విజయనగరం

జలసంరక్షణ అందరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దత్తిరాజేరు, మే 13: వృథాగా పోయే నీటిని భూమిలోకి ఇంకింప జేస్తే భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని ఎజెసి నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం చేయూత స్వచ్ఛందసంస్థ సహకారంతో పోరలి గ్రామంలో ఇంకుడు గుంతలు తవ్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జల సంరక్షణలో అందరు భాగస్వాములు కావాలని కోరారు. సెట్విజ్ సి ఇ ఓ దుర్గారావు మాట్లాడుతూ నీటి వినియోగంలో నిర్లక్ష్యం వహిస్తే బావితరాలకు తాగు,సాగునీటి సంక్షోభాన్ని కల్పించినవారము అవుతామని అన్నారు. ఎంపిపి బి.రాజేశ్వరి మాట్లాడుతూ నీటి వనరులు అభివృద్దిచేసుకునేందుకు ప్రతి ఇంటిముందు ఇంకుడు గుంత తవ్వి జలవనరులు పెంపొందించేందుకు ప్రజలు సహకరించాలన్నారు.
.