విజయనగరం

ప్రజాసంకల్పయాత్రను విజయవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బలిజిపేట, అక్టోబర్ 14: వైఎస్ జగన్మోహనరెడ్డి చేపడుతున్న ప్రజాసంకల్పయాత్రను విజయవంతం చేయాలని వైసీపీ పార్వతీపురం నియోజకవర్గం సమన్వయకర్త అలజంగి జోగారావు అన్నారు. ఆదివారం పెదపెంకి గ్రామంలో కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకే వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రజా సంకల్పయాత్ర చేపడుతున్నారు. భవిష్యత్‌లో ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత వాటిని ఎలా పరిష్కరించాలో యోచిస్తున్నారన్నారు. నవరత్నాల పథకాలతో ప్రజలకు ఎలాంటి లబ్ధిచేకూరుతుందో జగన్మోహనరెడ్డి వివరిస్తున్నారన్నారు. త్వరలో పార్వతీపురం నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్ర చేపట్టనున్నారని, ఈమేరకు జగన్మోహనరెడ్డికి స్వాగతం పలికేందుకు ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను, కష్టాలను తెలుసుకునేందుకు వస్తున్న జగన్‌ను సాదారణంగా ఆహ్వానించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఈమేరకు కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులు సన్నద్ధం కావాలన్నారు. అలాగే పార్వతీపురం నియోజకవర్గంలో తిత్లీ తుఫాన్ కారణంగా వేలాది ఎకరాల పంటలకు నష్టం ఏర్పడిందని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితులలోను నష్టం ఏర్పడిన అరటి, మొక్కజొన్న, వరి, పత్తి పంటలకు నష్టపరిహారం అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెదపెంకి మాజీ సర్పంచ్ జి చిన్నమ్మలు, ఎంపీటీసీ సభ్యులు చప్ప సత్యంనాయుడు, మాజీ సర్పంచ్‌లు జి శ్రీరాములనాయుడు, రౌతు వెంకటరమణ, పీఏసీఎస్ ఉపాధ్యక్షులు శెట్టి కృష్ణమూర్తినాయుడు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రకృతి వ్యవసాయానికి
గిరిజన రైతులకు సహకారం

పాచిపెంట, అక్టోబర్ 14: ప్రకృతి వ్యవసాయానికి గిరిజన రైతులకు సహకారం అందించనున్నామని రీసెట్ మెట్‌వేర్ కంపెనీ సీఇఓ మార్సీ జిరాఫ్ తెలిపారు. మండలంలోని కుడుమూరు గ్రామంలో ప్రకృతి సిద్ధంగా పండించిన పత్తిపంటను ఆదివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం రైతులకు గ్రామీణ వికాస్ కేంద్రం (కడప) అనుబంధంగా తాము ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 15వేలమంది గిరిజన రైతులతో 60వేల ఎకరాలలో పత్తి, చిరుధాన్యాలు, మొక్కజొన్న వంటి పంటలను ప్రోత్సహించామన్నారు. 100శాతం ప్రకృతి వ్యవసాయం చేసేలా గిరిజన రైతులు చూడాలని ఆమె కోరారు. గిరిజన రైతుల అభివృద్ధికి ప్రకృతి వ్యవసాయం ఎంతో దోహదపడుతుందన్నారు. తమదేశంలో రసాయనిక ఎరువులతో పండించిన కాటన్‌తో తయారుచేసిన దుస్తుల వలన చర్మవ్యాధులు వస్తున్నాయని, దీనిని గుర్తించి ప్రకృతి వ్యవసాయానికి తమవంతు సహకారాన్ని అందిస్తున్నామన్నారు. ఈమెతోపాటు గ్రామీణ వికాస్ కేంద్రం అధ్యక్షులు అనీల్‌కుమార్, ఉపాధ్యక్షులు శరత్‌బాబు, మండల వ్యవసాయ అధికారి గోవిందరావులు పాల్గొన్నారు.
జరడ బాధితులను ఆదుకోవాలి

కురుపాం, అక్టోబర్ 14: మండలంలోని జరడ గ్రామంలో తుఫాన్‌కు నష్టపోయిన బాధితులను వెంటనే ఆదుకోవాలని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణీ డిమాండ్ చేశారు. ఆదివారం కొండపైన ఉన్న జరడ గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. అత్యధికంగా 40 ఇళ్లు కూలిపోవడంతో అక్కడ బాధితులు సమస్యలను ఏకరువుపెట్టారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఇప్పటికీ చాలాగ్రామాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్దరించలేదన్నారు. జరడ గ్రామంలో ఉన్న ఇళ్లు కూలిపోయి నిలువనీడలేని పరిస్థితి ఉన్నప్పటికీ ఎటువంటి పునరావాస కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు దీంట్లో ఘోరంగా విఫలమయ్యారన్నారు. వెంటనే బాధితులకు పునరావాసం కల్పించి నష్టపరిహారాన్ని అందించడంతోపాటు త్వరితగతిన పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరాను పునరుద్దరించాలని కోరారు. ఈమె వెంట ఎంపీపీ ఇందిరాకుమారి, జడ్పిటీసీ పద్మావతి, వైకాపా నాయకులు నాగేశ్వరరావు, షేక్ ఆదిల్, గౌరీశంకరరావు, తదితరులు పాల్గొన్నారు.