విజయనగరం

జివిఎంసి పైపులైన్ ద్వారా నీటి మళ్లింపునకు ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), నవంబర్ 21: తాటిపూడి రిజర్వాయర్ నుంచి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి) పైపులైన్ల ద్వారా విశాఖకు తరలిస్తున్న నీటిని కొంతమేరకు మళ్లించి విజయనగరం పట్టణ ప్రజల దాహార్తిని తీర్చించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గోస్తనీనది ఎండిపోవడంతో విజయనగరం పట్టణవాసులకు మంచినీటిని సరఫరా చేసే మధుపాడ హెడ్‌వాటర్‌వర్క్స్ నుంచి గత రెండునెలలుగా మంచినీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోక్యం చేసుకుని జివిఎంసి పైపులైన్ల ద్వారా విశాఖకు తీసుకువెళుతున్న నీటిని విజయనగరం ప్రజల దాహార్తిని తీర్చడానికి మళ్లింపువిషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ మేరకు జివిఎంసి కమిషనర్ హరినారాయణ, చీఫ్ ఇంజనీర్ దుర్గాప్రసాద్, సూపరిండెంటెంట్ ఇంజనీర్ పల్లంరాజు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజారావు, విశాఖ సర్కిల్ పబ్లిక్‌హెల్త్ సూపరిండెంటెంట్ ఇంజనీర్ బిహెచ్. శ్రీనివాసరావు, విజయనగరం మున్సిపల్ కమిషర్ టి.వేణుగోపాల్, మున్సిపల్ ఇంజనీర్ ఎస్.మత్స్యరాజు, పబ్లిక్ హెల్త్ విజయనగరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గణపతిరావు బుధవారం తాటిపూడి రిజర్వాయర్‌ను సందర్శించారు. తాటిపూడి రిజర్వాయర్‌లో నీటినిల్వలు, విజయనగరం పట్టణానికి ఎంతమేరకు నీటిని విడుదల చేయగలమనే విషయంపై చర్చించారు. తాటిపూడి రిజర్వాయర్ కింద గోస్తనీనదిలో నిర్మించిన పది ఊటబావుల్లో భూగర్భజలాలు పూర్తిస్థాయిలో ఇంకిపోయి విద్యుత్ మోటార్లకు నీరు అందని పరిస్థితిని గమనించారు. అయితే మంచినీటి సరఫరాపై ఆంధ్రభూమిలో వచ్చిన కథనాలతోపాటు ఎమ్మెల్యే మీసాల గీత కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. దీంతో విజయనగరం పట్టణంలో ఏర్పడిన మంచినీటి సమస్యలను పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆ మేరకు జివిఎంసి కమిషనర్ హరినారాయణ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అధికారుల ప్రతినిధి బృందం తాటిపూడి రిజర్వాయర్‌ను సందర్శించారు. విజయనగరం పట్టణానికి ఎంతమేరకు నీటిని అందించగలమనే అంచనాలు తయారు చేయాలని ఇంజనీర్లను జివిఎంసి కమిషనర్ ఆదేశించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, ప్రభుత్వ ఆదేశాల మేరకు నీటిని విడుదల చేస్తామని తెలియజేశారు. అయితే నీటిని రిజర్వాయర్ నుంచి విడుదల చేసినప్పుడు ఎక్కువగా వృధా అయ్యే అవకాశాలు ఉన్నందున జివిఎంసి పైపులైన్ నుంచి మున్సిపాలిటీ ఊటబావులకు ఒక ఛానల్ తవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాటర్‌వర్క్స్ డిఇ శ్రీనివాస్, ఎలక్ట్రికల్ డిఇ శ్రీనివాస్, ఎఇ కేదారినాధ్ తదితరులు పాల్గొన్నారు.
===========

వైభవంగా శ్రీవల్లీదేవసేన సుబ్మ్రణ్యస్వామికి కల్యాణం
గజపతినగరం, నవంబర్ 21: గజపతినగరం ఉమారామలింగేశ్వర ఆలయంలో సుభ్రమణ్యస్వామివారికి కల్యాణం వైభవంగా నిర్వహించారు. భగవాన్ సత్యసాయిబాబా 93వ జయంతి పురష్కరించుకొని బుధవారం శ్రీవల్లీదేవసేన సుబ్మ్రణ్యస్వామికి కల్యాణాన్ని జరిపారు. తిరుమల తిరుపతి దేవస్ధానం వేదపండితులు వేదుల భువనేశ్వర ప్రసాదశర్మ పర్యవేక్షణలో అర్చకులు చంద్రవౌళి పొట్టా బాలకృష్ణ, రాధ దంపతులచేత కల్యాణం నిర్వహించారు. ఈ కల్యాణం తిలకించడానికి మహిళా భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తుల అందరికి ప్రసాదాలు అందించారు. సత్యసాయి సేవా సమితి కన్వీనర్ వెంకటేష్ ఆధ్వర్యంలో సేవా సమితి సభ్యులు ఈ కల్యాణాన్ని కన్నుల పండువగా జరిపారు. కార్యక్రమంలో సేవాసమితి నాయకులు పొట్టా శ్రీనివాసరావు, మెట్ట సత్యనారాయణ, పొట్టావెంకట రమణారావు, సునీల్‌కుమార్ రధో, లోచర్ల మనోహర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
==========

మొక్కలు నాటారు
గజపతినగరం, నవంబర్ 21: జాడలేని వనం-మనం అన్న శీర్షికతో వచ్చిన వార్తకు స్పందించిన అటవీశాఖ అధికారులు పురిటిపెంటలో రోడ్డుకు ఇరువైపులా కొత్తగా మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రోడ్డు పక్కన మొక్కలను గొయ్యలు తవ్వకుండా అలాగే వదిలేసి మొక్కలకు నీళ్లు పోస్తున్న సంఘటన వెలుగులోకి తేవడంతో అధికారులు స్పందించి కొత్తగా మొక్కలను తెప్పించి మొక్కలకు ప్రతిరోజూ నీళ్లుపోసి సంరక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. అలాగే నియోజకవర్గంలో ప్రతి ఏడాది వేలాది మొక్కలు పంపిణీ చేయడం ప్రతి ఏడాది వీటి సంరక్షణ కోసం కోట్లాది రూపాయలు ఖర్చుచేయడం పరిపాటిగా మారింది. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి అటవీశాఖ మొక్కలను పెంచే కార్యక్రమం పేరుతో ప్రతి ఏడాది కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా ఆదిశగా మాత్రమే మొక్కలు పెరుగుతున్న ఆనవాలు మాత్రం కానరావడం లేదు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆదిశగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
================