విజయనగరం

గ్రామాల్లో అభివృద్ధి పనులు జరిగేదెప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి(రూరల్), సెప్టెంబర్ 24: గ్రామాల్లో అభివృద్ధి పనులు కుంటుపడుతుండటంతో వివిధ గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు రోగాల భారిన పడుతుంటే మరోప్రక్క అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారే తప్పకనీస చర్యలు చేపట్టడం లేదు. ఈమేరకు మండల పరిధిలో ఉన్న కాశిందొరవలస, నారాయణప్పవలస, నారసింహునిపేట, పిరిడి, రాజుపేట, పెంట, కారాడ, తదితర గ్రామాల్లో ప్రజలు వివిధ సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నారు. కాశిందొరవలస పంచాయతీలో కాలువలను పూర్తిస్థాయిలో నిర్మించకపోవడంతో చెత్తాచెదారాలు పేరుకుపోయి దుర్వాసన విరజిమ్ముతుందని చెబుతున్నారు. అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా భోజరాజపురం, నారాయణప్పవలస, కొత్తపెంట, తదితర పాఠశాలలో మరుగుదొడ్లులో చెత్తాచెదారాలు పేరుకుపోతున్న వాటిని పట్టించుకునే నాధుడే కరువయ్యారని విద్యార్థులు వాపోతున్నారు. దీంతో అత్యవసర పరిస్థితులలో మలమూత్ర విసర్జనలకు వెళ్లాలంటే నరకయాతన తప్పడం లేదని చెబుతున్నారు. ప్రధానంగా విద్యార్థినులు, మహిళా ఉపాధ్యాయులు ఈ సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా నారసింహునిపేట గ్రామంలో పశువులను రోడ్లుపైనే కడుతున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, దీంతో అపారిశుద్ధ్యం తాంఢవించడంతో ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి ఆయాగ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నారు.

గ్రామాల్లో అభివృద్ధి పనులను చేపట్టండి
బొబ్బిలి(రూరల్), సెప్టెంబర్ 24:గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన చేపట్టాలని ఎంపీడీఓ జి రామారావు కోరారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో వివిధశాఖల అధికారులతో సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించామని, ప్రభుత్వం అభివృద్ధికి విడుదల చేస్తున్న నిధులతో వివిధ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఎటువంటి సమస్యలున్న తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రతీ ఒక్కరూ గ్రామాలను పర్యవేక్షించాలని లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. మంచినీటి బోర్లు, రక్షితమంచినీటి పథకాల వద్ద అపారిశుద్ధ్యం తాంఢవించకుండా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కాలువల్లో పేరుకుపోయిన పూడికలను ఎప్పటికప్పుడు తొలగించడంతోపాటు రోడ్లును పరిశుభ్రంగా ఉంచాలన్నారు. గ్రామ కార్యదర్శులు కూడా విదులను సక్రమంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి ఏపీఓ కేశవరావు, ఏపీఎం ఈశ్వరరావు, ఐసీడీఎస్ పీఓ ఉమాభారతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మహిళలకు రక్షణ కల్పించాలి
బొబ్బిలి(రూరల్), సెప్టెంబర్ 24: రోజురోజుకు మహిళలు దాడులు పెరుగుతుండటంతో భయాందోళనలకు గురవుతున్నారని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, నారాయణప్పవలస పాఠశాల ప్రధానోపాధ్యాయులు జెసి రాజు అన్నారు. బాలికల దినోత్సవం సందర్భంగా పాఠశాలలో సోమవారం మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నాగరికత పెరుగుతున్న నేటి సమాజంలో బాలికలు అన్నింటా సమానమే అంటూ వారి పట్ల వివక్షత చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించి ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా బాలికలకు విలువలతో కూడిన విద్యను అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. బాలికలు చక్కగా విద్యను అభ్యసించి భవిష్యత్‌లో సమాజానికి ఉపయోగపడేవిధంగా కృషి చేయవల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవణమ్మ, నాగరాజు, మహేష్, సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

విలువలతో కూడిన విద్యను అందించాలి
బొబ్బిలి(రూరల్), సెప్టెంబర్ 24: విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులంతా కృషి చేయాలని మండల విద్యాశాఖాధికారి సిహెచ్ లక్ష్మణరావు కోరారు. ఈమేరకు సోమవారం మండల రిసోర్స్‌పర్సన్ భవనంలో ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలకు విధిగా ఉపాధ్యాయులు హాజరై నాణ్యతతో కూడిన విద్యను అందించాలన్నారు. ఎవరైన విధులకు డుమ్మా కొడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో వౌళిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మరుగుదొడ్లు, మంచినీరు, తదితర వాటిని పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా అమలుచేయాలన్నారు. నిర్వాహకులు గ్యాస్ స్టవ్‌లను వినియోగించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌పీలు లక్ష్మునాయుడు, అరుణ్‌కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వలంటీర్లు సేవాభావంతో పనిచేయాలి
తెర్లాం, సెప్టెంబర్ 24: ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు సేవాభావంతో పనిచేయాలని శ్రీవెంకటేశ్వర జూనియర్ కళాశాల కరస్పాండెంట్ మంగరత్నం కోరారు. స్థానిక శ్రీవెంకటేశ్వర జూనియర్ కళాశాలలో సోమవారం ఎన్‌ఎస్‌ఎస్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్‌ఎస్‌ఎస్ ఆవిర్భవించి సుమారు 50 సంవత్సరాలు కావస్తుందన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు సేవాభావంతో పనిచేసి ప్రజలకు అన్నిరకాల అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈమేరకు పారిశుద్ధ్యం, వైద్యారోగ్యం, మరుగుదొడ్లు నిర్వహణ, రక్షిత మంచినీటి పథకాల పనితీరుపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం ఎంఇఓ జగన్నాథం మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే సేవాభావాన్ని అలవర్చుకోవాలని, మున్ముందు విశేష సేవలందించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రొగ్రాం ఆఫీసర్ తెంటు రామారావు, ప్రిన్సిపల్ జి రామకృష్ణనాయుడుతోపాటు కళాశాల అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు.
చంద్రన్న పెళ్లికానుకకు
అర్హులు దరఖాస్తులు చేసుకోవాలి
తెర్లాం, సెప్టెంబర్ 24: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రన్న పెళ్లికానుకకు అర్హులైన వారు దరఖాస్తులు అందించాలని వెలుగు ఏపీఎం బోడెల చిన్నారావు కోరారు. స్థానిక మండల పరిషత్ సమావేశ భవనంలో సోమవారం పంచాయతీ కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో చంద్రన్న పెళ్లికానుక కోసం దరఖాస్తులు చేసుకున్నారని, కొన్ని అనివార్య కారణాల వలన తిరస్కరించబడ్డాయని, వాటిని మరలా పెట్టుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించిందన్నారు. దీనిపై గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఇఓపీఆర్‌డీ సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం విజయవంతానికి ప్రతీ పంచాయతీ కార్యదర్శి పారదర్శకంగా అర్హులను ఎంపిక చేయాలన్నారు. ఎంపికలో ఎటువంటి లోపాలున్న సంబంధిత పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.