విజయనగరం

ఉపాధి హామీ వేతనాలు ఇప్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం, నవంబర్ 19: పార్వతీపురం డివిజన్‌లోని ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు వేతనాలు అందించాలని కోరుతూ ఆ ప్రాంత ప్రజలు సోమవారం ఆర్డీవో బి.సుదర్శనదొర ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్సులోకోరారు. అదేవిధంగా మక్కువ ప్రజలు భూమి సాగుపట్టాలు ఇప్పించాలని, పార్వతీపురం మండలంలోని బంటువానివలస గ్రామస్థులు ఇంటి స్థలాల పట్టాలు ఇప్పించాలని కోరారు. అదేవిధంగా పార్వతీపురం ఎస్సీ కాలనీలో ఎస్ డబ్ల్యు ప్రాథమిక పాఠశాలకు తాగునీటి సదుపాయం కల్పించాలని కోరారు. ఇంకా పలు గ్రామాల ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని వినతులు అందించారు.

తుపాను బాధితులకు సామగ్రి పంపిణీ
పార్వతీపురం, నవంబర్ 19: గుంటూరుకు చెందిన దళిత బహుజన రిసోర్సు సెంటర్ ఆధ్వర్యంలో తిత్లీ తుపాను బాధితులకు సోమవారం ఐటిడిఎ కార్యాయంలో పీవో డాక్టర్ జి.లక్ష్మీశ చేతులు మీదుగా తమ వంతు సాయంగా వస్తుసామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్వతీపురం మండలం, ములగకు చెందిన 5గురు బాధితులకు టవల్స్, దుప్పట్లు, బెడ్‌సీట్లు, బకెట్లు, సబ్బులు తదితర సామగ్రిని అందించారు. ఈకార్యక్రమంలో డిబి ఆర్ సి సంస్థ చెందిన దేవకుమార్, డి ఎం డబ్ల్యు ఎస్ కు చెందిన ఎల్.శాంతి, లక్ష్మున్నాయుడు, ఎండబ్ల్యు ఎస్ పుప్పరావు తదితరులతో పాటు పార్వతీపురం మండల సీనియర్ అసిస్టెంట్ హేమ తదితరులు పాల్గొన్నారు.

ఆధ్యాత్మికతకు సంతరించుకున్న వైష్ణవాలయాలు
సాలూరు, నవంబర్ 19: కార్తీకశుద్ధ ఏకాదశి సోమవారాన్ని పురస్కరించుకుని పలు వైష్ణవాలయాలు ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి. ఈమేరకు వేణుగోపాలస్వామివారి దేవస్థానంలో సోమవారం అర్థరాత్రి 12గంటల నుంచే భక్తులు వేల సంఖ్యలో హాజరై క్యూలైన్లో బారులుతీరారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు మంచినీటి సౌకర్యం కల్పించారు. ఆలయ అర్చకులు పి శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి, లక్ష్మీ, అలివేలుమంగా సమేత శ్రీవెంకటేశ్వరస్వామికి సహస్ర పూజలు, తులసీదళ పూజలు, క్షీరాభిషేకాలు, విష్ణునామ పారాయణలు చేపట్టారు. ఇందులో భాగంగా గోదావరి ఖని సంగీత కళాశాల ప్రిన్సిపల్ కె రంగాచార్యుల బృందం, రామతీర్థాలకు చెందిన మృదంగ విద్వాంసులు శివకుమార్, వయోలిన్ విద్వాంసులు కె విజయలక్ష్మి, సంగీత విద్వాంసులు పి అంజలి, ప్రియాంకలు ఆలపించిన అన్నమయ్య, త్యాగరాజ కీర్తనలు వేలాదిమంది భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమంలో ఇఓ కెవిరమణ, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు వాడాడ శోభారాణి, సాంబమూర్తి, జి శంకరరావు, అప్పారావు, నయిన హరిరెడ్డిలు పాల్గొన్నారు.

పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్‌లు పంపిణీ
సాలూరు, నవంబర్ 19: మాజీ మున్సిపల్, రెవెన్యూ అధికారి కురిమెళ్ల వెంకటరావు 10వ వర్థంతి సందర్భంగా ఆయన కుమారులు పేద విద్యార్థులకు బ్యాగ్‌లను పంపిణీ చేశారు. మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ జర్జాపు ఈశ్వరావు, ప్రముఖ వ్యాపారవేత్త ఆరిశెట్టి గున్నయ్యగుప్త చేతుల మీదుగా పంపిణీ చేశారు. నాయుడువీధిలోని నీడ్ స్వచ్చంద సంస్థ నిర్వహిస్తున్న బాల కార్మిక పాఠశాల విద్యార్థులకు అన్నసమారాధన చేపట్టారు. ఏటా ఆయన కుమారులు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం మంచిదేనని మాజీ ఛైర్మన్ ఈశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో నీడ్ డైరెక్టర్ వేణుగోపాలరావు, తదితరులు పాల్గొన్నారు.