విజయనగరం

కేంద్రం సాయం కోసం కృషి చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురుపాం, అక్టోబర్ 14: గిరిజన ప్రాంతంలోని తుఫాన్ బాధితులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా సాయం అందించేందుకు కృషి చేస్తామని బిజెపీ జిల్లా అధ్యక్షుడు పెద్దింటి జగన్మోహనరావు అన్నారు. ఆదివారం పూతికవలస, పాతకురుపాం, సీతంపేట గ్రామాల్లో తుఫాన్‌కు నష్టపోయిన పంటలు, దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం నుంచి తుఫాన్ నిదులు వచ్చేలా కృషి చేస్తామన్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌యోజన కింద దెబ్బతిన్న ఇళ్లకు పక్కా ఇళ్లు మంజూరయ్యేలా కృషి చేస్తామన్నారు.
హెక్టార్‌కు 60వేల రూపాయలు మంజూరుచేయాలని రైతులు కోరుతున్నారని, దెబ్బతిన్న ఒక్కొక్క ఇంటికి 2.60లక్షలు మంజూరుచేసేలా కృషి చేస్తామన్నారు. ఈయన వెంట బిజెపీ అరకుపార్లమెంట్ ఇన్‌ఛార్జి డి రామ్మోహనరావు, కురుపాం నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎన్ జయరాజు, నాయకులు ధూళికేశ్వరరావు, వైకుంఠరావు, తదితరులు పాల్గొన్నారు.

పంటలకు నష్టపరిహారం అందేలా ప్రయత్నిస్తాం

కురుపాం, అక్టోబర్ 14: తుఫాన్ సమయంలో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందించేలా ప్రయత్నాలు ముమ్మరం చేశామని వ్యవసాయశాఖ జెడీ లీలావతి తెలిపారు. ఆదివారం మండలంలోని పూతికవలస, సీతంపేట గ్రామాల్లో నష్టం ఏర్పడిన పంటలను పరిశీలించారు. అరటిపంట పూర్తిగా ధ్వంసమైందని, దీనికి సంబంధించిన నష్టపరిహారం అందేలా చూస్తామన్నారు. పంట నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనావేసి పక్కాగా జాబితాలు రూపొందించి ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు. దీని కోసం కిందిస్థాయి సిబ్బందిని పరిశీలించాలని కోరామన్నారు. రైతులకు పూర్తిన్యాయం చేకూర్చేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తామన్నారు. పంటదశకు చేరే పరిస్థితులో తుఫాన్ నష్టం తీవ్రంగా ఉండటం దురదృష్టకరమన్నారు. ఈమె వెంట వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

సూర్యపీఠంలో అమ్మవారికి పూజలు

పార్వతీపురం, అక్టోబర్ 14: స్థానిక శ్రీసూర్యపీఠంలో ఆదివారం సౌరదీక్షలో భాగంగా నవదుర్గామూల మంత్రహోమం,దేవీ మహాత్మ్వహవన పూజాధికాలు పీఠం నిర్వాహకులు బ్రహ్మశ్రీ వేమకోటి నరహరిశాస్ర్తీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ చక్ర సహిత పంచాయతన దేవతలకు క్షీరాభిషేకం చేశారు.శారీరక, మానసిక, ఆధ్యాత్మిక విషయాల్లో ఉన్నతి,పవిత్రలు పెంపొందించడానికి ప్రకృతిని ప్రకృతిని జగన్మాతగా భావిస్తూ చేసే ఆరాధనలు ఒక్క హిందూ సనాతన ధర్మంలోవిరాజిల్లుతున్నాయని నరహరిశాస్ర్తీ తెలిపారు. కార్యక్రమంలో రుత్వికులు వి.వివేకానంద, వి.తేజ, వి. ఆదిత్య, టి.రామకృష్ణశర్మలు వైదిక సహకారం అందించారు.