విజయనగరం

దిగని వట్టిగెడ్డ రిజర్వాయర్ కుడి కాలువ షట్టర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జియ్యమ్మవలస, నవంబర్ 19: మండలంలో గల రావాడ వట్టిగెడ్డ రిజర్వాయర్ కుడి కాలువ షట్టర్లు కిందకు దిగకపోవడంతో వృధాగా నీరు పోతుంది. అంతేకాకుండా రేపోమాపో కోతకు సిద్ధంగా ఉన్న వరి చేళ్లు నీటిలో మునిగిపోతున్నాయి. పంటను కోయలేక, ఉంచలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల వట్టిగెడ్డ రిజర్వాయర్‌లో 399 అడుగులకు మించి నీరు చేరడంతో ప్రధాన షట్టర్లను ఎత్తివేయడమే కాకుండా కుడి, ఎడమ ప్రధాన కాలువ షట్టర్లను ఎత్తివేశారు. అయితే నీరు తగ్గిన తరువాత ప్రధాన షట్టర్లను కిందకు దించివేశారు. అలాగే ఎడమ కాలువ షట్టర్లను కూడా దించివేశారు. కుడి కాలువ షట్టర్లు మాత్రం కిందకు దిగకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. గత 15రోజులుగా నీరు వృధాగా పోతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీరు రిజర్వాయర్‌లో ఉండటంతో రబీ సీజన్‌లో వరి పంట పుష్పలంగా పండించుకోవచ్చునని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్న సమయంలో ఈ విధంగా నీరు వృధాగా పోవడం విచారించదగ్గ విషయమని ప్రజలు అంటున్నారు. ఈ విషయమై ఇరిగేషన్‌శాఖ ఏఇ జివి రఘువద్ద ప్రస్తావించగా ఇటీవల నీరు అధికంగా రావడంతో షట్టర్లను ఎత్తినప్పుడు గొలుసులు తెగిపోవడంతో ఇప్పుడు షట్టర్లు కిందకు దిగడం లేదని, రెండు రోజులలో మరమ్మతులు చేపట్టి కిందకు దించుతామన్నారు.
మహిళలు ఐక్యమత్యంతో అభివృద్ధి సాధించాలి
రామభద్రపురం, నవంబర్ 19: మహిళలు ఐక్యమత్యంతోనే అన్ని రంగాల్లో అభివృద్ధిసాధించాలని మారుతీకాలనీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జానకీ తెలిపారు. గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలు అన్నిరంగాల్లో పోటీపడుతున్నారన్నారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు, విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించి విజేతలైన వారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రాములమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.
జనసేన పార్టీతోనే రాష్ట్భ్రావృద్ధి
రామభద్రపురం, నవంబర్ 19: రానున్న రోజులలో జనసేన పార్టీకి ప్రజలు తమవంతు మద్ధతు తెలపాలని బొబ్బిలి జనసేన పార్టీ కన్వీనర్ గిరడ అప్పలస్వామి కోరారు. సోమవారం మండల పరిధిలోని ఆరికతోట గ్రామంలో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేనపార్టీకి ప్రజలంతా ఒక అవకాశం ఇవ్వాలని, నీతివంతమైన పాలనకు పవన్‌కళ్యాణ్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యంగా కులాలు, మతాలకు అతీతంగా జనసేన పార్టీ రాష్ట్భ్రావృద్ధికి కృషి చేస్తుందన్నారు. అవినీతిలేని పాలన అందించడమే పవన్ ఉద్ధేశ్యమన్నారు. యువతతోపాటు మహిళలను కూడా అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలన్న ఉద్ధేశ్యంతో జనసేన ప్రణాళిక రూపొందిస్తుందన్నారు. మహిళలకు 33శాతం రాజకీయ రిజర్వేషన్లు, బీసీలకు 5వరకు రాజకీయ రిజర్వేషన్లు పెంపు, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు వసతి గృహాలు, తదితర కార్యక్రమాలకు జనసేన పార్టీ శ్రీకారం చుట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఫైబర్‌గ్రిడ్‌కు సహకరించాలి
సీతానగరం, నవంబర్ 19: మండలంలోని కేబుల్ నెట్ వర్క్ ద్వారా ఫైబర్‌గ్రిడ్ అమలుచేసేందుకు కేబుల్ ఆపరేటర్లు సహకరించాలని ఎంపీడీఓ పైడితల్లి కోరారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం కేబుల్ ఆపరేటర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మండలంలో అన్ని గ్రామాల్లో కూడా ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రజలందరికీ ఇంటర్నెట్ కనెక్షన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఈ కార్యక్రమాన్ని మండలంలో విజయవంతం చేసేందుకు అధికారులు కూడా సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈమేరకు కేబుల్ ఆపరేటర్లు వారు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ విస్తరణాధికారి పార్ధసారధి, మండల పరిషత్ పర్యవేక్షకులు పార్వతీశ్వరరావు, కేబుల్ ఆపరేటర్లు, పంచాయతీ సెక్రటర్లు పాల్గొన్నారు.