విజయనగరం

ఏవోబీలో రెడ్ అలెర్ట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, సెప్టెంబర్ 23: విశాఖ ఏజెన్సీలోని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమలపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో ఏవోబీలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. దీంతో ఏజెన్సీ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు. ఆదివారం మధ్యాహ్నాం 12 గంటల సమయంలో విశాఖ జిల్లా డుంబ్రిగుడలోని లిప్పిటిపుట్టు గ్రామ సమీపంలో జరిగిన ఈ సంఘటనతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఎఒబిలో మావోలు తమ ఉనికిని కోల్పోయారని భావించిన పోలీసులకు ఇది సవాల్‌గా మారింది. చాపకింద నీరులా విస్తరిస్తున్న మావోలు ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో అడపా దడపా అలజడి సృష్టించినప్పటికీ ఈ స్థాయిలో ఘాతుకానికి పాల్పడతారని ఎవరు ఊహించలేదు. బాక్సైట్ తవ్వకాలను నిలిపివేయాలని గతంలో మావోలు హెచ్చరించారు. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తామని స్పష్టం చేశారు. ఆ తరువాత అరకు ప్రాంతాన్ని ఆయన దత్తతకు తీసుకొని ఆ ప్రాంతానికి రహదారి సౌకర్యాలను మెరుగుపరిచారు. మరోపక్క బాక్సైట్ తవ్వకాలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిం
చారు. దీంతో పలుమార్లు మావోలు ఎమ్మెల్యే కిడారిని హెచ్చరించినట్టు సమాచారం.
ఇదిలా ఉండగా జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలలో పోలీసుల గస్తీని ముమ్మరం చేశారు. సరిహద్దు మండలాలుగా ఉన్న మక్కువ, పాచిపెంట, కొమరాడ, కురుపాం ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. జిల్లాలో రెండేళ్ల క్రితం కొమరాడ మండలంలో హిరాఖండ్ రైలు ప్రమాద ఘటనలో మావోల పాత్ర ఉందని భావించినప్పటికీ, సంఘటన జరిగిన ఏడాదిన్నర తరువాత కేంద్ర దర్యాప్తు సంస్థ తన నివేదికలో మావోల ప్రమేయం లేదని తేల్చి చెప్పింది. ఇక సాలూరుకు సమీపంలో సుంకి వద్ద బిఎస్‌ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోలు పేల్చివేశారు. ఆ తరువాత జిల్లాలో ఎలాంటి సంఘటనలు జరిగిన దాఖలాలు లేవు. దీంతో పోలీసులు కూడా జిల్లాలో మావోల కార్యకలాపాలు ఏం కొనసాగడం లేదని స్పష్టం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మావోలు తిరిగి ప్రజాప్రతినిధులపై గురి పెట్టడం అందరినీ కలవరపెడుతొంది. ఇప్పటికే సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మావోలు ఇటువంటి సంఘటనకు పాల్పడటంతో ఏజెన్సీలో అడుగుపెట్టాలంటేనే ప్రజాప్రతినిధులు భయపడుతున్నారు. మరోపక్క జిల్లాలో కొమరాడ మండలం కోటిపాం వద్ద పవర్‌ప్లాంట్‌కు కూడా మావోలు గతంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమయంలో కొందరిని హెచ్చరించినట్టు సమాచారం. దీంతో మావోల నుంచి హెచ్చరికలు వచ్చిన నాయకుల్లో గుబులు నెలకొంది. ఏది ఏమైనప్పటికీ మావోల సంఘటనతో ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

కూంబింగ్‌కు ప్రత్యేక బృందాలు
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్‌కు ప్రత్యేక బృందాలను పంపినట్టు ఎస్పీ పాలరాజు తెలిపారు. ఈ బృందాలు మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో సంచరిస్తూ అనుమానితులను విచారిస్తారని చెప్పారు. ప్రజా ప్రతినిధులు మారుమూల గ్రామాల్లో సంచరించవద్దని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు.