విజయనగరం

కరవుజిల్లాగా ప్రకటించాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), నవంబర్ 19: విజయనగరం జిల్లాను కరవుజిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ మాట్లాడుతూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో అన్నిపంటలతోపాటు వరిపంట కూడా ఎండిపోయిందని తెలిపారు. అందువల్ల జిల్లాలో 34 మండలాలను కరవుమండలాలుగా ప్రకటించి కరవుసహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే జిల్లాలో 50వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని. సుమారు 630 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. పంటనష్టపోయిన రైతులకు ఎకరాకు 30వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ పంటలను వేసుకునేందుకు సబ్సిడీతో కూడిన విత్తనాలు, ఎరువులను అందించి, పాతరుణాలను రద్దు చేసి, కొత్తరుణాలు ఇవ్వాలన్నారు. కరవుపరిస్థితులు దాపురించినందున రైతు, వ్యవసాయ కూలీల వలసలను నివారించేందుకు ఉపాధి హామీపథకం ద్వారా 250 రోజులు పని కల్పించి, రోజుకీ 500 రూపాయల వేతనాలు ఇవ్వాలన్నారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు స్వామినాధన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎండల తీవ్రతను దృష్టి పెట్టుకుని పశుగ్రాసం, మంచినీరు, సాగునీరు కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ మేరకు జిల్లా జాయింట్‌కలెక్టర్ వెంకటరమణారెడ్డికి చేపట్టాలని ఒక వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయకార్యదర్శులు బుగత అశోక్, అలమండ ఆనందరావు, జిల్లా కార్యవర్గసభ్యులు వి.కృష్ణంరాజు, బుగత సూరిబాబు, ఆర్‌విఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి
విజయనగరం (్ఫర్టు), నవంబర్ 19: జిల్లాలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎపి ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం కోరారు. ఈ మేరకు జిల్లావిద్యాశాఖాధికారి నాగమణికి సోమవారం ఒక వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సింహాచలం మాట్లాడుతూ విద్యాశాఖ పరిధిలో ప్రధానంగా ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయుల ఏంటిసిడెంట్స్ పరిశీలన అయిన వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. ఎస్టీ అన్‌ట్రైన్డ్ 2000-2001 బ్యాచ్ అభ్యర్థులకు విద్యాశాఖ కమిషనర్ ఇటీవల జారీచేసిన ఉత్తర్వుల మేరకు అమలు చేయాలని ఆయన కోరారు. టీచర్ల మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను త్వరితగతిన జాప్యం చేయకుండా మంజూరు చేయాలన్నారు. టీచర్ల సర్వీస్ రిజిస్ట్రర్స్ అప్‌డేట్ చేసేందుకు ఆయా మండల విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఈ సమ్యులపై డిఇఓ నాగమణి సానుకూలంగా స్పందించారని సింహాచలం తెలిపారు.

బడుగుజీవుల ఆశాజ్యోతి ఇందిరా
నెల్లిమర్ల, నవంబర్ 19: బడుగుజీవుల ఆశాజ్యోతి ఇందిరాగాంధీ అని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తరగడం రమేష్‌కుమార్ అన్నారు. సోమవారం గుషిని గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఇందిరాగాంధీ 101వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ముందుగా ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం రమేష్‌కుమార్ మాట్లాడుతూ ఇందిరా గాంధీ భారతదేశం గర్వించదగ్గ నాయకురాలు అని అన్నారు. ప్రపంచ దేశాల్లోనే ఉక్కు మహిళగా ఆమె గుర్తింపుపొందారని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీలకు మొట్టమొదట పక్కా గృహనిర్మాణాలు నిర్మించి ఇచ్చిన ఘనత ఇందిరాకే చెందుతుందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు మొయిద సన్యాసిరావు, మండల నాయకులు పి.వైకుంఠం, ఎం.సురేష్, పి. ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

బహిరంగ మలవిసర్జన సాంఘిక దురాచారం
నెల్లిమర్ల, నవంబర్ 19: బహిరంగ మలవిసర్జన సాంఘిక దురాచారమని లెప్రా సొసైటీ కో- ఆర్డినేటర్ రాజు అన్నారు. సోమవారం ప్రపంచ మరుగుదొడ్లు దినోత్సవం సందర్భంగా లెప్రాసొసైటీ వాష్ ప్రాజెక్టు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కో- ఆర్డినేటర్ రాజు మాట్లాడుతూ బహిరంగ మలవిసర్జన సాంఘిక దురాచారమని అన్నారు. ప్రతి ఒక్కరు విధిగా మరుగుదొడ్లు నిర్మించుకోవాలని చెప్పారు. స్వచ్ఛతను పాటించి భవితకు బాటలు వేయాలని అన్నారు. కార్యక్రమంలో కమ్యూనిటీ మొబలైజర్ వెంకటరమణ, కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.

చేతివృత్తుల వారిని అన్ని విధాల ఆదుకుంటాం
* ఎమ్మెల్యే డాక్టర్ కె. ఎ.నాయుడు
గజపతినగరం, నవంబర్ 19: చేతి వృత్తుల వారిని అన్ని విధాలా ఆదుకునే ప్రభుత్వం తమదేనని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కె. ఎ.నాయుడు అన్నారు. సోమవారం ఎమ్మెల్యే నాయుడు వివిధ చేతివృత్తుల దారులకు సంబంధించిన కుట్టుమిషన్లు, వాషింగ్ మిషన్లు, సైకిళ్ళు తదితర పరికరాలను గజపతినగరంలో పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేవలం పదిశాతం లబ్దిదారులు చెల్లిస్తే ప్రభుత్వం 90శాతం భరించి పరికరాలు అందజేసి చేతి వృత్తుల దారులను ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆర్థికంగా కేంద్రం సహకరించకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు వెనుకంజ వేయకుండా అన్ని వర్గాలకు ఉపాధి చూపడం ఆనందదాయకమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8వేల కోట్లరూపాయలతో ఆదరణ పరికరాల పంపిణీ చేపట్టడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపిపి గంట్యాడ శ్రీదేవి, జడ్పీటీసీలు మక్కువ శ్రీధర్,బండారు బాలాజీ, మార్కెట్ కమిటీచైర్మన్ చంటిరాజు, ఆత్మాకమిటీ చైర్మన్ అట్టాడ లక్ష్మునాయుడు, ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ చైర్మన్ ఎం. వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
ఒకే ఈతలో రెండు జెర్సీ దూడలు
గజపతినగరం, నవంబర్ 19: ఒకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చిన జెర్సీ ఆవు సంఘటన ఎం.వెంకటాపురంలో సోమవారం తెల్లవారు జామున చోటు చేసుకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. గజపతినగరం పంచాయతీ శివారు ఎం.వెంకటాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పి.వి.వి.గోపాలరాజుకు సంబందించిన జెర్సీ ఆవు తెల్లవారు జాము మూడు గంటలకు రెండు ఆడ దూడలకు జన్మనించింది. సాధారణంగా జెర్సీ ఆవులు ఒక ఈతలో ఒక దూడను మాత్రమే జన్మనిస్తుంది. అయితే ఒకే ఈతలో రెండు దూడలకు జన్మనివ్వడం విశేషం. పుట్టిన రెండు దూడలతోపాటు ఆవుకూడా ఆరోగ్యకరంగా ఉన్నాయి. ఈ దూడలను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారు.

శివాలయాలలో కార్తీక ఏకాదశి పూజలు
గజపతినగరం, నవంబర్ 19: మండలంలోని శివాలయాలలో కార్తీక సోమవార ఏకాదశి పూజలు వైభవంగా నిర్వహించారు. కార్తీకమాసం సోమవారంతో పాటు ఏకాదశి కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. గజపతినగరంలోని ఉమారామలింగేశ్వరస్వామి ఆలయానికి తెల్లవారుజాము నాలుగు గంటల నుంచే భక్తులు చేరుకొని ప్రత్యేకపూజలు, అభిషేకాలు జరిపారు. భక్తులు ఓం నమ: శివాయ, ఓం నమ: శివాయ అంటూ హరినామస్మరణతో ఆలయాలను హోరెత్తించారు.
అదే విదంగా ఆవరణలో గల ఈశ్వరుని విగ్రహానికి, రావి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల తాకిడి తీవ్రంగా ఉండడంతో పోలీసుల పహార నిర్వహించాల్శి వచ్చింది. అదే విదంగా పురిటిపెంట గ్రామం పరిధిలో గల మల్లిఖార్జునస్వామి ఆలయానికి భక్తులు తాకిడి ఎక్కువగా ఉంది. అలాగే మండలంలోని అన్ని శివాలయాలు హరినామస్మరణతో మారుమ్రోగాయి.

విద్యార్థులకు ఆదర్శనీయం సాయి
కలెక్టర్ హరిజవహర్‌లాల్
గజపతినగరం, నవంబర్ 19: విద్యార్ధులకు విద్యార్థిని సాయి అదర్శనీయంగా నిలిచిందని కలెక్టర్ హరిజవహర్‌లాల్ అన్నారు. సోమవారం మండలంలోని మరుపల్లి హైస్కూల్‌కు చెందిన పదవతరగతి విద్యార్ధిని సాయికి ఇటీవల దొరికిన బంగారు ఆభరణాలను ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యశోదకు అందజేసి నిజాయితీగా నిలిచింది. ఈ విషయం పత్రికల ద్వారా తెలుసుకొన్న కలెక్టర్ డిఇవొ నాగమణి ద్వారా విద్యార్ధిని సాయిని కలెక్టరేట్‌కు సోమవారం రప్పించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిజాయితీగా బంగారు ఆభరణాలు అప్పగించి విద్యార్ధులకు ఆదర్శంగా నిలిచిదన్నారు. విద్యార్ధులు సాయిని స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు.
ఇటువంటి విద్యార్ధుల వలన మంచి సమాజం ఏర్పడుతుందని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకటరమణారెడ్డి, జిల్లా విద్యాశాఖా అధికారి జి.నాగమణి, హెచ్ ఎం యశోధ తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ పధకాలు ప్రజలలోకి తీసుకెళ్లాలి
గజపతినగరం, నవంబర్ 19: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలను విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్ల వలసిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవర ఈశ్వరరావు అన్నారు. సోమవారం స్ధానిక పార్టీ కార్యాలయంలో మండల స్ధాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మంత్రి ఆవాస్‌యోజన కింద అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా గృహాలను మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. అదే విదంగా గ్రామగ్రామానికి ఎల్ ఇడి వీధిలైట్లుతో పాటు గృహాలకు ఎల్ ఇడి బల్బులు పంపిణీ చేశామన్నారు. సామాజిక పించన్లకు సంబంధించి 70 శాతం నిధులను కేంద్రమే ఇస్తుందని అన్నారు. రానున్న ఎన్నికలలో బీజేపీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని చెప్పారు. ఈ సందర్భంగా 27మందితో మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కమిటీల ఎంపిక పూర్తిచేసి జిల్లా పార్టీకి అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆరిశెట్టి రామకృష్ణ, కొల్లా పైడిశెట్టి, ఎం. ఎస్ ఎన్ రాజు, ఏడుకొండలు, ఎం.్భరతి తదితరులు పాల్గొన్నారు.

శ్మశాన వాటికకు స్ధలాన్ని కేటాయించండి మహాప్రభో!
గజపతినగరం, నవంబర్ 19: మండలంలోని మరుపల్లి గ్రామంలో గల ఎస్సీ, ఎస్టీ రెల్లి కులాలకు శ్మశానవాటిక కోసం స్ధలాన్ని కేటాయించాలని గజపతిగనగరం తహశీల్ధార్ బి.శేషగిరిరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. సోమవారం స్ధానిక తహశీల్ధార్ కార్యాలయంలో గ్రామానికి చెందిన పలువురు కలసి వినతిపత్రాన్ని అందజేశారు. ఎస్సీ, ఎస్టీలు ప్రస్తుతం శ్మశానవాటికగా ఉపయోగిస్తున్న ఎర్రచెరువు వర్షాకాలంలో నీటిలో దిగి మృతదేహాలకు దహన సంస్కారాలు చేస్తున్నామని వివరించారు. అలాగే ప్రస్తుతం శ్మశానవాటిక స్ధలాన్ని గ్రామానికి చెందిన కొంతమంది ఆక్రమించారని ఆరోపించారు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఆక్రమణలు తొలగించి శ్మశానానికి స్ధలాన్ని కేటాయించడంతోపాటు షెడ్డు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో సర్వేయర్ రాజు, గ్రామస్ధులు వెంకటేష్, సీతారాం, గౌరి తదితరులు పాల్గొన్నారు.

హరినామస్మరణతో మారుమ్రోగిన శివాలయాలు
బొండపల్లి, నవంబర్ 19: మండలంలోని శివాలయాలు హరినామస్మరణతో మారుమ్రోగాయి. శివకేశవలకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీకమాసం. ఈ మాసంలో రెండవ సోమవారంతోపాటు ఏకాదశి కావడంతో మండలంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి బొండపల్లి, రాచకిండాం, దేవుపల్లి, గొట్లాం తదితర గ్రామాలలో నెలకొన్న దేవాలయాలలో శివునికి అభిషేకాలు, పూజలు నిర్వహించి భక్తులు మొక్కలు తీర్చుకొన్నారు. బొండపల్లి పంచాయతీ శివారు గెద్దపేట గ్రామంలో గల మల్లిఖార్జున మాధవలింగేశ్వరస్వామి ఆలయంలో బొండపల్లి ఎస్‌ఐ పూడి వరప్రసాదరావు, త్రివేణి దంపతులతోపాటు జిల్లా సహకార బ్యాంకు అధికారి బి.లక్ష్మణరావు, గజపతినగరం శాఖ మేనేజర్ హరికేశరావులకు అర్చకులు గంట్ల ప్రవీన్‌కుమార్ ప్రత్యేకపూజలు చేపట్టారు. ఈ సందర్భంగా లచ్చిరెడ్డి అచ్చంనాయుడు కుటుంబం సమారు మూడువేలమందికి అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అసౌకర్యం లేకుండా తగిన ఏర్పాట్లు చేశారు.