విజయనగరం

మత్స్యకారులను ఆదుకోవడానికి ప్రభుత్వం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి(రూరల్), అక్టోబర్ 22: మత్స్యకారులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని మున్సిపల్ ఛైర్‌పర్సన్ తూముల అచ్యుతవల్లి అన్నారు. ఈమేరకు మున్సిపల్ పరిధిలో చిన్ననీటి చెరువులో సోమవారం చేపపిల్లలను విడిచిపెట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మత్స్యశాఖ ద్వారా మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు ఉచితంగా చేపపిల్లలను అందిస్తుందన్నారు. వీటిని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా మత్స్యకారులకు సైకిళ్లు, మోపెడ్‌లు, వలలు, తదితర సామాగ్రిని కూడా ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సంఘం అధ్యక్షులు కంచి వెంకటరావు మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ షరతులు లేని రుణాలు అందించి వారిని ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బీసపు పార్వతి, రాంబార్కి శరత్, తెంటు పార్వతితోపాటు మత్స్యశాఖ అధికారులు సంతోషికుమారి, ప్రతిమాదేవిలు పాల్గొన్నారు.
లారీ బోల్తా
బొబ్బిలి(రూరల్), అక్టోబర్ 22: లారీ అదుపు తప్పి బోల్తాపడటంతో ఎటువంటి ప్రమాదం లేకపోయినప్పటికీ ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలం పారాది గ్రామ సమీపంలో బొబ్బిలి గ్రోత్ సెంటర్ నుంచి విజయనగరానికి మెటల్ రాయి లోడుతో వెళుతుండగా సోమవారం తెల్లవారుజామున బోల్తాపడింది. దీంతో మొత్తం మెటల్ రాయి అంతా రోడ్డుకు అడ్డంగా పడటంతో ట్రాఫిక్‌కు కొంతవరకు అంతరాయం ఏర్పడింది. బొబ్బిలి నుంచి రామభద్రపురం వెళ్లే వాహనాలు, రామభద్రపురం నుంచి బొబ్బిలి వచ్చే వాహన యజమానులు కొంతవరకు ఇబ్బందులకు గురయ్యారు. వెంటనే సంబంధిత యజమానులు స్పందించి జెసీబీతో లారీని ప్రక్కకు తొలగించడంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారమైంది.

బేదాభిప్రాయాలు లేకుండా పార్టీఅభివృద్ధికి కృషి చేయండి
జియ్యమ్మవలస, అక్టోబర్ 22: తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలలో బేదాభిప్రాయాలు లేకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ శతృచర్ల విజయరామరాజు పిలుపునిచ్చారు. సోమవారం మండలంలో గల చినమేరంగి శతృచర్ల స్వగృహంలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. నిన్నటి వరకు మండలంలో ఒక వర్గానికి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ దత్తి లక్ష్మణరావు, మరో వర్గానికి కురుపాం ఏఎంసీ మాజీ ఛైర్మన్ డొంకాడ రామకృష్ణలు రెండువర్గాలుగా విడిపోయి తెలుగుదేశంపార్టీలో గ్రూపులు ఉండేవి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రూపులు లేకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని గట్టిగా ఆదేశాలు ఇవ్వడంతో రెండు వర్గాలు ఎమ్మెల్సీ శతృచర్ల సమక్షంలో ఏకమయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో శతృచర్ల మాట్లాడుతూ ఎటువంటి అరమరికలు, పక్షపాతం లేకుండా అందరినీ కలుపుకుని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని శతృచర్ల తెలిపారు. మాజీ ఎమ్మెల్యే శతృచర్ల చంద్రశేఖరరాజు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కురుపాం నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ అభ్యర్థిని గెలిపించడానికి ఇప్పటి నుంచే నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కురుపాం మాజీ ఎమ్మెల్యే విటి జనార్థన థాట్రాజ్ మాట్లాడుతూ మండలంలో తెలుగుదేశంపార్టీ పూర్తిస్థాయిలో బలోపేతమైందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ఉండాలన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ దత్తి లక్ష్మణరావు మాట్లాడుతూ శతృచర్ల నాయకత్వంలో నిస్వార్థంగా పార్టీ అభివృద్ధికి పనిచేస్తామని నాయకులు, కార్యకర్తలు అందరూ సహకరించాలన్నారు. రాష్ట్ర అత్యంత వెనుకబడిన తరగతుల ఛైర్మన్, అరకుపార్లమెంట్ పార్టీ పరిశీలకులు కాకి గోవిందరెడ్డి మాట్లాడుతూ కురుపాం నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ జెండా రెపరెపలాడాలని, శతృచర్ల నాయకత్వంలో అందరూ కలిసి పనిచేయాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు చేపడుతున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసి టీడీపీని బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కురుపాం ఏఎంసీ మాజీ ఛైర్మన్ డొంకాడ రామకృష్ణ, ఎంపీపీ దత్తి కామేశ్వరి, వైస్ ఎంపీపీ ఎం చంద్రవౌళి, సెంట్రల్‌బ్యాంకు డైరెక్టర్ ఆర్ బలరామస్వామినాయుడు, తదితరులు పాల్గొన్నారు.