విజయనగరం

వ్యక్తిగత మరుగుదొడ్లును తప్పనిసరిగా వినియోగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతానగరం, నవంబర్ 19: ప్రజలంతా వ్యక్తిగత మరుగుదొడ్లును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఎంపీడీఓ పైడితల్లి, ఎంఇఓ సూరిదేముడులు కోరారు. ప్రపంచ మరుగుదొడ్లు దినోత్సవం సందర్భంగా మంగళవారం ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఆరుబయట మలవిసర్జన వలన జరిగే అనార్ధాలను ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వం కూడా మరుగుదొడ్లు నిర్మాణాలకు ఆర్థిక సహాయం అందించిందన్నారు. ప్రతీ ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లును మంజూరుచేశామన్నారు. విద్యార్థులు కూడా తల్లిదండ్రులపై వీటిపై అవగాహన కల్పించాలన్నారు.

తహశీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్లు చోరీ
సీతానగరం, నవంబర్ 19: మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్లు చోరీకి గురయ్యాయి. ఈమేరకు ఆదివారం అర్థరాత్రి నూతనంగా నిర్మించిన తహశీల్దార్ కార్యాలయం భవనంపై నుంచి దొంగలు లోపలకు వెళ్లి చోరీకి పాల్పడ్డారని అధికారులు భావిస్తున్నారు. సోమవారం తహశీల్దార్ బాపిరాజు కంప్యూటర్లు చోరీకి గురైన విషయాన్ని ఎస్‌ఐ సాయికృష్ణకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాల మేరకు 2 మోనేటర్లు, ఒక సీపీయు, ఒక ప్రింటర్ చోరీకి గురయ్యాయన్నారు. ఇదే తహశీల్దార్ కార్యాలయంలో రెండవ సారి కంప్యూటర్లు చోరీకి గురవ్వడం విశేషం.

శివనామస్మరణలతో హోరెత్తిన శివాలయాలు
మక్కువ, నవంబర్ 19: కార్తీకమాసం 2వ సోమవారంతోపాటు ఏకాదశి కలిసిరావడంతో శివాలయాలు శివనామస్మరణలతో పోటెత్తాయి. ఈమేరకు ఉదయం వేకువ జాము నుంచే భక్తులు బారులుతీరి విశేష పూజలు, రుద్రాభిషేకాలు చేశారు. అనంతరం స్థానిక ఉన్న విష్ణు ఆలయాలు, జగన్నాథస్వామి ఆలయాలకు వెళ్లి స్వామివార్లను దర్శించారు. అదేవిధంగా ములక్కాయవలసలోని కాశీవిశే్వశ్వరస్వామి ఆలయంలో పూజారి కనకలింగేశ్వర మంత్రోచ్ఛరణల మధ్య విశేష పూజలు, బిళ్వార్చనలు, తదితర వాటిని నిర్వహించారు. అలాగే మక్కువలోని శాంతేశ్వరం, బీమలింగేశ్వరస్వామి,భ్రమరాంభిక మల్లిఖార్జున ఆలయాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కమిటీ సభ్యులు తగు ఏర్పాట్లు చేశారు.

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు
మక్కువ, నవంబర్ 19: మద్యం సేవించి వాహనాలను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ కృష్ణమోహన్ తెలిపారు. సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్ సమీపంలో వాహనాలను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు వాహనాలను నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలన్నారు. అలాగే డ్రైవర్లు లైసెన్స్‌లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఇటీవల జరిగిన మావోయిల దాడుల వలన వాహనాల తనిఖీలను ముమ్మరంగా చేపడుతున్నామన్నారు. ఈ తనిఖీలో పోలీస్ సిబ్బంది, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో దీపారాధనలు
గుమ్మలక్ష్మీపురం, నవంబర్ 19: కార్తీక ఏకాదశిని పురస్కరించుకుని మండలంలోని పలు ఆలయాల్లో మహిళలు భక్తిశ్రద్ధలతో దీపారాధనలు చేశారు. ఈ కార్యక్రమానికి సమీప గ్రామాలనుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై దీపాలను వెలిగించి శివునికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మండలంలోని గుమ్మ, తాటిశిల, కేదారిపురం, తాడికొండ గ్రామాల్లో దీపారాధన కార్యక్రమాలను చేపట్టారు.