విజయనగరం

బీజేపీని భూస్ధాపితం చేస్తామనడం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, నవంబర్ 16: ఇరవై ఏళ్లుపాటు బీజేపీలో రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలకంగా ఉన్న గోపాలరాజు పార్టీని వీడి టీడీపీలో చేరి పార్టీపై బురద జల్లే వాఖ్యలు చేయడం తగదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవర ఈశ్వరరావు అన్నారు. శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో టీడీపీలో చేరి అక్కడ ఇమడలేక పార్టీలో చేరి ఇపుడు అదే పార్టీలోకి మారిన వ్యక్తి పార్టీ ద్రోహం చేసిందని చెప్పడం దారుణమన్నారు. టీడీపీలో చేరడానికి గోపాలరాజు బస్సులలో అమరావతికి వెళ్లారని ఇది విహారయాత్ర అని ఎద్దేవా చేశారు. పార్టీని అడ్డం పెట్టుకొని తన పబ్బం గడుపుకోడానికి పార్టీకి వెన్నుపోటుపొడిచారని విమర్శించారు. . ప్రధానిమంత్రి అవాస్ యోజన ఇళ్లు, మరుగుదొడ్లు నిర్మాణాలలో భారీగా అవినీతి చోటుచేసుకున్నదని అది త్వరలోనే ఆధారాలతో బయట పెడతామని తెలిపారు. భారతీయ జనతాపార్టీ బలం చూసి ఓర్వలేక గోపాలరాజు రాజీనామా చేశారని ఆరోపించారు. ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూసి సహించలేక పార్టీకి దూరమైనట్లు చెప్పారు. గోపాలరాజు మళ్లీ టీడీపీలో కలిసినందున తమ పార్టీకి నష్టం లేదన్నారు. సమావేశంలో స్వచ్చ్భారత్ జిల్లా అధ్యక్షుడు ఆరిశెట్టి రామకృష్ణ, బీజేపీ నాయకులు ఎం ఎస్ ఎన్ రాజు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
=============
కరువు మండలాలుగా ప్రకటించాలి

దత్తిరాజేరు, నవంబర్ 16: దత్తిరాజేరు మండలాన్ని కరవు మండలంగా ప్రకటించాలని మండలంలోని సరాయివలస గ్రామంలో అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. శుక్రవారం నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో పలు సమస్యలను గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. వరిపంటపై లక్షలాది రూపాయలు అప్పుచేసి పెట్టుబడి పెట్టినా లాభంలేకపోయిందని అన్నారు. ఎంపీడీవొ జి. బాబూరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి పాండురంగ మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా పలు సంక్షేమ పథకాలు మంజూరు అవుతున్నాయని ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామాలలో ఏమైనా సమస్యలు ఉంటే వినతుల ద్వారా తమకు తెలియజేస్తే సంబంధిత అధికారుల ద్వారా అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని అన్నారు. అలాగే పసుపుకుంకుమ కింద మంజూరైన నిధులను అందని యడల సంబంధిత ఎపిఎం దృష్టికి తీసుకువెళ్ళి మంజూరు చేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎపివొ సుందరరావు, ఎపిఎం రమేష్, ఎంఇవొ వెంకటరావు, ఆర్‌డబ్ల్యు ఎస్ జెఇ చంద్రకళ, హౌసింగ్ ఎఇ ఉమామహేశ్వరరావు, విద్యుత్ ఎఇ వరప్రసాద్, ఐసిడిఎస్ సూపరువైజరు శ్యామలత, పిఆర్ జెఇ చంద్రశేఖర్, ఉపాధి హామీ ఏఇ దేముడు తదితరులు పాల్గొన్నారు.
============

మహనీయులను స్మరించుకోవాలి

దత్తిరాజేరు, నవంబర్ 16: ప్రతి ఒక్కరు మహనీయుల త్యాగాలను స్మరించుకుని వారిని పూజించవలసిన అవసరం ఎంతైనా ఉందని గజపతినగరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ విద్యాసాగర్ అన్నారు. శుక్రవారం మండలంలోని ఎస్.బూర్జివలస స్టేషన్‌లో నూతనంగా నిర్మించిన గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
ఎస్.బూర్జివలస పోలీస్ స్టేషన్ బొబ్బిలి ఎ ఎస్పీ గౌతమిశాలి సందర్శించారని ఎస్సై భాస్కరరావు తెలిపారు. ఆమె స్టేషన్‌లో దస్త్రాలు తనిఖీ చేయడంతోపాటు శాంతిభద్రతలపై ఆరా తీశారని అన్నారు. గ్రామంలో ఎటువంటి గొడవలు లేకుండా అల్లర్లు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
=============

మత్తుపదార్థా వాడకంతో
అనర్థాలు

నెల్లిమర్ల, నవంబర్ 16: బాలల వారోత్సవాల్లో భాగంగా స్థానిక ప్రభుత్వజూనియర్ కళాశాలలో నేచర్ కోలాప్ ఆర్గనైజేషన్ సైజ్‌లైన్ 1098 సిబ్బంది ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు వాడడం వలన జరిగిన అనర్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై నారాయణరావు మాట్లాడుతూ మత్తుపదార్థాలు వేసుకోవడం వలన అనేక అనర్థాలు ఉన్నాయని అన్నారు. అలాగే వారి పిల్లలకు కూడా ఇటువంటివి అలవాటు అయ్యే ప్రమాదం ఉందని అన్నారు. గుట్కా, బ్రాంధీ, విస్కీలాంటి పదార్థాలు తీసుకోవడం వలన ఆరోగ్యం చెడిపోతుందని అన్నారు. మత్తుపానీయాలు వాడిన వారు మహిళలను లైంగిక వేదికలకు గురిచేసి శిక్షలు అనుభవిస్తున్నారని అన్నారు. చైల్డ్‌లైన్ సిబ్బంది బాలల హక్కుల రక్షణను రక్షించడమేకాకుండా వారి అభివృద్ధి కూడా దోహదపడతాయని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, ఉన్నత పాఠశాల సిబ్బంది చైల్డ్ కో- ఆర్టినేటర్ రంజిత, కౌన్సిల్ వరలక్షి, తదితరులు పాల్గొన్నారు.
==================

వ్యర్థాలపై నిర్లక్ష్యం తగదు

నెల్లిమర్ల, నవంబర్ 16: నగర పంచాయతీవాసులు వర్థాలపై నిర్లక్ష్యం వహించరాదని కమిషనర్ టి.జయరామ్ అన్నారు. శుక్రవారం పలు వార్డుల్లో కమిషనర్ పర్యటించి పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని, అంతేకాకుండా తడిచెత్త, పొడిచెత్త వేరుచేసి సిబ్బందికి అందించాలని అన్నారు. ఇప్పటికే వ్యర్థాలు చెడిపోవడం వలన విపరీతంగా పెరిగిపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురువుతున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షేన్ ర్యాంకు సాధించడానికి సిబ్బంది, ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మేస్ర్తిలు నాగమధు, చందులు పాల్గొన్నారు.