విజయనగరం

ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, నవంబర్ 21: కృషి, పట్టుదల, ఆత్మ విశ్వాసంతో బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ముందుకు సాగాలని అకడమిక్ రాష్ట్ర రిసోర్సు పర్సన్ ఏ.ప్రవీణ్‌కుమార్ అన్నారు. బుధవారం స్ధానిక వాసవీ కల్యాణమండపంలో ఏపీ మహిళా సమతా సొసైటీ క్లస్టర్ రిసోర్స్ పర్సన్ ఆర్.సత్యవాణి పర్యవేక్షణలో బాలికలకు కెరీయర్ గైడెన్స్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోని తల్లిదండ్రులు బాలికల చదువుపై చిన్నచూపు చూస్తున్నారని , పదవ తరగతి పూర్తి అవ్వగానే చదువు మానిపిస్తున్నారని తెలిపారు. ఈ ప్రయత్నానికి స్వస్తి పలికి బాలికలు అన్ని రంగాలలో అభివృద్ధిలా అందరు కృషి చేయాలని కోరారు. బాలికలు ముందుగా ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని దీనిని సాధించేందుకు ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వాలు బాలికల అభివృద్ధికి ఏన్నో పధకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. బాలికలు, మహిళలు తమ కాలమీద తాము నిలబడటానికి ఆర్ధిక సహాయాన్ని అందజేస్తున్నదని చెప్పారు. జిల్లాలో గజపతినగరం, మెంటాడ, నెల్లిమర్ల, గుర్ల, దత్తిరాజేరు మండలాలను ఎంపిక చేసి 272 బాలసంఘాలు ఏర్పాటు చేశామని చెప్పారు. బాలికలకు ఏడు అంశాలపై అవగాహన పెంచడమే తమ ధ్యేయమని తెలిపారు. క్లస్టర్ రిసోర్స్ పర్సన్ ఆర్.సత్యవాణి మాట్లాడుతూ అవగాహన కల్పించిన అంశాలు అమలు చేయడానికి కృషి చేయాలని కోరారు. ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాలలో ముందడుగులో ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో మెంటాడ ఇన్‌చార్జి సి.హెచ్. నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.
=============

చదువుతోనే ఉజ్వల భవిష్యత్
గజపతినగరం, నవంబర్ 21: చదువుతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ లభిస్తుందని గజపతినగరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎస్.విద్యాసాగర్ అన్నారు. మండలంలోని మరుపల్లి గ్రామం పరిధిలో గల బాలాజీ పాలిటెక్నికల్ విద్యా సంస్థలో విద్యార్థులకు పలు అంశాలపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్తులు చదువుతోపాటు నైతిక విలువలు పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థుల చదువుపై ఉపాద్యాయులతోపాటు తల్లిదండ్రులు కూడా శ్రద్ధ కనబర్చి భవిష్యత్‌కు పునాదులు వేయాలని అన్నారు. ఇప్పటి నుంచే క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని అన్నారు. అదేవిధంగా పాఠశాలల్లో ర్యాగింగ్ చేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ర్యాగింగ్ చేసినా, ఇతర విద్యార్థులను ఇబ్బందిపెట్టినా, కొట్టినా, హింసించినా, అవహేళనగా మాట్లాడినా చట్టప్రకారం శిక్షకు గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు. ర్యాగింగ్‌లతో కళాశాలకు, తల్లిదండ్రులకు చెడ్డపేరు తీసుకురావద్దు అని హితవుపలికారు. లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపేవారిపైనే కాకుండా లైసెన్స్‌లేనివారికి వాహనం ఇచ్చిన యజమానిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం గజపతినగరం సిఐ విద్యాసాగర్, ఎస్సై జె.తారకేశ్వరరావులను కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బాలాజీ విద్యా సంస్థల కరస్పాండెంట్ రెడ్డిచంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
=============

కొత్తరకం వరి వంగడాలతో అధిక దిగుబడులు
బొండపల్లి, నవంబర్ 21: కొత్త రకం వరి వంగడాలతో అధిక దిగుబడులు సాధించవచ్చని మండల వ్యవసాయ అధికారి కె.రవీంద్ర అన్నారు. బుధవారం మండలంలోని కనిమెరక గ్రామంలో క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంటియు 1121 అనే రకాన్ని ఎంటియు 1001స్ధానంలో వేయాలని అన్నారు. మన వాతావరణ పరిస్ధితులకు మన నేలకు చాలా అనుకూలంగా ఉందని తెలిపారు. 1001తో పోలిస్తే మంచి దిగుబడి సాధిస్తుందని తెలియజేశారు. గింజ రంగు, నాణ్యత కూడా చాలా బాగుందని రైతులు ఈ రకాన్ని బాగా వినియోంచుకోవచ్చని చెప్పారు. తద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని అన్నారు. ఈ రకానికి పురుగులు, తెగుళ్లు ఉదృతి కూడా తక్కువగానే ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు ఆర్.కృష్ణమూర్తి, ఆర్.సంతోష్, ఎంపి ఇవొ వినయ్ రైతులు దాట్ల శ్రీనివాసరాజు, అల్లు రమణ, గ్రామ రైతులు పాల్గొన్నారు.
===============

రూ.2 కోట్లతో ప్రహరీల నిర్మాణాలు
బొండపల్లి, నవంబర్ 21: మండలంలోని 38 పాఠశాలలకు రెండు కోట్ల నిధుల ఖర్చుతో ప్రహారీ గోడల నిర్మాణాలు చేపడుతున్నామని విజయనగరం డివిజన్ సర్వశిక్ష అభియాన్ డిఇ వై.పోలీస్ తెలిపారు. బుధవారం మండలంలోని బిళ్ళలవలస హైస్కూల్‌లో నిర్మించిన ప్రహరీగోడను డిఇ పరిశీలించారు. ఇప్పటి వరకు 26 పాఠశాలల్లో పనులు ప్రారంభించామని తెలిపారు. నిర్మాణంలో నాణ్యతాలోపం లేకుండా పర్యవేక్షణ చేపడుతున్నామని చెప్పారు. అలక్ష్యం చేసే గుత్తేదారులుపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇసి రెడ్డి శాంతారావు తదితరులు పాల్గొన్నారు.
================