విజయనగరం

చంద్రన్న బీమా మంజూరు పత్రాలు పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్కవరపుకోట, సెప్టెంబర్ 21: నియోజకవర్గంలో వివిధ కారణాలతో మారణించి వారి వారసులకు ఎమ్మెల్యే లలితకుమారి శుక్రవారం చంద్రన్న బీమా మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. వెలుగు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 34మందికి 65లక్షల 70వేల రూపాయలు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. జామిలో నలుగురికి, కొత్తవలస తొమ్మిది, ఎల్.కోట తొమ్మిది, ఎస్.కోట ఎనిమిది, వేపాడ నలుగురు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మరణించిన వారిని తిరిగి తీసుకురాలేమని, చనిపోయేటపుడు మనిషి తనకుటుంబ ఏమైపోతుందోననే బెంగతో చనిపోతాడని అటువంటి పేద కుటుంబాలను ఆదుకునేందుకు ఈ చంద్రన్న బీమా ఎంతో సహాయకారిగా ఉందని, దీనివలన కుటుంబం పొందే ఆర్థిక భరోసాను చూసి పైనున్న వారి ఆత్మ ఎంతో కొంత శాంతిస్తుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కోళ్ళ రాంప్రసాద్, ఎంపీపీ కొల్లురమణమూర్తి, జడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు, వెలుగు కో- ఆర్డినేటర్ శ్రీగౌరీ, వివిధ మండలాల ఏపీఎంలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.

రామయ్యపాలెంలో వైద్య శిబిరం
జామి, సెప్టెంబర్ 21: రామయ్యపాలెం గ్రామ పంచాయతీలో శుక్రవారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జామి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో సుమారు 150మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో ముగ్గురు రోగులకు వైరల్ జ్వరాలు సోకాయని వివరించారు. వీరిని జామి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రమ్మని, రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం గ్రామాల్లో కురుస్తు వర్షాలు కారణంగా తాగునీటిలో క్లోరినేషన్‌చేయకపోవడం వలన వ్యాధులు సోకుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరు కాచిచల్లార్చిన నీటిని తాగాలని చెప్పారు.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. గ్రామాలలో ఎక్కడా వర్షపునీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని, పారిశుద్ధ్య పనులు నిరంతరం చేపట్టుకోవాలని అన్నారు. ఈకార్యక్రమంలో జామి ఆసుపత్రి వైద్య సిబ్బంది, ఏ ఎన్ ఎంలు, ఆశావర్కర్లు, ఆరోగ్యమిత్రాలు ఉన్నారు.

గాంధీజీ విగ్రహాల పంపిణీకి హాజరుకావాలి
పార్వతీపురం, సెప్టెంబర్ 21: మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని గాంధీ స్మారకనిధి ద్వారా జిల్లాలోని పాఠశాలలకు తొలివిడతగా 400 గాంధీజీ విగ్రహాలను అందించనున్నట్టు గాంధీ స్మారకనిధి జిల్లా కన్వీనర్ డి.పారినాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25వ తేదీన విజయనగరంలోని పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌లో విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, కావలసిన వారు హాజరుకావాలని కోరారు. ఈకార్యక్రమానికి వచ్చే ఉపాధ్యాయులకు ఆరోజున ఆన్ డ్యూటీ ఇవ్వడానికి జిల్లా విద్యాశాఖాధికారి అంగీకరించారని తెలిపారు. ముందుగా తెలియజేసిన వారికి విగ్రహాల తరలింపునకు రవాణా సౌకర్యం కూడా కల్పించనున్నట్టు తెలిపారు. గాంధీజీ విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్టశ్రాసన సభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ ముఖ్యఅతిధిగా హాజరవుతారన్నారు. ఇదిలా ఉండగా ఈనెల 22వ తేదీ శనివారం సాయంత్రం పార్వతీపురం లయన్స్ క్లబ్‌లో గాంధీ స్మారకనిధి సంయుక్తంగా నిర్వహించనున్న మహాత్మాగాంధీకి మహానివాళి సాంస్కృతిక కార్యక్రమానికి హాజరుకావాలని లయన్స్ క్లబ్ అధ్యక్షులు చుక్క భాస్కరరావు, కార్యదర్శి ప్రదీప్‌లు కోరారు.
ఆర్టీసీ కాంప్లెక్సు సమస్యలు నిలయం
పార్వతీపురం, సెప్టెంబర్ 21: పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్సులో సమస్యలు నెలకొంటున్నాయి. ఆర్టీసీ కాంప్లెక్సు ప్రాంగణంలో గల మినీ బస్టేషన్‌లో ఏ మాత్రం వర్షం కురిసినా ప్రయాణికులకు పాట్లు తప్పవని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈబస్టేషన్ నుండి యర్రసామంతవలస, డోకిశీల తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఇక్కడ నుండే బయలు దేరుతాయి. అలాగే ఇదే కాంప్లెక్సు ఆవరణలో ఆర్టీసీ కాంప్లెక్సు ప్రాంగణంలో రోడ్డు గోతుల మయంగా ఉండడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకుని ఆర్టీసీ కాంప్లెక్సు ఆవరణలోని మినీ బస్టేషన్ మరమ్మతులు చేపట్టడంతో పాటు రహదారి మార్గంలోని గోతులను కూడా మరమ్మతులు చేపట్టాలని కోరారు.