విజయనగరం

విద్యాప్రగతికి ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొండపల్లి, నవంబర్ 21: విద్యార్థుల ప్రగతికి ప్రతి ఒక్కరు ప్రోత్సాహం అందించాలని స్థానిక మండల విద్యాశాఖాధికారి కూనిబిల్లి సింహాచలం అన్నారు. బుధవారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో 12 పాఠశాలలకు చెందిన 36మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెంటాడ మండలం పోరాం ప్రాథమిక పాఠశాలలో ఉపాద్యాయుడుగా పనిచేస్తున్న కొల్లా వెంకటరాజు ఈ నెలాఖరున పదవి విరమణ పొందనున్నారని, వీరి ప్రోత్సాహంతో నాలుగు మండలాల్లో మండల స్థాయి క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. ఈనెల 30న మెంటాడ మండలంలో నాలుగు మండలాల స్థాయిలో విధులు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామని అన్నారు.
===========

ఎక్సైజ్ దాడుల్లో నలుగురి అరెస్టు
గజపతినగరం, నవంబర్ 21: గజపతినగరం ప్రొహిబిషన్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో వివిధ గ్రామాల్లో నిర్వహించిన దాడుల్లో నలుగురు వ్యక్తులను అరెస్టు చేశామని సిఐ జిఎస్ రాజశేఖర్ నాయుడు బుధవారం విలేఖరులకు తెలిపారు. సర్కిల్ పరిధిలో సీతారాంపురం, మధుపాడ, బోజరాజపురం, ఆండ్ర గ్రామాల్లో మద్యాన్ని విక్రయిస్తున్న బైరెడ్డి నారాయణమ్మ, వలిరెడ్డి అప్పలనాయుడు, సారిపల్లి రాములు, కొల్లా సూర్యారావులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 57మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ దాడిలో ఎస్సైలు జి.మాన్యాలు, జి.గోవిందరాజు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
=========

పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం సాధ్యం
గజపతినగరం, నవంబర్ 21: పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం సాధ్యపడుతుందని రెడ్‌క్రాస్ సంస్థ నోడల్ అధికారి పద్మనాభరాజు అన్నారు. బుధవారం గజపతినగరంలోని శ్రీకృష్ణా విద్యపీఠ్‌కు చెందిన రెడ్‌క్రాస్ విద్యార్థులు స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అదే విధంగా సమాజంలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు మోయినుద్దీన్ పి.గౌరినాయుడు, విద్యార్థులు పాల్గొన్నారు.
==========

ప్రజారోగ్య పరిరక్షణే థ్యేయం
దత్తిరాజేరు, నవంబర్ 21: ప్రజారోగ్య పరిరక్షణే థ్యేయంగా వైద్య సిబ్బంది పనిచేయాలని జిల్లా అదనపు వైద్య ఆరోగ్య అధికారిణి పద్మజా అన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించి సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. రోగులకు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎ ఎన్ ఎలు, ఆశాకార్యకర్తలు సమావేశం నిర్వహించారు. గ్రామాలలో వ్యాధులు ప్రబలకుండాచూడాలని ఆదేశించారు. గ్రామాలలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి కష్టసుఖాలు తెలుసుకోవాలని అన్నారు. అనంతరం ఆసుపత్రిలో బాలింతలకు బేబీకిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు సత్యనారాయణ, వైద్యాధికారి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
==============

పంటకోత ప్రయోగం ద్వారా దిగుబడులు అంచనా
జామి, నవంబర్ 21: సమగ్ర పోషక యాజమాన్యంలో భాగంగా బుధవారం మండలంలోని జాగరం, జామి, మొకాసకొత్తవలస గ్రామాల్లో పంటకోత ప్రయోగాన్ని నిర్వహించారు. సమగ్ర పోషక యాజమాన్యంలో భాగంగా మండలంలోని ఆరు గ్రామాలను, ఆరుగురు రైతులను, ఆరు పొలాలను ఎంపికచేయడం జరిగిందని తెలిపారు. పంటకోత ప్రయోగానికి సంబంధించి మూడు పొలాలను ఎంపిచేశామని, జాగరం,జామి, మొకాస కొత్తవలస గ్రామాలలో ఈ ప్రయోగం చేయడం జరిగిందని ఆన్నారు. 5/5 పంటకోత ఏర్పాటు చేయగా 20కేజీల దిగుబడి వచ్చిందని గుర్తించారు. అలాగే 5/5లో 16.150ప్రయోగానికి సంబంధించి ఎకరానికి 32 బస్తాలు దిగుబడి వచ్చిందని గుర్తించారు. వీటి ఆధారంగా సూక్ష్మపోషకాల ప్రాధాన్యత గురించి రైతులకు వివరించారు. అంతేకాకుండా ఈ సూక్ష్మపోషకాలు జింక్,జిప్స్‌మ్, పోరాం వంటివి వందశాతం రాయితీపై అందించడం జరుగుతుందని ఆశక్తిగల రైతులు స్థానిక వ్యవసాయ కార్యాలయం వద్దకు వచ్చి తీసుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో వ్యవసాయ అధికారి బి.కిరణ్‌కుమార్, ఎఇవొ అనుష, ఎం ఇవొ కృష్ణ తదితర సిబ్బంది సంబంధిత గ్రామాల రైతులు ఉన్నారు.
==============

వేంకటేశ్వరుని ఆలయం వద్ద దీపారాధన
జామి, నవంబర్ 21: మండలంలోని భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి కోటి దీపాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయనగరం వాస్తవ్యులు బ్రహ్మశ్రీ నారాయణశర్మ కార్తీక మాసంలో నిర్వహించుకుంటున్న దీపారాధన యొక్క ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు. కార్యక్రమంలో మండలంలో గల అనేక గ్రామాల మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా పూజలు నిర్వహించారు.