విజయనగరం

పాడి రైతుల అభివృద్ధే హెరిజ్ అభివిద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెరకముడిదాం, నవంబర్ 16: పాడి రైతుల అభివృద్ధే హెరిటేజ్ పాల డైరి అభివృద్ధని ఆ సంస్థ ఏరియా మేనేజర్ ఎస్‌కే ఇమామ్ బాషా అన్నారు. శుక్రవారం మండలంలో గల కొర్లాంలో సుమారు 110 మంది పాడి రైతులకు ఆయన చేతులు మీదుగా పశుదానా గినె్నలను పంపిణి చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హెరిటేజ్ సంస్థ ద్వారా పాడి రైతులకు అనేక సంక్షేమ కార్రక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇందులో బాగం గానే హెరిటేజ్ రైతు సంక్షేమ నిధికి కేవలం 110 రూపాయలు నామమాత్రపు రుసుం చెల్లించి జీవిత కాల సభ్యత్వం తీసుకోవచ్చాన్నారు. జీవితకాల సభ్యత్వం తీసుకున్న రైతులకు రెండు లక్షల ప్రమాద భీమా 25 వేలు సహజ మరణం భీమా వర్తిస్తుందన్నారు. అలాగే ఏ సంస్థ ఇవ్వని విదంగా పశువుల దానాపై బస్తాకు 160 రూపాయలు రాయితి ఇవ్వడం జరుగుతుందన్నారు.అలాగే పశు భీమా రుసుంపై డైరీ తరుపున 110 రూపాయలు ప్రతి పశువుపైనా భీమా కంపినికి ప్రీమియం చెల్లించడం జరుగుతుందన్నారు. బ్యాంక్‌ల నుండి పాడి పశువులు కొనుగోలు చేసుకునేందుకు రైతులకు అతి తక్కువ వడ్డీకి ఋణం ఇప్పించడం జరుగుతుందన్నారు. పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని హెరటెజ్ సంస్థ అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగపర్చుకుని నాణ్యమైన పాలును డైరీకి సరఫరా చేసి ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని పాడి రైతులను ఆయన కోరారు. కార్యక్రమంలో కొర్లాం మాజీ సర్పంచ్ బూర్లె నరేష్ కుమార్, బొబ్బిలి డైరీ మేనేజర్ కె మారినాయుడు, పర్యవేక్షుడు రమణ, ఏజెంట్ తమ్మినాయుడు తదితరులు పాల్గొన్నారు.

=======

ప్రజలకు ఉపయోగపడని
గ్రామదర్శిని ఎందుకు

మెరకముడిదాం, నవంబర్ 16: ప్రజలకు ఉపయోగపడని గ్రామదర్శిని కార్యక్రమం ఎందుకని మండల ప్రజలు ఇటు అధికారులను అటు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రతి గురువారం మండలంలో ఏదో ఒక పంచయితికి అధికారులు వెల్లడం తూతూ మంత్రంగా గ్రామ సభ నిర్వహించడం తిరిగి వెల్లడమే తప్ప ఫలితం ఏముందని వీరు ప్రశ్నిస్తున్నారు. గ్రామ దర్శినిలో అందిన ఒక్క ఫిర్యాదుకైనా పరిష్కారం చూపిన దాఖలాలు లేవని మండల ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ గ్రామ దర్శిని కారణంగా మండల కార్యాలయానికి పనులు నిమిత్తం వెల్లినా అధికారులు అందుబాటులో ఉండడం లేదని వాపోతున్నారు. గ్రామదర్శిని జరుగుతున్న వద్దకు వెలితే ఇక్కడేనా కార్యాలయానికి రండి అని తిప్పుతున్నారని వీరు ఆరోపిస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడని గ్రామదర్శిని కార్యక్రమం ఎందుకని కనీసం గ్రామ సభలో ఇచ్చిన ఆర్జీలు ఆయా కార్యాలయాలకైనా చేరుతున్నాయా అన్న అనుమానం వీరి నుండి వ్యక్తం అవుతుంది.

=======

రేషన్ డిపోల పనితీరు మెరుగుపరచుకోవాలి
* ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలి
* రాష్ట్ర ఆహార సలహా సంఘ సభ్యులు విజయ్‌కుమార్

ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, నవంబర్ 16: ప్రజలకు నిత్యావసర సరకులను రేషన్ డిపోల ద్వారా సరఫరా చేస్తున్నప్పటికీ వారిలో సంతృప్తి అంతంత మాత్రంగానే ఉందని రేషన్ డిపో డీలర్ల పనితీరు మెరుగుపరచుకోవాలని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు విజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లో పౌరసరఫరాలు, ఐసిడిఎస్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీసం 90 శాతం మంది ప్రజలు సంతృప్తి చెందేలా పనితీరు మెరుగుపరచుకోవాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన సరకులను అందించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణీలను గౌరవించాలన్నారు. తరచు అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. ప్రజలతో మమేకమై ఎప్పటికపుడు లోపాలను సరిదిద్దుకోవాలన్నారు. కష్టపడి పనిచేస్తున్నప్పటికీ చిన్న చిన్న విషయాల్లో తేడాలు వస్తున్నాయన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మరింత మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిడిపివోలకు శిక్షణ కార్యక్రమాలు ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జెసి-2 సీతారామారావు, జిల్లా పౌరసరఫరాల అధికారి సుబ్బరాజు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ షర్మిల, డిఎంహెచ్‌ఒ డాక్టర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
==============

చిట్టిచేతుల్లో చిన్నారుల బహుమతులు
* అంతర్జాతీయ బాలల చిత్రకళాపోటీల్లో చిన్నారుల ప్రతిభ

పూసపాటిరేగ, నవంబర్ 16: ఇటీవల సువాసనగల మొక్కలు పేరుమీద హైదరాబాద్ ఎంగ్ ఎన్.వాయిస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్వహించిన పోటీల్లో డెంకాడ మండలం రఘుమండ జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు పసిడిపతకాల పంట పండించారు. పదవ అంతర్జాతీయ బాలల చిత్రకళా పోటీలకు హైదరాబాద్‌కు చెందిన ఎంగ్ ఎన్‌వాయిస్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంస్థ ఆహ్వానం పలికింది. ఈపోటీలకు 24దేశాలకు చెందిన బాలలు తమ చిత్రాలను తీసి సంస్థకు పంపించారు. ఈపోటీల్లో రఘుమండ పాఠశాలకు చెందిన పావని, స్వరూప్‌కుమార్, వౌనిక, సురేష్‌లు వేసిన చిత్రాలకు పసిడిపతకాలు వరించాయి. ఇదే పాఠశాలకు చెందిన మరో పదిమంది విద్యార్థులకు య్యూరీ పతకాలు కూడా దక్కాయి. అవార్డులు పంట పండించిన విద్యార్థులను పాఠశాల హెచ్ ఎం చంద్రశేఖర్ కుమార్, ఉపాద్యాయ సిబ్బంది అభినందించారు. చిత్రలేఖనం ఉపాద్యాయులు చినసత్యనారాయణను విద్యార్థులతో కలసి సత్కరించారు. ============

కత్తెరపురుగుపై వీడియో ప్రదర్శన

పూసాటిరేగ, నవంబర్ 16: మొక్కజొన్నలో ప్రమాదకరంగా ఉన్న కత్తెర పురుగు ఉధృతిని నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వీడియో ద్వారా వెంపడాం గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. మొక్కజొన్నలో కత్తెరపురుగు వ్యాప్తి వలన పంట దిగుబడులు తగ్గిపోతున్నాయని వ్యవసాయశాఖ జిల్లా సహాయక సంచాలకులు ఆర్. శ్రీనివాసరావు అన్నారు. పురుగు వ్యాప్తి చెందకుండా 8నుంచి 15రోజుల మధ్యలో వేపనూనె ద్వారా పిచికారీ చేయాలని అన్నారు. 15 నుండి 20రోజుల మధ్యలో ఫినాల్‌పాస్ మందును 20నుంచి 30రోజుల మధ్య తాస్కో బోరాన్ ఒక కిలో గుళికల మందును ఇందులో కలిపి పిచికారీ చేయాలని చెప్పారు. పురుగు ఉధృతి గురించి ప్రత్యేక చర్య తీసుకుంటే పంటను సంరక్షించుకోవచ్చు అని అన్నారు. అనంతరం రైతుల సందేహాలను పంటల వ్యవసాయ అధికారి అడ్డూరు శ్రీనివాస్ నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, రైతులు, అధికార సిబ్బంది పాల్గొన్నారు.
=========

గిరిజనుల సమస్యలు అధికారుల దృష్టికి తీసుకురావాలి
* ఎంపీడీవొ మన్మధరావు

శృంగవరపుకోట, నవంబర్ 16: గిరిజనులు తమ గ్రామాల్లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చినపుడు వాటి పరిష్కారం జరుగుతుందని ఎంపీడీవొ మన్మధరావు అన్నారు. మండలంలోని దారపర్తి పంచాయతీ దబ్బగుంట గ్రామంలో అధికారులు గ్రామదర్శిని కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవొ మాట్లాడుతూ కొండపైన గిరిజన గ్రామాలకు వెళ్ళే ప్రధాన రహదారిని జిల్లా పరిషత్ నిధులు నుండి నాలుగు లక్షలతో తిరిగి బాగు చేస్తున్నామని చెప్పారు. ఈ రహదారిలో సిసి రోడ్డు వేసేందుకు ప్రభుత్వం నాలుగు కోట్లు మంజూరుచేసిందని, గ్రావెల్ రోడ్డు అనంతరం సిసి రోడ్డు వేస్తామని తెలిపారు. గిరిజనులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. అనంతరం గిరిజనుల వద్దనుండి వినతులు తీసుకున్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ అరుణకుమారి, ఎపీవొ ఆదిలక్ష్మి, ఇవొ పీ ఆర్డీ శ్రీనివాసరావు, ఆర్‌డబ్ల్యు ఎస్ అధికారి కిషోర్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
=============

కిరాణాదుకాణంపై పోలీసులు దాడి

శృంగవరపుకోట, నవంబర్ 16: మండలంలోని బొడ్డవర గ్రామంలో శుక్రవారం స్థానిక పోలీస్ సిబ్బంది కిరాణాషాపులపై దాడులు నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో ఎస్.కోట ఎస్సై అమ్మినాయుడు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఏజెన్సీ ముఖద్వారామైన బొడ్డవర గ్రామంలో కిరాణాదుకాణాల యాజమాన్యం ఖైనీలు, గుట్కాలు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారనే సమాచారంతో దుకాణాలపై దాడులు నిర్వహించామని అన్నారు. దాడుల్లో అదే గ్రామానికి చెందిన శ్రీనివాసరావు దుకాణంలో 600ఖైనీప్యాకెట్లు, 700సఫారీ ప్యాకెట్లు దొరకాయని చెప్పారు. వీటిని స్వాధీనం చేసుకుని సంబంధిత శాఖకు అప్పజెప్పి వీరిపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఈ దాడుల్లో ఎ ఎస్పీ నాగేశ్వరరావు, హెచ్‌సి రామకృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
===============