విజయనగరం

ఏపీలో బీజేపీ బలోపేతమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, నవంబర్ 13: రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర కన్వీనర్ సునీల్ దియోదర్ అన్నారు. మంగళవారం గజపతినగరం నాలుగురోడ్లు జంక్షన్‌లో ఆ పార్టీ నాయకులు సునీల్ దియోదర్‌కు శాలువ కప్పి, పుష్పగుచ్చాన్ని అందజేసి ఘనస్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో బూత్‌స్ధాయి నుండి పార్టీని బలోపేతం చేసేదిశగా పార్టీశ్రేణులను సన్నద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే త్రిపుర రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా నియమించిన తనను ఆరాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే విధంగా కృషి చేశామన్నారు. బీజేపీపై రోజురోజుకు దేశ వ్యాప్తంగా ఒక మంచి అభిప్రాయం వ్యక్తం అవుతుందని, గతంలో కుంభకోణాలలో కూరుకుపోయిన పాలన నుండి కుంభకోణాలు లేని పాలన సాగించే దిశగా అడుగులు వేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డి పావని, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవర ఈశ్వరరావు, బొండపల్లి నాయకులు మీసాల కుమార్, ఎం ఎస్ ఎన్ రాజు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

గర్భిణులకు సామూహిక సీమంతాలు
కొత్తవలస, నవంబర్ 13: మండలంలోని తుమ్మికాపల్లి పంచాయతీలో అంగన్‌వాడీలు, వియ్యంపేట పిహెచ్‌సి వైద్య సిబ్బంది కలసి గర్భిణీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. మంగళవారం మండలంలోని తుమ్మికాపల్లి గ్రామంలో గల 1,3 కేంద్రాల ఆధ్వర్యంలో గర్భిణీలకు సీమంతాలు నిర్వహించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్ అసిస్టెంట్ ఎల్. సత్యారావు మాట్లాడుతూ గర్భిణీలు తప్పనిసరిగా ప్రతి వారం వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోవాలని అన్నారు. పుట్టిన బిడ్డకు ఆరునెలలు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలని సూచించారు. బిడ్డబిడ్డకు మూడు సంవత్సరాలు వ్యవధి ఉండాలని తెలిపారు. పౌష్టికాహార విషయంలో రాజీపడవద్దని చెప్పారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉండాలంటే తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త దేవి, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.

జీవవైవిద్య జాతరను విజయవంతం చేయాలి
కొత్తవలస, నవంబర్ 13: మండలంలోని చీడివలస గ్రామంలో బుధవారం జరగనున్న జీవ వైవిద్య సదస్సును విజయవంతం చేయాలని సబల స్వచ్చంద సంస్థ ప్రాంతీయ సమన్వయకర్త ఈశ్వరరావు కోరారు. మంగళవారం ఆయన జీవవైవిద్య సదస్సు వివరాలు విలేఖరులకు తెలిపారు. గత 15 ఏళ్ళగా సబల సంస్థ చిరుధాన్యాల ఉత్పత్తిలో పేరు సంపాదించిందని చెప్పారు. జాతీయ స్థాయిలో చిరుధాన్యాలకు కొత్తవలస కేరాఫ్‌గా మారిందని అన్నారు. చిరుధాన్యాల ఉత్పత్తి, వాటితో తయారు అయ్యే ఉత్పత్తు, మార్కెటింగ్ వంటి సదుపాయాలు కొత్తవలసలో ఏర్పాటు చేశామని తెలిపారు. బుధవారం జరగనున్న జాతరకు స్థానిక ఎమ్మెల్యేతోపాటు జిల్లా వ్యవసాయశాఖ జెడి, ఆత్మాపిడి, కొత్తవలస ఎడిలతోపాటు 200మంది వరకు చిరుధాన్యాల చెల్లిళ్ళు అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొంటారని చెప్పారు.