విజయనగరం

రాష్ట్ర అభివృద్ధే చంద్రబాబు ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జియ్యమ్మవలస, అక్టోబర్ 22: రాష్ట్ర అభివృద్ధే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయమని రాష్ట్ర అత్యంత వెనుకబడిన తరగతుల ఛైర్మన్, అరకు పార్లమెంట్ పార్టీ పరిశీలకులు కాకి గోవిందరెడ్డి అన్నారు. సోమవారం మండలంలో గల చినమేరంగి శతృచర్ల స్వగృహంలో కురుపాం నియోజకవర్గం టీడీపీ సమన్వయకమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కురుపాం నియోజకవర్గానికి కోట్లాది రూపాయలు నిదులు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు మంజూరుచేసిందని, వాటిని ప్రజలకు తెలియజేయాలన్నారు. సమస్యల పరిష్కారానికే చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, నియోజకవర్గం పరిధిలో ఏమైన సమస్యలుంటే చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు. మాజీ మంత్రి శతృచర్ల విజయరామరాజు మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలో గోశాలలు అభివృద్ధికి ప్రభుత్వం నిదులు మంజూరుచేసిందని, పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈసమావేశంలో నాగూరు, కురుపాం నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు శతృచర్ల చంద్రశేఖరరాజు, విటి జనార్థన థాట్రాజ్, ఎంపీపీ దత్తి కామేశ్వరి, ఏఎంసీ మాజీ ఛైర్మన్ రామకృష్ణ, కురుపాం ఏఎంసీ ఛైర్మన్ కోలా రంజిత్‌కుమార్, 5మండలాల టీడీపీ కన్వీనర్లు, పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అన్నివర్గాల ప్రజలకు అండగా ఉంటా: వైఎస్ జగన్మోహనరెడ్డి
రామభద్రపురం, అక్టోబర్ 22: రాష్ట్రంలో ఈ దుష్టపరిపాలన అంతమయ్యాక, అన్నివర్గాల ప్రజలకు అండగా ఉంటానని వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా సోమవారం విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం తారాపురం గ్రామంలో వివిధ సమస్యలపై ఆయన కలిసిన ప్రజలతో ముచ్చటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అందరికీ సమన్యాయం చేసి సమస్యల పరిష్కారానికి శక్తివంఛన లేకుండా కృషి చేస్తానన్నారు. తారాపురం గ్రామంలో గత 10 సంవత్సరాలుగా ఎస్సీ కాలనీకి మంచినీటి సౌకర్యం కల్పించలేదని, దీంతో మహిళలు కిలోమీటర్ల దూరం నడిచి మంచినీటిని తెచ్చుకుంటున్నారని గ్రామానికి చెందిన చిన్నయ్య మాస్టర్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే తారాపురం గ్రామంలో అభివృద్ధి పనులకు నిదులు మంజూరుకావడం లేదన్నారు. ఎస్సీవీధిలో ఎన్నో సమస్యలున్నప్పటికీ అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని జగన్‌కు తెలిపారు. అలాగే జగన్‌ను కలిసిన దివ్యాంగుడుతో మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వస్తే సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మిర్తివలస గ్రామం వద్ద హైస్కూల్ విద్యార్థులు జగన్‌కు కోలాటంతో స్వాగతం పలికారు. జన్నివలస గ్రామానికి సంబంధించిన సమస్యలను ఆ గ్రామ ప్రజలు తెలిపారు. సాక్షరాభారత్ ఉద్యోగులను ప్రభుత్వం అన్యాయంగా తొలగించిందని, దీంతో తమకు ఉపాధి కరువైందని, వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి పలు పర్యాయాలు వినతిపత్రాన్ని అందించిన పట్టించుకోలేదని సంఘం నాయకులు జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ పాదయాత్రలో మహిళలు, యువత అధిక సంఖ్యలో పాల్గొని రానున్న సీఎం జగన్ అని నినాదాలు చేశారు. ఈయన వెంట వైసీపీ నాయకులు మజ్జి శ్రీనివాసరావు, శంబంగి వెంకటచినప్పలనాయుడు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జీడితోటలకు నష్టపరిహారం చెల్లించాలి
పార్వతీపురం, అక్టోబర్ 22: ఇటీవల సంభవించిన తిత్లీ తుపానుకు దెబ్బతిన్న జీడితోటల నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ సోమవారం ఐటిడి ఎ కార్యాలయంలో పీవో డాక్టర్ జి.లక్ష్మీశ నిర్వహించిన గ్రీవెన్సులో కురుపాం మండలంలోని ఒబ్బంగి పంచాయతీ భీంపురం గిరిజన గ్రామస్థులు కోరారు. అదేవిధంగా భీంపురం గెడ్డపై వంతెన నిర్మించాలని విజ్ఞప్తిచేశారు. అలాగే ఇదే మండలానికి చెందిన బియ్యాలవలస, దురిబిలి గ్రామస్థులు మాట్లాడుతూ తమకు వ్యవసాయం కోసం సోలార్ బోర్లు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా సాలూరు మండలంలోని తోణాం పంచాయతీ చిమిడివలస, కొత్తూరు గ్రామస్థులు మాట్లాడుతూ తమ గ్రామాలకు తారురోడ్డు మంజూరు చేయాలని కోరారు. పార్వతీపురం మండలంలోని తాళ్లబురిడి పంచాయతీ చప్పవానివలస గ్రామస్థులు మాట్లాడుతూ తమ గ్రామంలో సామాజిక భవన నిర్మాణం చేపట్టాలని కోరారు. కురుపాం మండలంలోని ఏగులవాడ పంచాయతీ ఈతమానుగూడ గిరిజనులు మాట్లాడుతూ తమ సాగుచేసుకుంటున్న కొండపోరంబోకు భూములకు సర్వేచేసి పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని కోరారు. జియ్యమ్మవలస మండలంలోని బిజెపురం పంచాయతీ లోతువలస గ్రామస్థులు మాట్లాడుతూ తమ గ్రామానికి రహదారి సదుపాయం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంకా పలువురు గిరిజనులు తమకు సాగునీరు, తాగునీరు, విద్యుత్ వంటి పలు వౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎపివో సురేష్‌కుమార్, జిల్లా గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరక్టర్ కిరణ్‌కుమార్, గిరిజన సంక్షేమశాఖ ఇ ఇ కెవి ఎన్ ఎస్ కుమార్, హౌసింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు సంబంగి రమణమూర్తి,పి ఎ వో మధు, పిహెచ్‌వో వరప్రసాద్, ఇండస్ట్రీస్ ఎడి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

తిత్లీ బాధితులకు వాసవి క్లబ్ సభ్యులు విరాళం
పార్వతీపురం, అక్టోబర్ 22: ఇటీవల సంభవించిన తిత్లీ తుపాను బాధితుల సహాయార్థం సోమవారం ఐటిడి ఎ పీవో డాక్టర్ జి.లక్ష్మీశను కలిసి స్థానిక వాసవి క్లబ్ సభ్యులు తమవంతు సాయంగా 105 టవల్స్‌ను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులను పీవో అభినందించారు. ఈకార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ పుండరీకాక్ష, ట్రెజరర్ సత్యానంద్, జడ్ సి కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.