు, వివిధ గ్రామాల కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పందులు పెంపకందార్లపై చర్యలు తీసుకోవాలి
నెల్లిమర్ల, సెప్టెంబర్ 21: నెల్లిమర్ల నగర పంచాయతీలో విజయనగరానికి చెందిన కొంతమంది పందులు పెంపకందార్లు అర్థరాత్రి కాలంలో వదిలిపెడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ టి. జైరామ్ ఎస్సై నారాయణరావుకు శుక్రవారం ఫిర్యాదు అందజేశారు. పందులు స్వైర విహారం వలన నగర పంచాయతీ వాసులు వ్యాధుల భారిన పడుతున్నారని, స్థానికంగా ఉన్న పందులను నివారించామని చెప్పారు. ఇప్పుడు విజయనగరానికి చెందిన పందుల పెంపకదార్లు రాత్రివేళల్లో విడిచిపెడుతున్నారని చెప్పారు. పందులు పెంపకందార్లకు గతంలో హెచ్చరించినప్పటికీ యదావిధిగా పందులను విడిచిపెడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్సైను కోరారు.
వైభవంగా వేంకటేశ్వరుని చక్రస్నానం
నెల్లిమర్ల, సెప్టెంబర్ 21: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీసీతారామస్వామి వారి పుష్కరిణిలో వేంకటేశ్వరస్వామివారి చక్ర స్నానం శుక్రవారం వైభవంగా జరిగింది. ఉదయం సుప్రభాత సేవ, బాలభోగం తరువాత యాగశాలలో పూర్ణాహుతి, విశేష హోమాలను నిర్వహించారు. అనంతరం స్వామివారి సుదర్శన పెరుమాళ్ళను గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్ళి రామపుష్కరిణిలో ఆశీనులను చేశారు. మంగళ వాయిద్యాలతో స్వామివారి సుదర్శన పెరుమాళ్ళకు విశేష అర్చనలు చేపట్టి చక్ర స్నానాన్ని అత్యంత వైభవంగా జరిపించారు. తరువాత ఊరేగింపుగా ఆలయం వెలుపలకి స్వామివారిని తీసుకువెళ్ళి హోమబలిహరణం గావించారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు సాయిరామ్ ఆచార్యులు, కిరణ్, నర్సింహాచార్యులు, పవన్, దేవస్థాన సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.