విజయనగరం

జిల్లాస్ధాయి భజనామృతం పోటీల్లో గజపతినగరం ప్రతిభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం,సెప్టెంబర్ 24: జిల్లాస్ధాయి భజన బృందం పోటీలలో గజపతినగరం సత్యసాయి సేవా సమితి భజనామృతానికి ద్వితీయస్ధానం లభించింది. ఈ పోటీలలో పది జోన్లకు సంబంధించిన బృందాలు పాల్గొన్నాయి. సత్యసాయి సేవా సమితి ప్రాంతీయ సమన్వయకర్త సునీల్ కుమార్ రథో పర్యవేక్షణలో భజనామృతం పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో కొత్తవలస బృందానికి ప్రధమ బహుమతి లభించగా గజపతినగరం బృందానికి ద్వితీయ బహుమతి సాధించారు. ఈ మేరకు బహుమతులను సత్యసాయి సేవా సమితి జిల్లాశాఖ అధ్యక్షుడు సిడిరామ్మోహనరావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భజన కార్యక్రమంలో మరింత మెరుగు పరచాలన్న ధ్యేయంతో ఈపోటీలు నిర్వహించామని చెప్పారు. ఒక్కో బృందంలో 20మంది సభ్యులు ఉంటారని తెలిపారు. గజపతినగరం బృందానికి కన్వీనరుగా సూరిశెట్టి నారాయణప్పడు, ఆర్గనైజర్‌గా ఎల్.వి.మనోహర్ వ్యవహరిస్తున్నారు. కార్యక్రమంలో సత్యసాయి సేవాసమితి ఆధ్యాత్మిక సంఘం జిల్లా నాయకులు మానాపురం సత్యారావు, గజపతినగరం కన్వీనర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
సారా లేని గ్రామాలు
పల్లె ప్రగతికి సోపానాలు
గజపతినగరం,సెప్టెంబర్ 24: సారాయిలేని గ్రామాలు పల్లె ప్రగతికి సోపానాలని గజపతినగరం ప్రొహిబిషన్ సిఐ రాజశేఖర్‌నాయుడు అన్నారు. సోమవారం ఎక్సైజ్ పరిధిలో గల జయతి గ్రామ పంచాయతీ శివారు బిరసాడవలస గ్రామంలో నాటుసారావలన కలుగు దుష్పలితాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారా తాగడం వలన అధోగతి పాలవుతారని, మానితే గ్రామపురోభివృద్ధికి తోడ్పడతారని అన్నారు. నాటుసారా తాగినా, రవాణా చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుకుండా మహిళలు, యువతీయువకులు గ్రామాభివృద్దిలో బాగస్వామ్యం కావాలని సూచించారు. అనంతరం సారాయి నిరోధానికి కట్టుబడి ఉంటామని ప్రజలచేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సబ్ ఇన్స్‌పెక్టర్లు జి.మాన్యాలు, జి.గోవిందరాజు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ-పంట నమోదు త్వరితగతిన పూర్తి చేయాలి
గజపతినగరం,సెప్టెంబర్ 24: ఈ-పంట ఆన్‌లైన్ నమోదు కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని స్ధానిక తహశీల్ధార్ బి.శేషగిరిరావు ఆదేశించారు. సోమవారం తహశీల్ధార్ కార్యాలయంలో గ్రామ రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో వ్యవసాయశాఖకు సంబంధించిన ఆన్‌లైన్ కార్యక్రమం పూర్తయిందని, అయితే ఉద్యానవనశాఖకు సంబంధించి ఈ-పంట నమోదు కార్యక్రమం వెనకబడి ఉన్నారని తెలిపారు. ఉద్యానవనశాఖాధికారును సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని అన్నారు. అదేవిధంగా ఓటర్ల నమోదుప్రక్రియ సంబందించిన దరఖాస్తులను ఎప్పటికపుడు పరిశీలించి నమోదు చేసుకోవాలని చెప్పారు. భూ సంబంధిత సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.కార్యక్రమంలో ఉపతహశీల్ధార్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.