విజయనగరం

అర్హులందరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, అక్టోబర్ 14: అర్హులందరు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని స్థానిక తహశీల్దార్ బి.శేషగిరిరావు కోరారు. ఆదివారం మండలంలోని కొత్తబగ్గాం, గంగచోళ్ళపెంట గ్రామాలలో నిర్వహిస్తున్న ఓటుహక్కు నమోదు కేంద్రాలను తహశీల్దార్ శేషగిరిరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా స్వామ్యం మరింత పటిష్టంగా ఉండడానికి ఓటు హక్కు దోహదపడుతుందని అన్నారు. అదే విధంగా ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే వాటి సార్థకత నెరవేరుతుందని అన్నారు. ఓటరు జాబితాలో ఏమైనా తప్పొప్పులు ఉంటే సరిచేసుకోవాలని సూచించారు. ఇందుకోసం ఈ నెలాఖరులోగా ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి శని,ఆదివారాల్లో ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బిఎల్‌వొలు పాల్గొన్నారు.
==============

రైతుకంట కరవు కన్నీరు

కొత్తవలస, అక్టోబర్ 14: కరవు కాటేసింది. నైరుతి రుతుపవనాలు, అల్పపీడనాలు, తుఫాన్లు ఏవీ జిల్లాపై జాలి చూపలేదు. రైతుల ఆశలు ఆవిరై రైతు కంట కరవు కన్నీరు కారుతోంది. ఇటీవల వచ్చిన తిత్లీ తుఫాను కూడా రైతుల ఆశలను సజావుగా నిలపలేదు. జిల్లాలో పది మండలాల మినహా మిగిలిన మిగతా మండలాల్లో చుక్కచినుకులేదు. ఏజెన్సీ మండలాల్లో తప్ప మైదాన ప్రాంత మండలాల్లో వర్షపాతం లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులు వేసిన వరిపంట పూర్తిగా ఎండిపోయి దెబ్బతింది. జిల్లాలో లక్షల ఎకరాల్లో వరిసాగు ఎండకు ఎండి బూడిదైంది. పంటపై చిగురించిన రైతుల ఆశలు చిరుపొట్టదశలోనే ఆవిరయ్యాయి. ఒకవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి అన్నట్టుగా వర్షం వివక్షత చూపుతోంది. జిల్లాలో కురుపాం, బల్జిపేట, జి. ఎం.వలస, పార్వతీపురం, సాలూరు, గరుగుబిల్లి, కొమరాడ, మక్కువ, నెల్లిమర్ల, చీపురుపల్లి, మెరకముడిదాం, తెర్లాం, గరివిడి, జి. ఎల్.పురం మండలాల్లో తిత్లీ తుఫాన్ భీభత్సం సృష్టించింది. పంటలన్నీ నీటమునిగాయి. మరోవైపు విజయనగరం డివిజన్‌లోని మండలాల్లో కనీసం వర్షం కురవలేదు. చినుకుజాడ లేకపోవడంతో పంటలన్నీ ఎండిపోయాయి. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. జిల్లాలో రెండులక్షల హెక్టార్లకు పైగా వరిపంట సాగుచేయాల్సి ఉండగా వర్షాలు సరిగ్గా లేక లక్ష్యానికి చేరుకోలేదు. కొత్తవలస వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో ఎస్.కోట,వేపాడ, ఎల్.కోట, జామి, కొత్తవలస, మండలాల్లో రైతులకు కనీసం ఒక బస్తా గింజలు కూడా రావంటే అతిసయోక్తికాదు. జిల్లా అధికారులు కరవుపై ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని కోరుతున్నారు. రాష్టవ్య్రాప్తంగా ఇప్పటికే కరవుమండలాలను ప్రకటించిన ప్రభుత్వం మన మండలాలను ప్రకటించకపోవడం ఏమిటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక రైతులు, జిల్లా అధికారులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జిల్లాలో కరవు మండలాలను ప్రకటించే విధంగా చేయాలని రైతులు కోరుతున్నారు.

కార్యకర్తలు కష్టపడి పనిచేయాలి

కొత్తవలస, అక్టోబర్ 14: మండలంలోని తెలుగుదేశం కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలని మండల టీడీపీ అధ్యక్షుడు కోళ్ళ శ్రీను పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రతి కార్యకర్త 2019 ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. ఎంపీపీ రాజన్న మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజా సమస్యలు తెలుసుకుని వారి సమస్యలు పరిష్కారానికి కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. అంతకుముందు మావోయిస్టులు చేతులో మృతిచెందిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేర సోములుతోపాటు రోడ్డు ప్రమాదంలో మరణించి టీడీపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ ఎం.వి.వి. ఎస్.మూర్తిలకు ఆత్మశాంతించాలని వౌనం పాటించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు నక్కరాజు, చినరాము, కొరుప్రోలు అప్పారావు, ఎల్లపుసూరిబాబు పాల్గొన్నారు.