విజయనగరం

ఘనంగా వినాయక నవరాత్రి మహోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి(రూరల్), సెప్టెంబర్ 21: మండల పరిధిలో ఉన్నవివిధ గ్రామాల్లో శ్రీవరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈమేరకు మండల పరిధిలో ఉన్న రంగరాయపురం, అలజంగి, పక్కి, చింతాడ, పారాది, మెట్టవలస, తదితర గ్రామాల్లో ఈ ఉత్సవాలను భక్తులు అత్యంతవైభవంగా జరుపుకుంటున్నారు. రంగరాయపురం గ్రామంలో వినాయకునికి సామూహిక హారతి కార్యక్రమాన్ని సమరసత సేవాఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. అనంతరం మండల ధర్మప్రచారక్‌లు దూపం వాసు మాట్లాడుతూ ఇటువంటి ఉత్సవాలను నిర్వహించుకునేటప్పుడు యువత భక్త్భివం, క్రమశిక్షణతో ఉండటమే ప్రధాన లక్ష్యమన్నారు. ధర్మాన్ని ఈ విధంగా రక్షించుకోగలమన్నారు. మనమంతా హిందువులం.. బంధువులం అనే నినాదంతో కలిసిమెలిసి భక్త్భివంతో ఉండాలని భగవంతుని వేడుకోవాలన్నారు. ప్రతీ రోజు వినాయకుని వద్ద కుంకుమపూజలు, సామూహిక హారతి కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయాగ్రామాలకు చెందిన భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా గురజాడ జయంతి వేడుకలు
బొబ్బిలి(రూరల్), సెప్టెంబర్ 21: మండల పరిధిలో ఉన్న వివిధ గ్రామాల్లో గురజాడ వెంకట అప్పారావు 156వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈమేరకు నారాయణప్పవలస, కోమటిపల్లి, కలువరాయి, తదితర గ్రామాల్లో జయంతి వేడుకలను నిర్వహించారు. తొలిత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జెసి రాజు మాట్లాడుతూ తెలుగుజాతికి, భాషకు వెలుగుదారి చూపిన మహాకవి గురజాడ అప్పారావు అన్నారు. తన సాహిత్యంతో సామాజిక చైతన్యానికి తెరలేపిన రచయిత అని, కన్యాశుల్కంతో సాంఘిక దురాచారాలపైనే దండెత్తారన్నారు. అటువంటి మహనీయులను ఎప్పటికీ మరువరాదన్నారు. దేశమంటే మట్టికాదాయ్! అనే గేయం దేశభక్తిగేయంగా ప్రసిద్ధిగాంచిందన్నారు. గొప్ప ప్రజ్ఞాశీలిగా, ఎన్నో ఉన్నత ఆదర్శాలతో మహిళా చైతన్యానికి మార్గదర్శిగా నేటి సమాజానికి ఆదర్శనీయునిగా పేరుగాంచిన గురజాడ విజయనగరం వాసి కావడం ప్రతీ ఒక్కరికీ గర్వకారణమన్నారు. ఆయన్ను ప్రతీ ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నారాయణరాజు, విద్యార్థులు పాల్గొన్నారు.

నిరుపేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి
బొబ్బిలి(రూరల్), సెప్టెంబర్ 21: నిరుపేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని టీడీపీ సీనియర్ నాయకులు, మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఆర్‌విఎస్‌కెకె రంగారావు(బేబీనాయన) అన్నారు. మండలం పారాది గ్రామానికి చెందిన యాళ్ల సతీష్‌కుమార్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద లక్షా 4వేల 200 రూపాయలను, కింతలవానిపేట గ్రామానికి చెందిన ఆర్ జగ్గారావుకు 26,650 రూపాయల చెక్కును శుక్రవారం రాజ్‌దర్భార్‌లో అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుపేదల రోగుల వైద్యం కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతుందన్నారు. అదేవిధంగా వారి కుటుంబాలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషి చేయడం అభినందనీయమన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన నాయకులు ఆల్తి రమణ, ఈశ్వరరావు, గోపి, తదితరులు పాల్గొన్నారు.

వీఆర్‌ఎస్ కాలువకు గండి.. నీట మునిగిన వరి పంటలు
బొబ్బిలి(రూరల్), సెప్టెంబర్ 21: రెండు రోజులుగా కురిసిన వర్షాలకు వెంగళరాయసాగర్ 19ఎల్ కాలువకు గండి పడింది. శుక్రవారం కాలువకు గండిపడటంతో వరిపంటలు నీటిలో మునిగాయి. మండలం దిబ్బగుడివలస గ్రామ సమీపంలో ఉన్న ఈ కాలువకు గండి పడటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరిపంటలు నీట మునగడంతో నష్టం వాటిల్లే అవకాశం ఉందని గ్రామానికి చెందిన రైతులు వాపోతున్నారు. గండిపడిన కాలువను అధికారులు పర్యవేక్షించకపోవడంతో మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు అధికంగా కురిస్తే పూర్తిస్థాయిలో దిగువప్రాంతాల్లో ఉన్న పంట పొలాలు నీట మునిగే అవకాశం ఉందని పలువురు రైతులు అంటున్నారు. తక్షణమే గండిని పూడ్చేందుకు ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. లేనిపక్షంలో నష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి గండిపడిన కాలువను పూడ్చేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈవిషయంపై వీఆర్‌ఎస్ ఏఇ విద్యాసాగర్‌ను సంప్రదించగా గతంలో రైతులు నీటి కోసం తవ్వకాలు చేపట్టడంతో గండిపడిందని, అయితే వాటిని పరిశీలించి పూడ్చేందుకు చర్యలు చేపడతామన్నారు.

ఉచిత వైద్యశిబిరానికి విశేష స్పందన
మక్కువ, సెప్టెంబర్ 21: మండలంలో నిర్వహించిన ఉచిత వైద్యశిబిరానికి విశేష స్పందన లభించిందని వైద్యాధికారిణి నానీవిశ్వనాధ్ అన్నారు. ఈమేరకు మండలంలోని బంగారువలస గ్రామంలో శుక్రవారం ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి సుమారు 55మంది రోగులు వచ్చి వైద్యతనిఖీలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత సీజన్‌లో వ్యాధులు అధికంగా వ్యాపించే అవకాశం ఉందని, వీటికి దూరంగా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రతతోపాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలన్నారు. గ్రామాల్లో ఎవరికైన జ్వరాలు వస్తే వెంటనే సమీపంలోని పిహెచ్‌సీలలో సంప్రదించాలన్నారు. అలాగే గ్రామాల్లో రోడ్లుపై, కాలువల్లో చెత్తాచెదారాలు వేయకుండా పరిశుభ్రతను పాటించాలన్నారు. వీధులను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆహ్లాదకరంగా ఉండటంతోపాటు దోమలు వృద్ధి చెందవన్నారు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు పంచాయతీ కార్యదర్శుల సహకారంతో బోరుబావులు, మంచినీటి కుళాయిల వద్ద క్లోరినేషన్ చేయించుకోవాలన్నారు. ఈమేరకు రోగులకు వైద్యపరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్‌ఇఓ బి మురళీ, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
ఒడిశా వైపు ఏనుగుల పయనం
* ఊపిరిపీల్చుకుంటున్న అటవీశాఖాధికారులు
* ఏనుగులపై నిఘా పెంచిన అటవీశాఖాధికారులు
కొమరాడ, సెప్టెంబర్ 21: మండలంలో ప్రజలు, అటవీశాఖాధికారులను భయాందోళనలకు గురిచేసిన ఏనుగులు ఎట్టకేలకు ఆంధ్రా సరిహద్దుదాటి ఒడిశా బోర్డర్ వైపు తరలివెళుతుండటంతో ప్రజలు, అటవీశాఖాధికారులు ఊపిరిపీల్చుకుంటున్నారు. మండలంలోని కంబవలస పంచాయతీ పరిధిలోగల పెల్లిగుడ్డిని దాటి ఏనుగులు ఏగువబోతాడపల్లి శుక్రవారం ఏనుగులు పయనించాయి. ఏదీ ఏమైనప్పటికీ ఏనుగులు మరలా ఆంధ్రాకు రాకుండా అటవీశాఖాధికారులు మూడు బృందాలుగా ఏర్పాటై ఒరిస్సా- ఆంధ్రా సరిహద్దుల్లో పహారా కాస్తున్నారు. ఏనుగుల అడుగుజాడల బట్టి ఆయా ప్రాంతాల్లో మందుగుండు, రబ్బర్ ట్యూబ్‌లను కాల్చుతున్నారు. ఆంధ్రా సరిహద్దుల్లో నీటి వనరులు, పంటలు అధికంగా ఉండటంతో మరలా ఏనుగులు దిగువకు వచ్చే అవకాశాలున్నాయని నిఘాను మరింత పటిష్టం చేస్తున్నారు. ఏనుగుల సంచారంపై ఆర్డీఓ సుదర్శనదొర ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు.

రహదారిపై నీటి ప్రవాహంతో వాహనచోదకులు ఇబ్బందులు
గరుగుబిల్లి, సెప్టెంబర్ 21: పార్వతీపురం- శ్రీకాకుళం ఆర్‌అండ్‌బి ప్రధాన రహదారి పరిధిలోని ఉల్లిభద్ర గ్రామసమీపంలో రహదారిపై నుంచి నీరు ప్రవహిస్తోంది. అదేవిధంగా ఏ మాత్రం వర్షం కురిసిన రహదారిపై పలు చోట్ల వర్షపునీరు నిల్వ ఉంటుంది. అయినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో వాహనచోదకులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏమాత్రం వర్షం కురిసిన తోటపల్లి కుడి ప్రధాన కాలువ సమీపంలోనీరు రహదారిపైనుంచే ప్రవహిస్తుంది. రహదారిపై నీరు ప్రవహించకుండా పక్కా కాలువలను నిర్మించాల్సి ఉంది. అయినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో రహదారి గోతులమయంగా తయారైంది. ఈ విషయాన్ని పలు పర్యాయాలు సంబంధిత అధికారులకు తెలియజేసిన పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి రహదారిపై నీరు ప్రవహించకుండా తగు చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
పలు గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగు చర్యలు
గరుగుబిల్లి, సెప్టెంబర్ 21: మండల పరిధిలోని పలు గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు అధికారులు తగు చర్యలు చేపడుతున్నారు. ఈమేరకు మండల పరిధిలోని ఉల్లిభద్ర జంక్షన్ సమీపంలో పేరుకుపోయిన చెత్తాచెదారాలను తొలగించాలని సంబంధిత దుకాణాల యజమానులకు ఎంపీడీఓ జి పార్వతి, ఇఓపీఆర్‌డీ ఎంవి గోపాలకృష్ణలు తెలియజేశారు. షాపుల ముందు చెత్తబుట్టలను ఏర్పాటు చేసుకుని వాటిలో చెత్తలు వేసుకోవాలన్నారు. ప్రస్తుత సీజన్‌లో వ్యాధులు సంభవించకుండా ఉండేలా పూర్తిస్థాయిలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు తగు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈమేరకు కాలువల్లో పూడికలను తొలగించామన్నారు.