విజయనగరం

శ్రీనివాస డిగ్రీ కళాశాల విద్యార్థికి పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూసపాటిరేగ, నవంబర్ 21: పూసపాటిరేగ శ్రీనివాస డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థి అప్పలనర్సయ్యకు వక్త 2018కు ఉపన్యాస నైపుణ్యాల పోటీల్లో జిల్లా స్థాయి పురస్కారం దక్కింది. జిల్లా స్థాయి అంతర్ కళాశాల విద్యార్థుల ఉపన్యాస నైపుణ్య పోటీలు విజయనగరం గురజాడ పాఠశాలలో బుధవారం జరిగాయి. ఈ పోటీలను జనవిజ్ఞాన వేదికలో జరుగ్గా పోటీల్లో పాల్గొన్న అప్పలనర్సయ్యకు జిల్లా స్థాయి పురస్కారం దక్కగా ఇదే కళాశాలకు చెందిన కుసుమ, శ్రీను, పైడిరాజు, వెంకటేష్‌లకు కూడా ధృవీకరణ పత్రాలు జేవిజి నాయకులు డాక్టర్ కృష్ణాజీ, అప్పలనాయుడు, లక్ష్మణరావు, సత్యనారాయణ, రాజశేఖర్ చేతులుమీదుగా అందుకున్నారు. విద్యార్థులు ప్రతిభ కనబరచడంపై శ్రీనివాస విద్యా సంస్థల అధినేత పతివాడ రేణుక, రమణలు అభినందించారు. భవిష్యత్‌లో కూడా మరిన్ని పురస్కారాలు వరించేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.

రక్తదానం.. మరొకరికి ప్రాణదానం
బొబ్బిలి(రూరల్), నవంబర్ 21: రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావడం ఎంతో అభినందనీయమని మండలం కోడి రామ్మూర్తి వ్యాయామ కళాశాల కరస్పాండెంట్ ఆర్ చంద్రశేఖర్ అన్నారు. కోడి రామ్మూర్తి వ్యాయామ కళాశాలలో బుధవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం వలన మరొకరి ప్రాణాలను కాపాడవచ్చునని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆరోగ్యంగా ఉన్నవారు రక్తాన్ని ఇచ్చేందుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. ఎంతోమంది నిరుపేద రోగులు రక్తహీనతతో మృత్యువాత పడుతున్న విషయం విధితమేనన్నారు. అటువంటి వారిని ఆదుకోవడానికి ఇటువంటి శిబిరాలు ఎంతో దోహదపడతాయన్నారు. అనంతరం ఏఓ బి ఆనంద్ మాట్లాడుతూ యువతీయువకులు రక్తాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చారని, రక్తదానం చేయడంపై ఉన్న అపోహాలను తొలగించుకోవాలన్నారు. ఆరోగ్యవంతులు ఏడాదిలో నాలుగు పర్యాయాలు రక్తాన్ని దానం చేయవచ్చునన్నారు. ఈమేరకు విజయనగరం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో డాక్టర్ హర్ష, ఏపీఆర్‌ఓ రాముల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 50మంది యువతీయువకులు రక్తదానానికి ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పోలినాయుడు, రిటైర్డ్ ఏపీఎంఓ పైడితల్లి, కళాశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

రమణమహార్షి ఆశ్రమంలో ఘనంగా కార్తీకమాస పూజలు
బొబ్బిలి(రూరల్), నవంబర్ 21: మండల పరిధిలో ఉన్న కలువరాయి రమణమహార్షి ఆశ్రమంలో కార్తీకమాస పూజలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈమేరకు ఆ సంఘం అధ్యక్షులు పరాశర ఎం నరసింహాం మాట్లాడుతూ ప్రతీ ఏటా కావ్యకంఠ శ్రీ వాశిష్ట గణపతి ముని జయంతి వేడుకలను కార్తీకమాసంలో నిర్వహించడం పరిపాటిగా వస్తుందని, దీనిని పూర్తిస్థాయిలో చేపట్టడం జరుగుతుందన్నారు. కార్తీకమాసం పూర్తయ్యేవరకు నిత్య పూజలు, గణపతి హోమాలు, రుద్రాభిషేకాలు, తదితర వాటిని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాలకు కలువరాయి గ్రామంతోపాటు కోమటిపల్లి, లింగంవలస, వాకాడవలస, చింతాడ, రాముడువలస, తదితరగ్రామాల నుంచి ప్రతీ రోజు అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారన్నారు. అదేవిధంగా అయ్యప్పస్వాములు కూడా పూజలలో పాల్గొంటున్నారన్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామన్నారు. వీటిని భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా శుక్రవారం భారీస్థాయిలో కార్తీక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

గ్రామాల్లో సక్రమంగా సర్వే నిర్వహించాలి
బొబ్బిలి(రూరల్), నవంబర్ 21: గ్రామాల్లో సీఆర్‌పీలు సక్రమంగా సర్వే నిర్వహించాలని సిహెచ్ బొడ్డవలస గ్రామ మాజీ సర్పంచ్ సిహెచ్ రామకృష్ణ అన్నారు. ఈమేరకు బొడ్డవలస గ్రామంలో బుధవారం గ్రామసభను నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరు నెలలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సర్వే చేపట్టడం జరుగుతుందన్నారు. అయితే క్లస్టర్ రిసోర్స్‌పర్సన్లు ఇంటింటికి వెళ్లి పూర్తిస్థాయిలో వివరాలు సేకరించాలని, అందుకు ప్రజాప్రతినిదులు, ప్రజలు, అదికారులు సహకరించాల్సి ఉంటుందన్నారు. ఏమైన లోటుపాట్లు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈసందర్భంగా సీసీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఉపాధి హామీపథకం, ఇందిరాక్రాంతి పథం, గృహనిర్మాణాలతోపాటు పంచాయతీరాజ్, మండల పరిషత్, ఆర్‌డబ్ల్యు ఎస్, తదితర కార్యాలయాల ద్వారా మంజూరైన వివిధ అభివృద్ధి పనులపై సర్వే చేపడుతున్నామన్నారు. పనులకు సంబంధించి ఏ మేరకు నిదులు మంజూరయ్యాయి, ఖర్చు తదితర వివరాలను సేకరించనున్నామన్నారు. సభలు పూర్తయిన వెంటనే మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ప్రజావేదిక నిర్వహించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు కామేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.