విజయనగరం

ప్రజలగోడు పట్టని చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్) మే 13: అధికారంలోకి వస్తేప్రజలకు కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండేళ్లు కావచ్చినా కనీసం ప్రజలగోడు పట్టించుకునే స్ధితిలో లేకపోవడం సిగ్గుచేటని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి విమర్శించారు. శుక్రవారం సాయంత్రం పిసిసి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ కరువు అధ్యయన బృందం మండలంలోని గుంకలాంగ్రామంలో పర్యటించింది. కొండచెరువు,పెద్దచెరువులతోపాటు బోరుబావులను రఘవీరానేతృత్వంలోని కాంగ్రెస్ బృందం పరీశీలించింది. గ్రామంలోని రామమందిరం వద్ద జిల్లాకాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆదిరాజు అధ్యక్షతన జరిగిన సభలో బాబు పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తినని పింఛన్ ఇవ్వలేదని పెద్దాయన ఆవేదన వ్యక్తంచేసాడు.రెండుకాళ్లు లేకపోయినా పింఛను లేదని వృద్ధురాలు వాపోయింది. డ్వాక్రామహిళా సంఘాలకు పూర్తిరుణమాఫీ కాలేదని కానీ మూడువేలు ఖాతాలో వేసారని పైడిరాజు అనే డ్వాక్రామహిళ తెలిపింది. రైతురుణాలు, పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పిన బాబు అవేమి అమలుచేయలేదని గ్రామస్థులు రఘవీరాకు మొరపెట్టుకున్నారు. పిసిసి అధ్యక్షుడు రఘవీరా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్మి ఓట్లు వేస్తే ప్రజల గోడు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కరవు పరిస్థితులు కళ్లెదుటే కనిపిస్తున్నా ఈప్రభుత్వం కళ్లు తెరచి చూడలేని స్థితిలో ఉందని ఆయన ధ్వజమెత్తారు. అరచేతిలో వైకుంఠం చూపిన బాబు కళ్లుతెరిపించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుజరిగే వరకు ప్రజలవెంట తాము ఉంటామని రఘవీరా భరోసా ఇచ్చారు. ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు బుంగభానుమూర్తి,మహంతి సతీష్, అప్పలనాయడు, ఖలీల్ పాల్గొన్నారు.