విజయనగరం

25న 500 గాంధీ విగ్రహాల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, సెప్టెంబర్ 23 : జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని జిల్లాలో రూ.28 లక్షల వ్యయంతో 500 గాంధీ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఎపి గాంధీ స్మారక నిధి జిల్లా కన్వీనర్ పారినాయుడు తెలిపారు. ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇదొక బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సుగా మిగిలిపోతుందన్నారు. ఈనెల 25న జిల్లాలో అన్ని పోలీసు స్టేషన్లు, గ్రంథాలయాలు, పాఠశాలల్లో గాంధీ విగ్రహాలను నెలకొల్పుతామన్నారు. ప్రకృతి వ్యవసాయం-మన జీవన విధానం అన్న సందేశాన్ని జాతిపిత ఎక్కువగా వివరించేవారని, ఆ భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా అదే రోజున యునైటెడ్ నేషన్స్‌లో ప్రకృతి వ్యవసాయంపై ఉపన్యసిస్తారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో భూగోళ ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయన్నారు. రాబోయే 30 ఏళ్లలో కార్భన్‌డయాక్సైడ్ నిల్వలు పెరిగిపోయి మనిషి మనుగడ కష్టతరమయ్యే ప్రమాదం ఉందన్నారు. అందువల్లనే ప్రజల్లో ఈ భావనను తీసుకెళ్తామన్నారు. ఇదిలాఉండగా గాంధీ విజయనగరం వచ్చినపుడు అశోక్‌బంగ్లాలో బస చేశారని, అందువల్ల 25న అశోక్ బంగ్లా నుంచి ఎస్పీ కార్యాలయం వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. అంతేగాకుండా వంద మంది విద్యార్థులు గాంధీ వేషధారణలో ర్యాలీలో పాల్గొంటారని ఆయన వివరించారు. కార్యక్రమంలో ఎపి గాంధీ స్మారకనిధి జిల్లా అధ్యక్షుడు రొంగలి పోతన్న, దవళ సర్వేశ్వరరావు, కెఆర్‌డి ప్రసాదరావు, బసవమూర్తి, టి.మహేశ్వరరావు, ఎం.కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధికి కేరాఫ్ టీడీపీ
లక్కవరపుకోట, సెప్టెంబర్ 23: రాష్ట్రంలో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా టీడీపీ ప్రభుత్వం గుర్తించిందని ఎమ్మెల్యే లలితకుమారి అన్నారు. గడచిన నాలుగేళ్ళల్లో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు దీనికి నిదర్శనమని అన్నారు. ఆదివారం గొల్జాం గ్రామంలో 15లక్షల వ్యయంతో నూతనంగా నిర్మంచదలచిన పంచాయతీ భవనానికి శంఖుస్థాపన చేశారు. ఈ సంద్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో నూతన పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు టీడీపీ ప్రభుత్వంతోనే ఎక్కువ శాతం జరిగాయని ఇంతకుముందున్న ప్రభుత్వాలు తూతూ మంత్రంగా నాణ్యతలేని పనులు చేపట్టి అవినీతికి పాల్పడ్డారని వారు వేసిన రోడ్లు కనిపించకుండా పోయాయని, టీడీపీ ప్రభుత్వం నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ కులం, మతం, పార్టీలకు అతీతంగా అన్ని ప్రాంతాలను అభివృద్ది చేసేందుకు కృషి చేస్తుందని అన్నారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు, పింఛన్లు, ఇతర పథకాలు అన్నీ అర్హులకు అందే విధంగా చర్యలు తీసుకుంటుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని అందరు గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ ఎంసీ చైర్మన్ ఏడువాక సులోచన, ఎంపీపీ కొల్లురమణమూర్తి, జడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు, మాజీ సర్పంచ్ తూర్పాటి రాములమ్మ, రమణ, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

సీపీఎస్ రద్దు చేయాలని టీచర్ల నిరసన ప్రదర్శన
విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 23: సిపిఎస్ రద్దు చేయాలని ఎపిటిఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి జెసి రాజు ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో కోట జంక్షన్ వద్ద ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేసేవరకూ పోరాటం ఆగదని చెప్పారు. సిపిఎస్ రద్దు చేయకుండా కమిటీల పేరుతో ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆయన ఆరోపించారు. సిపిఎస్‌పై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ఎపిటిఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎ.సదాశివరాజు అన్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.
సిపిఎస్ అమలు కోసం విడుదల చేసిన జీవోలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి.ఈశ్వరరావుమాట్లాడుతూ సిపిఎస్‌ను రద్దు చేయాలని గత నాలుగేళ్ల నుంచి వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తుంటే ఇప్పుడు కమిటీ వేయడం ప్రభుత్వ సంకుచిత స్వభావానికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎపిటిఎఫ్ నాయకులు బలరాంనాయుడు, వై.వెంకటరావు, పైడిరాజు, చిన్నంనాయుడు, ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు.