విజయనగరం

తుఫాను బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, అక్టోబర్ 22: తిత్లీ తుఫాను కారణంగా అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లాలోని తుఫాను బాధితులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో గజపతినగరం భగవాన్ సత్యసాయి సేవాసమితి ఉదారంగా ముందుకు వచ్చి, తమ ధాతృత్వాన్ని చాటుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బైపల్లి, టెంటభద్ర, కొండపల్లి, అడ్డపల్లి తదితర గ్రామాలలోని 150 మంది బాధితులకు జిల్లా తరపున నిత్యావసర వస్తువులతోపాటు వంటపాత్రులు అందజేశారు. భగవాన్ సత్యసాయి సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.జి. కలామ్ నేతృత్వంలోని సేవా సమితి సభ్యులు సోమవారం పర్యటించి బాధితులకు అందజేశారు. రాష్ట్ర సమితి తరపున రెండు వేల మంది బాధితులకు బియ్యంతోపాటు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు, వంటపాత్రలు అందించారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్. లక్ష్మణరావు, జిల్లా అధ్యక్షుడు రామ్మోహనరావు, రాష్ట్ర విభజన సమన్వయకర్త రామప్రసాద్, రాష్ట్ర నాయకులు సత్యనారాయణ, కమిటీ కన్వీనర్ వెంకటేష్, ఆధ్యాత్మిక కో- ఆర్డినేటర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
చేనేత, గీత కార్మికులు ఆదరణ-2కు
రుణాలకు దరఖాస్తులు చేసుకోవాలి
గజపతినగరం, అక్టోబర్ 22: ఆదరణ-2 ఉపకరణాల కోసం చేనేత, గీత కార్మికులు దరఖాస్తులు చేసుకోవాలని స్థానిక ఎంపీడీవొ ఎస్.కృష్ణవేణమ్మ అన్నారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత, గీత కార్మికులకు ఆదరణ-2 పథకంలో సైకిళ్ళు, ఐదువేల రూపాయలు విలువ చేసే ఉపకరణాలు మంజూరు అవుతాయని చెప్పారు. గ్రామాలలో వీధిలైట్ల సమస్యతోపాటు పారిశుద్ధ్యం, మంచినీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో మండల పంచాయతీ విస్తర్ణ అధికారి జనార్థనరావు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
పౌష్టికాహారాన్ని సక్రమంగా పంపిణీ చేయాలి
గజపతినగరం, అక్టోబర్ 22: అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారాన్ని సక్రమంగా లబ్దిదారులకు పంపిణీ చేయాలని గజపతినగరం ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి రమణమ్మ ఆదేశించారు. సోమవారం మండలంలోని పురిటిపెంట షరాబుల కాలనీలో గల అంగన్‌వాడీ కేంద్రంతోపాటు గజపతినగరంలోని అంగన్‌వాడీ కేంద్రాలను సిడిపివొ రమణమ్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లల హాజరు రికార్డులను పరిశీలించారు. గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు ప్రభుత్వం ప్రతి నెల పంపిణీ చేస్తున్న పౌష్టికాహారాన్ని అందించాలని అన్నారు. గర్భిణీలు రక్తహీనత గల బాలింతలను గుర్తించి అదనపు పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా అందజేయాలని తెలిపారు.
కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.