విజయనగరం

శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో పోటెత్తిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం, నవంబర్ 19: కార్తీక ఏకాదశి పర్వదినం సందర్భంగా పార్వతీపురంలోని శ్రీసత్యనారాయణ స్వామి ఆలయంలోస్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజుగా పరిగణించే అవకాశం అరుదుగా రావడంతో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకునేందకు ఆదివారం రాత్రి 12గంటల నుండి భక్తులు పోటెత్తారు. ఆలయంలోని శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాలను కూడా నిర్వహించడంతో భక్తులు ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు దాదాపు అరకిలోమీటర్ దూరంలో గల రెండలైన్లలో సాయంత్రం వరకు క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు తగిన ప్రసాదములు కూడా ముందుగా ఏర్పాటు చేయలేక ఆలయ అధికారులు వైఫల్యం చెందడంతో భక్తులు ప్రసాదాలు కౌంటర్ల వద్ద ఇబ్బందులకు గురయ్యారు.
శివాలయాలకు పోటెత్తిన భక్తులు
పార్వతీపురం, నవంబర్ 19: శివ, కేశవుల పర్వదినం ఒకే రోజున కార్తీక మాసం సోమవారం వచ్చినందున శివాలయాల్లోను కూడా భక్తులు ఆదివారం వేకువ జామునుండి భక్తులు పరమశివుని దర్శించుకునేందుకు శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ఈసందర్భంగా పార్వతీపురం ఉమా,రామలింగేశ్వరస్వామివారి ఆలయంతో పాటు ఉమా, మార్కెండేయస్వామివారి ఆలయం, శ్రీశ్రీశ్రీ భ్రమరాంభికామల్లికార్జున స్వామివారి ఆలయంతో పాటు అడ్డాపుశీలలో శ్రీ కాశీ విశే్వశ్వరస్వామివారి ఆలయంలోను, ఇంకా పలు ప్రాంతాల్లోని శివాలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తి పరమశివున్ని దర్శించుకుని భక్తులు ఆశీస్సులు పొందారు.

తాగునీటి సమస్యలు పరిష్కరించండి
పార్వతీపురం, నవంబర్ 19: తమ గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం పార్వతీపురం ఐటిడి ఎ కార్యాలయంలోని పీవో డాక్టర్ జి.లక్ష్మీశ నిర్వహించిన గ్రీవెన్సులో జియ్యమ్మవలస మండలంలోని చాపరాయిబిన్నిడి పంచాయతీ కందుకుప్ప గ్రామస్థులు పీవోను కోరారు. అందువల్ల సోలార్ విద్యుత్‌తో తాగునీటిని అందించాలని వేడుకున్నారు.సాలూరు మండలంలోని పణుకువలస గిరిజనులు తమ గ్రామానికి సిమెంట్ రోడ్డునిర్మించాలని కోరారు. పార్వతీపురం మండలంలోని గంగాపురం పంచాయతీ తొక్కుడువలసకు వాటర్‌టాంకు మంజూరు చేయాలని కోరారు. జియ్యమ్మవలస మండలంలోని ద్రాక్షిణి నుండి చినదోడిజకు రహదారి నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో ఎపివో సురేష్‌కుమార్, జిల్లా గిరిజన సంక్షేమశాఖాధికారి పెద్దింటి కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మరుగుదొడ్లపై అవగాహన ర్యాలీ
పార్వతీపురం, నవంబర్ 19: మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు వాడకంపై ప్రజల్లో ఇంకా అవగాహన మరింత పెంచాల్సిన ఆవశ్యకత ఉందని పార్వతీపురం ఐటిడి ఎ ప్రాజెక్టు అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. సోమవారం స్థానిక ఐటిడి ఎ ప్రాంగణంలో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా సందర్భంగా జండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిడిపీవో విజయగౌరి, పార్వతీపురం ఎంపిడివో కెల్ల కృష్ణారావు, ఐటిడి ఎ అధికారులు, ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.