విజయనగరం

జిల్లాలో తాండవిస్తున్న కరవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, నవంబర్ 16: జిల్లాలో కరవు తాండవిస్తోంది. జిల్లాలో మొత్తం 34 మండలాలు ఉండగా వాటిలో 25 మండలాల్లో కరవు పరిస్ధితులు నెలకొనడంతో జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణం 1,88,147 హెక్టార్లు కాగా, వాటిలో 1,76,806 హెక్టార్లలో 25 రకాల పంటలను రైతులు సాగు చేస్తున్నారు. వాటిలో అత్యధికంగా వరి 1,19,741 హెక్టార్లలో వేశారు. మిగిలిన రకాల పంటలు కలిపి 56వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నాయి. కాగా, ఈ దఫా ఖరీఫ్‌లో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షం నమోదు కావడంతో రైతులు అల్లాడిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 23 శాతం సాధారణ వర్షపాతం కంటే తక్కువగా నమోదైంది. మరోపక్క ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో కూడా నీటిమట్టాలు తగ్గడం ఆందోళన కలిగించే విషయం. గత రెండు నెలలుగా వర్షాలు కురవకపోవడంతో అన్ని మండలాల్లో వరి పైర్లు ఎండిపోతున్నాయి. బోర్లు, కాలువలు ఉన్న చోట పంటలు కొంత మేరకు బాగున్నప్పటికీ, వర్షాధారంపై ఆధారపడి పంటలు సాగు చేసే చోట రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది వరి పంటకు పెట్టిన పెట్టుబడి కూడా తమకు దక్కుతుందో, లేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్ధితులు ఆధారంగా చేసుకొని జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్ ప్రభుత్వానికి అంచనా నివేదికను పంపించారు. మొదటి విడతలో 17 మండలాలను కరవు మండలాలుగా గుర్తించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఆ తరువాత రెండో విడత కింద మరో ఎనిమిది మండలాలను కరవు మండలాలుగా గుర్తించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ విధంగా జిల్లాలో మొత్తం 25 మండలాలను కరవు మండలాలుగా గుర్తించాలని ప్రభుత్వం నాలుగు మండలాలను కరవు మండలాలుగా పేర్కొంది. కరవు మండలాలుగా ప్రకటించిన వాటిలో ఎస్‌కోట, జామి, ఎల్‌కోట, పార్వతీపురం మండలాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా మరోపక్క జిల్లాలో 80 శాతం మంది పైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నవారే. వర్షాభావ పరిస్ధితులు నెలకొనడంతో వారంతా ఉపాధి కోసం అల్లాడుతున్నారు. మరికొంత మంది ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలసలు పోతున్నారు. జిల్లాలో మెరకముడిదాం, రామభద్రాపురం, బలిజపేట, తెర్లాం, బాడంగి తదితర మండలాలకు చెందిన వారు కూలీ పనుల కోసం వలసలు పోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దీనిపై వ్యవసాయశాఖ జెడి లీలావతి మాట్లాడుతూ జిల్లాలో 25 మండలాలను కరవు మండలాలుగా గుర్తించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. కేవలం నాలుగు మండలాలకు అనుమతి లభించిందన్నారు. మిగిలిన వాటిని కూడా కరవు మండలాలుగా గుర్తించాలని ప్రభుత్వానికి నివేదికలను అందజేశామని ఆమె వివరించారు.
==================

ఆదరణ కుట్టుమిషన్ల పంపిణీ

విజయనగరం (్ఫర్టు), నవంబర్ 16: ప్రతీ కుటుంబానికి పదివేల రూపాయలకు మించి ఆదాయం సంపాదించే మార్గం చూపించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదరణ పథకం ద్వారా ఆధునిక పనిముట్లు పంపిణీ చేపట్టాలని మున్సిపల్‌చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ తెలిపారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఆదరణ పథకం ద్వారా మంజూరైన కుట్టుమిషన్లను మహిళలకు శుక్రవారం సాయంత్రం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ ప్రజాసంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండటం తెలుగుప్రజల అదృష్టమని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆదరణ ద్వారా పనిముట్లు పొందిన లబ్థిదారులు ఆర్థికంగా ప్రయోజనం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కె.కనకమహాలక్ష్మి, 21వ వార్డు కౌన్సిలర్ గేదెల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
==========

సొలార్ పవర్ ప్రాజెక్ట్ పరిశీలన

విజయనగరం (్ఫర్టు), నవంబర్ 16: మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ద్వారపూడి వద్ద ఏర్పాటుచేసిన సోలార్ పవర్ ప్రాజెక్టును మున్సిపల్ కమిషనర్ టి.వేణుగోపాల్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సోలార్ నుంచి విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి పలు సూచనలు చేశారు. అలాగే సోలార్ పేనల్స్‌ను క్రమం తప్పకుండా క్లీన్ చేయాలన్నారు. సోలార్ నుంచి విద్యుత్ ఉత్పత్తి రోజుకు ఎంత అవుతుందో రిజిస్ట్రార్‌లో నమోదు చేయాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
=============

24 పశువైద్యశాలల భవన నిర్మాణానికిప్రతిపాదనలు
* పశుసంవర్థకశాఖ జెడి డాక్టర్ నర్సింహులు

విజయనగరం (్ఫర్టు), నవంబర్ 16: జిల్లాలో 24 పశువైద్యశాల, గ్రామీణ పశువైద్యశాలలకు భవనాలను నిర్మించాలని నిర్ణయించామని ని పశుసంవర్థకశాఖ జాయింట్‌డైరెక్టర్ డాక్టర్ ఎంవిఎ నర్సింహులు అన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. శుక్రవారం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో మెరుగైన పశువైద్యసేవలను అందించేందుకు పశువైద్యశాలలకు భవనాలను నిర్మిస్తామని తెలిపారు. గుర్ల మండలంలో పాలవలస, గుర్ల, గరుగుబిల్లిలో మండలం గరుగుబిల్లి, నాగూరు, ఉల్లిభద్ర, రామభద్రపురంలో ఆరికతోట, పాచిపెంట మండలంలో విశ్వనరాధపురం, బలిజపేటలో బర్లి, చిలకలపల్లి, పలగర, బొబ్బిలి మండలంలో పెంట, ఫక్కి, మక్కువ మండలంలో శంబర, నెల్లిమర్ల మండలంలో పారసాం, సారిపల్లి, గంట్యాడ నరవ, వసంత గ్రామాల్లో భవనాలను నిర్మిస్తామన్నారు. అలాగే మెరకముడిదాం భీమవరం, సీతానగరం గుచీ, పార్వతీపురం మండలంలో నర్సిపురం, విజయనగరం మండలంలో కోరుకొండ, జియ్యమ్మవలస మండలంలో చినమేరంగి, ఎల్.కోట మండలంలో ఎల్.కోట, గరివిడి మండలంలో వెదుళ్లవలస గ్రామాల్లో భవనాలను నిర్మిస్తామన్నారు. జిల్లాలో ప్రతీ పదివేల గొర్రెలు, మేకలకు పశువైద్యసేవలు అందించేందుకు జీవనమిత్రలను నియమించామన్నారు. గొర్రెలు,మేకలకు డీవార్మింగ్ వేస్తే పెంపకందారులు ఒక్కొక్క గొర్రె, మేకకు 50 పైసలు చొప్పున జీవనమిత్రులకు చెల్లిస్తారని తెలిపారు.
==============

దళితులపై దాడులు-పరిష్కారంపై
నేడు విశాఖ పౌరగ్రంథాలయంలో సదస్సు

విజయనగరం (్ఫర్టు), నవంబర్ 16: రాజ్యాంగం అన్నివర్గాల వారికి సామాజిక భద్రత కల్పించినా నేటికీ దళితులపై దాడులు జరుగుతున్న దళిత హక్కుల పోరాటసమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గోకా రమేష్‌బాబు అన్నారు. దళితులపై దాడులు జరుగుతున్న నేపధ్యంలో ఈనెల 17వతేదీన విశాఖపట్టణ పౌర గ్రంథాలయంలో ‘దళితులపై దాడులు-పరిష్కారం’ అనే అంశంపై సదస్సు నిర్వహిస్తామన్నారు. దీనికి సంబంధించిన కరపత్రాలను శుక్రవారం సాయంత్రం స్థానిక కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా రమేష్‌బాబు మాట్లాడుతూ ఆర్టికల్ 32 ప్రకారం రాజ్యాంగం అనేది ఆదివాసీలకు ఆత్మలాంటిదని అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో ఎస్సీ,ఎస్టీలపై అనేక రకాల దాడులు, అవమానాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని రమేష్‌బాబు మండిపడ్డారు. జిల్లాలో గల దళిత, గిరిజనులు, ప్రగతిశీల శక్తుల, మేధావులు ఈ సదస్సుకు హాజరై దళతులపై దాడులకు పరిష్కారం సూచించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాటసమితి నెల్లిమర్ల కన్వీనర్ సీర పెంచలయ్య, విజయనగర, గజపతినగరం నియోజకవర్గాల కన్వీనర్లు గోకా కోటేశ్వరరావు, పొగిరి గౌరి తదితరులు పాల్గొన్నారు.
===========