విజయనగరం

విద్యుత్ అంతరాయానికి సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల, నవంబర్ 21: విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని విజయనగరం రూరల్ విద్యుత్ శాఖ ఎడిఇ అనంతరావు కోరారు. బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ విద్యుత్ అభివృద్ధి పనుల్లో భాగంగా మండలంలో విద్యుత్‌కి అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. ముఖ్యంగా సారిపల్లి పారిశ్రామిక వాడల్లో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ ఉపకేంద్రంలో సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. దీనిలో భాగంగా 22న ఉదయం 9గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని తెలిపారు. దీనిలో విద్యుత్ ఉపకరణ పరిధిలో ఉన్న నెల్లిమర్ల, జరజాపుపేట, కొండగుంపాం, గరికిపేట, మొయిద, పూతికపేట గ్రామాల్లో ఉదయం 9గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని చెప్పారు. దీంతోపాటు నెల్లిమర్ల తాగునీటి పంపు హౌస్, మిమ్స్ ఆసుపత్రి, సారిపల్లి గ్రామం, సారిపల్లి పారిశ్రామిక వాడకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. అంతేకాకుండా విద్యుత్‌కు అంతరాయం ఈ నెల ఆఖరు వరకు ఉంటుందని వినియోగదారులు దీనికి సహకరించాలని కోరారు.
=============

ఆసుపత్రిలో పరిశుభ్రత పాటించాలి
నెల్లిమర్ల, నవంబర్ 21: ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశుభ్రత పాటించాలని పిహెచ్‌సి అభివృద్ధి కమిటీ చైర్మన్ పోనుమహంతి ఆదినారాయణ అన్నారు. బుధవారం ఆయన స్థానిక పిహెచ్‌సిని సందర్శించారు. ఈ సందర్భంగా పిహెచ్‌సి చైర్మన్ ఆదినారాయణ మాట్లాడుతూ రోగులు ఉపయోగించే బెడ్‌షీట్లను శుభ్రం చేసి మార్చాలని అన్నారు. అలాగే గతం కంటే ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం సిజేరియన్లు కూడా జరుగుతున్నాయని తెలిపారు. వైద్యులు నిత్యం అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఇప్పటికే పలు రకాల శస్తచ్రికిత్సలు ఆసుపత్రిలో జరుగుతున్నాయని చెప్పారు. రోగులకు ఇబ్బంది లేకుండా వైద్య సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
============

ర్యాలీ ఫర్ అంబేద్కర్‌ను విజయవంతం చేయండి
కొత్తవలస, నవంబర్ 21: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఆలోచనా విధానాలను ప్రజలకు తెలియజేసేందుకు ర్యాలీ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని తలపెట్టారని కొత్తవలస మండలం తుమ్మికాపల్లి గ్రామానికి చెందిన అంబేద్కర్ ఆశయ సాధన సంఘ సభ్యులు చుక్క ఈశ్వరరావు తెలిపారు. ఈ నెల 26న భారత రాజ్యాంగం సందర్భంగా 25వ తేదీన శృంగవరపుకోట నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ఆయన ఆలోచనా విధానాలను ప్రజలు అవలంభించడానికి ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పిస్తామని ఈ సందర్భంగా ఈశ్వరరావు తెలిపారు. ఆదివారం ఉదయం 9గంటలకు కొత్తవలసలో ర్యాలీ ప్రారంభమవుతుందని అక్కడి నుండి ఎల్.కోట, ఎస్.కోట,వేపాడ మీదుగా ర్యాలీ సాగుతుందని తెలిపారు. ఈ ర్యాలీలో అంబేద్కర్ ఆశయ సాధనకులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.అదేవిధంగా భారతరత్న అంబేద్కర్ ప్రపంచ మేధావిగా ఏ విధంగా వెలుగొందారో ప్రతి ఒక్క విద్యావంతుడు అవగాహన చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈకార్యక్రమంలో మండల అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ పాల్గొంది.
===============

గోకుల షెడ్లను శరవేగంగా నిర్మించుకోండి
కొత్తవలస, నవంబర్ 21: మండలంలో రైతులకు ప్రభుత్వం రాయితీపై అందించిన గోకులం పశువుల షెడ్లను త్వరగా నిర్మించుకోవాలని మల్లివీడు పశువైద్య కేంద్ర వైద్యాధికారి ఎస్.వి.సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మండలంలో 140 వరకు గోకులం షెడ్లను మంజూరు చేశామని, రైతులు త్వరగా వీటిని నిర్మించుకోవాలని ఆయన కోరారు. ఆలశ్యమైన కొద్ది నిర్మాణాలు మార్పులు,చేర్పులు జరగవచ్చు అని ఈ నెలాఖరులోగా నిర్మాణాలు పూర్తిచేయాలని తెలిపారు. మరికొంతమంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారని, ముందుగా మంజూరు చేసిన షెడ్లు నిర్మాణం పూర్తయిన వెంటనే కొత్తవాటికి అనుమతులు ఇస్తామని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు సుమారుగా 50వరకు షెడ్లు నిర్మాణ దశలో ఉన్నాయని, మిగతావారు త్వరగా ప్రారంభించాలని, లేదంటే మంజూరులు రద్దు చేస్తామని తెలిపారు. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరైతుకు పశువుల షెడ్ నిర్మించుకునేందుకు ప్రభుత్వం అవకాశంకల్పిస్తుందని, కంగారు పడవలసిన పనిలేదని ఆయన చెప్పారు.
=======

గర్భిణులకు వ్యాధి నిరోధక టీకాలు
కొత్తవలస, నవంబర్ 21: మండలంలోని తుమ్మికాపల్లి గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం వద్ద బుధవారం వియ్యంపేట పిహెచ్‌సి హెల్త్ అసిస్టెంట్ ఎల్.సత్యారావు ఆధ్వర్యంలో గర్భిణీలకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. పిహెచ్‌సి వైద్య సిబ్బందితో కలసి అంగన్‌వాడీ కేంద్రంలోని ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు, బాలింతలకు వ్యాధి నిరోధక టీకాలు వేశామని సత్యారావు తెలిపారు. తొమ్మిది నెలల నుండి ఏడు ఐదు సంవత్సరాల వరకు ప్రతి ఆరు నెలలకు టీకాలు వేసుకోవాలని తెలిపారు. పిహెచ్‌సి పరిధిలో గల అన్ని గ్రామాల్లోను ఈకార్యక్రమం నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. విటమిన్-ఎ ద్రావణం ద్వారా పిల్లల్లో వచ్చే రేచీకటి, కంటి సంబంధిత వ్యాధులను నివారించవచ్చు అని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఎనిమిదిరకాల వ్యాధి నిరోధక టీకాలు పిల్లలకు వేశామని చెప్పారు. మొత్తం 190మందికి టీకాలు ఇచ్చామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు నారాయణమ్మ, ఎఎన్‌ఎం ఎ.దేవి, ఆశాకార్యకర్తలు వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
==========