విజయనగరం

సవాలు విసిరిన మావోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: విశాఖ మన్యంలో ఆదివారం జరిగిన ఘటన సామాన్యమైనది కాదు. ఒక ఎమ్మెల్యేని, ఒక మాజీ ఎమ్మెల్యేని అత్యంత దారుణంగా హతమార్చి మావోయిస్ట్‌లు పోలీసులకు సవాలు విసిరారు. ముఖ్యమంత్రి, డీజీపీ రాష్ట్రంలో లేని సమయంలో మావోయిస్ట్‌లు ఈ ఘాతుకానికి దిగారు. కొన్నాళ్లుగా మావోయిస్ట్‌లు వౌనంగా ఉంటే, ఉనికి కోల్పోయారని అంతా భావించారు. ఏఓబీలో తుపాకి కాల్పుల మోతలు లేవు. బూట్ల చప్పుళ్లు వినిపించలేదు. మన్యం ప్రశాంతమనుకున్న పరిస్థితుల్లో మావోయిస్ట్‌ల చేసిన ఘాతుక చర్య ప్రభుత్వ యంత్రాంగాన్ని నివ్వెరపోయేలా చేసింది. ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను కాపాడలేకపోయామన్న బాధ పోలీసు ఉన్నతాధికారుల్లో స్పష్టంగా కనిపించింది. అంతేకాదు, రేపు ప్రభుత్వానికి ఏం సమాధానం చెప్పాలన్న ప్రశ్న వీరిని వేధిస్తోంది. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతో మంత్రులంతా అప్రమత్తమై పరిస్థితిని సమీక్షించారు. ఒక దశలో డీఐజి, ఎస్పీలతో మాట్లాడించాల్సిందిగా సీఎం కలెక్టర్‌కు ఆదేశించడంతో ఆయన హుటా హుటిన ఎస్పీ క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లి ఈ ముగ్గురూ కలిసి న్యూయార్క్‌లో ఉన్న చంద్రబాబుతో మాట్లాడారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేని ప్రభుత్వమన్న తలవంపులు రాకముందే, తదుపరి కార్యక్రమాలు చేపట్టాలని సీఎం అధికారులను, మంత్రులను ఆదేశించారు. కలెక్టర్ ప్రవీణ్ కుమార్‌తో ముఖ్యమంత్రి పదేపదే మాట్లాడుతూ తగిన సూచనలు ఇచ్చారు. సోమా, సర్వేశ్వరరావు మృతదేహాలకు ప్రభుత్వలాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించమని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

ఉనికి చాటుకోవడానికా?
మావోయిస్ట్‌లు ఉనికి చాటుకోడానికే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అధికారులు, ప్రజా ప్రతినిధులు అంటున్నారు. ఉనికి చాటుకోవలసి వస్తే, విధ్వంసాలకు పాల్పడతారు. ఇలా ఎమ్మెల్యేలను చంపే పరిస్థితి లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు అప్పటి స్పీకర్ శ్రీపాదరావును, హోం మంత్రిగా ఉన్న ఎలిమినేటి మాధవరెడ్డిని హతమార్చి సంచలనం సృష్టించారు. ఆ తరువాత కొంతమంది ఎమ్మెల్యేలను ప్రజా కోర్టులో శిక్షించారు. కానీ ఏఓబీలో మాత్రం ఇంత పెద్ద ఘటన ఎప్పుడూ చోటు చేసుకోలేదు. ఈ ఘటనకు పాల్పడిన మావోలను పట్టుకోడం కన్నా, జరిగిన నష్టాన్ని ఏవిధంగా పూడ్చుకోవాలన్నది పోలీసు అధికారుల ముందున్న ప్రశ్న. పటిష్ఠమైన ప్రణాళికతో వచ్చిన మావోయిస్ట్‌లు పని పూర్తి చేసుకుని తమ తమ స్థావరాలకు వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నారు. పైగా వీరికి గ్రామస్తుల సహకారం కూడా ఉండడం వలన మావోయిస్ట్‌లను అంత సుళువుగా పట్టుకునే అవకాశం ఉండకపోవచ్చు.

మళ్లీ ఉద్రిక్త వాతావరణమే!
గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న విశాఖ మన్యంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థులు చోటు చేసుకోనున్నాయి. మావోయిస్ట్‌ల ఏరివేతకు ఇప్పటికే సీఆర్‌పీఎఫ్, గ్రేహౌండ్స్ బలగాలను అక్కడికి తరలించారు. దీంతో మళ్లీ గిరిజనులకు పోలీసులు, మావోయిస్ట్‌ల నుంచి వేధింపులు తప్పకపోవచ్చు.

భీతిల్లిన పర్యాటకులు
ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్ట్‌లు హతమార్చడానికి కారణం పోలీసుల వైఫల్యమేనంటూ వీరిద్దరి అభిమానులు అరుకులో ఆదివారం ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. కనిపించిన పోలీసులపై దాడులు చేశారు. పోలీస్ స్టేషన్‌కు నిప్పంటించారు. రోడ్లమీదకు వచ్చి నానా గందరగోళం సృష్టించారు. ఈ సమయంలో అరుకులో సుమారు 2000 మంది వరకూ పర్యాటకులు ఉన్నారు. వీరంతా అరుకు అందాలను తిలకిస్తున్నారు. ఒక్కసారిగా అరుకులో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడంతో వారంతా భీతిల్లిపోయారు. సురక్షిత ప్రదేశాలకు పరుగులు తీశారు. కొంతమంది హోటల్ గదుల్లో తలదాచుకున్నారు. సాయంత్రానికి పరిస్థితి సద్దుమణగడంతో వీరంతా ఊపిరి పీల్చుకున్నారు.