విజయనగరం

సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెర్లాం, నవంబర్ 21: డిసెంబర్ 2వ తేదీ నిర్వహించనున్న సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీవెంకటేశ్వర విద్యాసంస్థల ప్రిన్సిపల్ జి రామకృష్ణనాయుడు కోరారు. బుధవారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ జూనియర్ కళాశాలను ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తికానున్న నేపథ్యంలో కళాశాల పరిధిలో గల 56 ఉన్నత పాఠశాలలకు చెందిన 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్టులను నిర్వహించనున్నామని, గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేయనున్నామన్నారు. 4రోజుల పాటుజరిగే ఈ పరీక్షలలో 58 పాఠశాలలకు చెందిన 600మంది విద్యార్థులు హాజరుకానున్నారన్నారు. ఒక్కొక్క పాఠశాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించనున్నామన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి గనులశాఖామంత్రి సుజయ్‌కృష్ణరంగారావు, జిల్లాకలెక్టర్, డీఇఓలు రానున్నారన్నారు. ఈ సమావేశంలో డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ సిహెచ్ మంగరత్నం, వైస్ ప్రిన్సిపల్ తెంటు రామారావు, ప్రిన్సిపల్ వెంకటేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.
హాస్టల్లో విద్యార్థులు పరిశుభ్రతను పాటించాలి
తెర్లాం, నవంబర్ 21: ప్రభుత్వ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని తెర్లాం పిహెచ్‌సీ వైద్యాధికారి రెడ్డి రవికుమార్ కోరారు. ఎస్సీ, బీసీ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు బుధవారం వైద్య తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా వైద్యాధికారి రెడ్డి రవికుమార్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేవిధంగా సంబంధిత వసతి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ ఒక్క విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలన్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఉన్నత చదువులను అభ్యసించవచ్చునన్నారు. ఈమేరకు 120మందికి వైద్యతనిఖీలు నిర్వహించగా అందులో 8మందికి చర్మవ్యాదులు ఉన్నట్లు గుర్తించామన్నారు. అనంతరం వారికి ఉచితంగా మందులను కూడా అందించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ గంగునాయుడు, వైద్యారోగ్య సిబ్బంది, సంక్షేమ అధికారులు బి సింహాచలం, టి సింహాచలంలు పాల్గొన్నారు.
పెండింగ్‌లో ఉన్న కాస్మోటిక్ చార్జీలను అందించాలి
తెర్లాం, నవంబర్ 21: గత 6నెలలుగా బకాయిపడ్డ కాస్మోటిక్ నిదులను తక్షణమే విడుదల చేయాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా నాయకులు రాజేష్ డిమాండ్ చేశారు. ఈమేరకు బీసీ హాస్టల్ సమీపంలో బుధవారం రోడ్డుపై బిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 6నెలలుగా ప్రభుత్వం అందించాల్సిన కాస్మోటిక్ చార్జీలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కాస్మోటిక్ నిదులను పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం బీసీ హాస్టల్ నుంచి తెర్లాం గ్రామం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో హాస్టల్స్ విద్యార్థులు పాల్గొన్నారు.

రమ్య మృతిపై విచారణ చేపట్టాలి
తెర్లాం, నవంబర్ 21: తమ చెల్లి రమ్య మృతిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని మృతిరాలి అక్క గంట సింహాచలం బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోమటిపల్లి గ్రామానికి చెందిన రమ్యకు సతివాడ గ్రామానికి చెందిన బలగ రాయుడుకు గత 17 ఏళ్లక్రితం వివాహం జరిగిందని, అయితే కొంతకాలం బాగానే ఉండేవారని, ఇటీవల రాయుడుకు వీఆర్‌ఏ నుంచి వీఆర్‌ఓగా పదవి వచ్చిందని, అప్పటి నుంచి ఆమెను తీవ్రంగా హింసేవాడన్నారు. అయితే ఆదివారం బలిజిపేట గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతిచెందని మృతదేహానికి పోస్టుమార్టం, ఖననం చేసిన తరువాత తమకు సమాచారని అందించారని సింహాచలం తెలిపిందన్నారు. తన చెల్లి మరణం రోడ్డు ప్రమాదం కాదని, తన మరిది రాయుడుపై అనుమానం ఉందని, వెంటనే దర్యాప్తు చేపట్టాలని ఫిర్యాదు చేసిందని ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు. సింహాచలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు ేయనున్నామన్నారు.

నవరత్నాలపై ప్రజలను ఆదుకుంటా
జియ్యమ్మవలస, నవంబర్ 21: రాబోవు ఎన్నికల్లో వైఎస్సార్ పార్టీ అఖండ మెజార్టీ సాధించడం ఖాయమని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత నవరత్నాల పథకాలతో ప్రజలను ఆదుకుంటానని రాష్ట్ర వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం దాసరిపేట జంక్షన్ నుంచి ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర చినమేరంగి, అల్లువాడ, తుంబలి, జోగులడుమ్మ గ్రామాల మీదుగా శిఖబడి క్రాస్ రోడ్డు వరకు కొనసాగింది. ఈ పాదయాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున వైఎస్ జగన్‌కు సమస్యలను విన్నవించారు. సాక్షరాభారతి కో- ఆర్ఢినేటర్లుగా 20 సంవత్సరాలు పనిచేశామని, అకస్మాతుగా తమను ప్రభుత్వం తొలగించిందని జగన్‌కు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలలో లింక్ వర్కర్లుగా అనేక సంవత్సరాలు పనిచేశామని, ప్రభుత్వం అర్థాంతరంగా తమను తొలగించిందని లింక్‌వర్కర్లు జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే అల్లువాడ గ్రామంలో రక్షిత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు కావస్తున్న చుక్క నీరైన రావడం లేదని గ్రామస్థులు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు ఉన్నప్పటికీ ఎన్‌టిఆర్ గృహ నిర్మాణాలు మంజూరు చేయడం లేదని గంగమ్మపేట, చినతుంబలి గ్రామస్థులు జగన్‌కు విన్నవించారు.